“ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది”
“పౌలును తిమోతియును”
ఒక పరిచయములో రెండు ప్రథానమైన హద్దులు ఉంటాయి. పరిచయకర్త మరియు చిరునామాదారుడు. పై మాటలు పరిచయకర్తలను గుర్తిస్తుంది. పరిశుద్ధాత్మ లేఖనముల అసలైన గ్రంథకర్త (మానవ సాధనాలను ఉపయోగించి).
ఇక్కడ ఒక వృద్ధుడు మరియు ఒక యౌవనస్తుడు కలసి పనిచేస్తున్నారు. తిమోతీ అపోస్తలుడైన పౌలుయొక్క “జేబు ప్రతి”. ఇది ఒక అద్బుతమైన సహవాసం. ఒక వృద్ధునికి ఒక యౌవనస్తునికి మధ్య ఉమ్మడిగా ఏ విషయాలు ఉండవు. వారి ఆశ, పట్టుదల మరియు ఆశక్తి అన్ని భిన్నంగా ఉంటాయి. వారిద్దరిమధ్య ఉమ్మడిగా ఉన్న ఒకే ఒక్క విషయం-ప్రభువైన యేసు. ప్రజలను వేరుచేసే దూరాలను యేసుక్రీస్తు నాశనం చేస్తాడు.
వారు ఒకరికొకరు భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. పౌలు అసలైన హెబ్రీయుడు. తిమోతి సగం యూదుడు మరియు సగం అన్యజనుడు-అతను సంకర జాతివాడు! అతను యూదుడుకాదు, అన్యజనుడుి కాదు! ఇక్కడ ఈ మనుష్యులు కలసియున్నారు; యేసుక్రీస్తు ఈ కార్యం చేసాడు.
వారు తమ విద్యలో పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్నారు. పౌలు గమలీయేలు పాదాల వద్ద పెరిగాడు (అపొస్తలుల కార్యములు 22:3). ఈనాటి ఉన్నత విద్యకు సమానమైన విద్యను కలిగియున్నాడుో. ఇతను జాలరులైన 12 మంది వలె కాదు, బాగా శిక్షణ పొందినవాడు. ఇతను క్రొత్త నిబంధనలో సగభాగం రాశాడు. కానీ తిమోతికి అధికారిక విద్య ఉన్నట్లు ఆధారంలేదు. అతనికి ఏ విధమైన విద్యార్హత లేదు. ఇక్కడ వారు క్రీస్తులో ఐక్యంగా ఉన్నారు. క్రీస్తులో మాత్రమే ఒక సాధారణ సమావేశ స్థలం ఉంది.
“క్రీస్తుయేసు దాసులైన”
పౌలు తన అలవాటుప్రకారం, యేసుక్రీస్తుతో తన సంబంధాన్ని ముందుగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు విషయానికి వస్తే తటస్థత ఉండదు! అతను మరియు తిమోతి “యేసుక్రీస్తుకు దాసులు”. సరిగ్గా గమనిస్తే వారుయేసుక్రీస్తుకు తమ్మును పూర్తిగా అప్పగించుకొనిన దాసులు. రోమన్ సామ్రాజ్యంలో మొదటి శతాబ్దంలో 5 కోట్ల మంది బానిసలు ఉండేవారు. ఒక బానిసకు ఒక జంతువుకు ఉన్న హక్కులుకూడా ఉండేవి కావు. పౌలు మరియు తిమోతికి హక్కులు లేవు: “మనము యేసుకు చెందినవారము-శరీరము, ప్రాణము మరియు ఆత్మ. ఆయన మనతో తనకు ఇష్టమువచ్చినట్లు చేయవచ్చు. మన జీవితముపై మనకున్న హక్కులను మనము వదులుకున్నాము. మనము యేసురాజుకు చెందినవారము.” అక్కడే మనకు నిజమైన స్వేచ్ఛ!
ఇప్పటినుండి 100 సంవత్సరాలలో, నేటి మహాత్ములను మనమెంత అనుసరించామన్నది చాలా కొద్ది మార్పును తెస్తుంది. కానీ రానున్న 100 సంవత్సరాలలో యేసుక్రీస్తు దృష్ట్యా మనమెక్కడ ఉన్నామన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయం నిత్యత్వములో మనమెక్కడ ఉంటామన్నదానిని నిర్ణయిస్తుంది. మన జీవితాలను ఎలా గడిపామన్నది ఇది నిర్దేశిస్తుంది.
మీరు బానిస కావడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? యేసుకు దాసునిగా ఉండడం అంటే మరెవరూ సొంతం చేసుకోలేని స్వేచ్ఛను కలిగి ఉండటం. మనం ఇప్పటికే బానిసలం “పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు” (యోహాను 8 34). సమస్య భానిసత్వము గూర్చికాదు; ఎవరికి దాసులుగా ఉన్నామన్నదే ముఖ్యవిషయం-పాపమునకా లేదా యేసుక్రీస్తుకా.
పౌలు తన ఉజ్వలమైన జీవితాన్ని ఒక చెరసాలలో ముగించాడు, మరియు ఒక శిరచ్ఛేదన యంత్రము ద్వారా పరలోకానికి తరలివెళ్ళాడు-అతడు శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ఇది ఇకనాటి తార్సువాడైన సౌలును గూర్చిన గోరంత చిత్రం. అతడు వెనుదీయకుండా తన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించాడు.
నియమము:
మనము కృతజ్ఞతాపూర్వకముగా రాజును సేవిస్తాము.
అన్వయము:
సిలువపై ఆయన మరణమునుబట్టి మనము యేసురాజుకు చెందినవారము. మనము కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను సేవించాలి.
మిమ్ములను మీరే సేవించుకుంటున్నారా? నిస్సందేహంగా మిమ్ములను యేసుక్రీస్తుకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నారా? కృతజ్ఞతాభావముతో ఆయనను సేవిస్తారా?