Select Page
Read Introduction to Philippians Telugu

 

“మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను”

 

“రూఢిగా నమ్ముచున్నాను”

“నేను నిశ్చయత కలిగియున్నాను. ఈ విషయంలో నాకు ఖచ్చితంగా తెలుసు. ” ఫిలిప్పీయులలో సత్ క్రియను ప్రారంభించిన దేవుడు దానిని కొనసాగిస్తాడని పౌలు నిశ్చయత కలిగియున్నాడు. దేవుడు మనలో రక్షణ కార్యాన్ని ప్రారంభించినప్పుడు, ఆయన దానిని పూర్తి చేస్తాడు. దేవుడు తాను పూర్తి చేయలేని దేనినీ ప్రారంభించడు. దేవుడు మనలో ఒక పనిని ప్రారంభించినప్పుడు, ఆయన దానిని పూర్తి చేసే వరకు చూస్తాడు.

దేవుడు మనలో పని చేస్తాడు లేదా ఆయన మన పై పని చేస్తాడు, కాని ఆయన ఆ పనిని పూర్తి చేస్తాడు. మనకు అది పూర్తి కావాలా వద్దా అని అనుకున్నప్పటికీ దానిని ఆయన పూర్తి చేస్తాడు! మనము క్రీస్తును తెలుసుకున్న తర్వాత, “ప్రక్రియను ఆపండి- నాకు అవసరం లేదు” అని చెప్పలేము. “నాకు ఇది నిశ్చయంగా ఉంది; ఇది చర్చనీయాంశం కాదు. నాకు నమ్మకం ఉంది” అని పౌలు అంటున్నాడు.

ఈ నమ్మకమే పౌలుకు ఆనందాన్ని ఇచ్చింది. “నమ్ముట” అంటే సహేతుకమైన కారణాల ఆధారంగా నిర్థారించుట. దేవుడు వేలాది సంవత్సరాలుగా కోట్లాదిమంది యొక్క జాగ్రత్త చూసుకున్నాడు మరియు ఒక వ్యక్తిని కూడా నిరాశపరచలేదు. పౌలు నమ్మకము దేవుని సామర్థ్యంపై ఉంది మనుష్యులపై కాదు. గ్రీకు భాషలో ఇది పౌలు మనసులోని ఒక స్థిర విశ్వాసం అని సూచిస్తుంది. తాను ప్రారంభించిన కార్యమును ముగించగల దేవుని సామర్థ్యం పై పౌలుకు ఉన్న విశ్వాసం తగ్గలేదు.

“మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు”

దేవుడు దానిని ప్రారంభించాడు; దేవుడు దానిని పూర్తి చేస్తాడు. రక్షణలో దేవుడు సంపూర్ణ కార్యం చేశాడు. ఏ విధంగానూ అది చాలనిదిగా లేదా అసంపూర్ణంగా లేదు. మన రక్షణ కొరకు దేవుడు మనకోసం చేయగలిగినదంతా చేశాడు. ఈ ప్రకరణం యొక్క సూత్రం ఏమిటంటే: మనము శత్రువులముగా ఉన్నప్పుడే దేవుడు మన రక్షణ కొరకు ఇంతగా చేసినప్పుడు, ఇప్పుడు మనము ఆయన పిల్లలమైన తరువాత ఇంకెంతగా ఆయన చేయగలడు? జవాబు: ఇంకా ఎంతో అధికంగాి. ఇది ఒక నియమము, కానీ పౌలు చెప్పిన తదుపరి మాటను గమనించండి.

“దానిని కొనసాగించునని”

ఈ మాటలకు అర్థం ఒక ముగింపుకు తీసుకొనిరావడం. దేవుడు తాను ప్రారంభించిన దాన్ని పూర్తి చేస్తాడు. ఆయన దానిపై తన తుది మెరుగులు వేస్తాడు.

వారి పరిస్థితిపై దేవుడు నియంత్రణ కోల్పోతాడనే ఆలోచనతో చాలా మంది ప్రజలు ఆవేదన చెందుతారు. కాని దేవుడు మనలను వదులుకోడు. తాడుతో కట్టబడిన కుక్క ఎంతవరకు వెళ్లగలదో అంతవరకే ఆయన మనలను అనుమతిస్తాడుు. మనము  ప్రభువు నుండి పరుగెత్తి, ఆ త్రాడు అంచుకు వచ్చినప్పుడు మనము  భయంకరమైన కుదుపుకు వస్తాము.

యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. (కీర్తనలు 138:8)

ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. (రోమా 5:10)

నియమము:

క్రీస్తు యొక్క అసంపూర్ణమైన పని మన కోసం మధ్యవర్తిత్వం చేయడం.

అన్వయము:

క్రీస్తు మన కోసం చేస్తున్న ప్రస్తుత పనిపై మనకు నమ్మకం ఉందా? ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దానికి మధ్యవర్తిత్వం వహించమని ఆయనను విశ్వసించగలమా?

Share