Select Page
Read Introduction to Philippians Telugu

 

“నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.”

 

“నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.”

పౌలు ఆ విధముగా ఆలోచించడం సరియైనదే లేక తగినదే.

“అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు.” (సామెతలు 23 7)

పౌలు ఫిలిప్పీయులకు బోధించాడు, వారి గురించి ఆలోచించడం అతని బాధ్యత. నాయకత్వంలో ఉన్నవారు దేవుని వాక్య వెలుగులో వారు నడిపించే వ్యక్తుల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.

 “హృదయం” అనే పదానికి సంపూర్ణ వ్యక్తి అని అర్ధం. ఈ పదం విశ్వాసి యొక్క భావోద్వేగ జీవితమును మించిన అర్థాన్ని ఇస్తుంది. ఉత్తర అమెరికా సమాజంలో వాలెంటైన్స్ డే లేదా శరీరానికి భౌతిక పంపు పరంగా “హృదయం” గురించి ఆలోచిస్తాము. బైబిల్ పదం ఈ రెంటికీ అన్వయించదు. పౌలు సంపూర్ణ వ్యక్తిగా ఫిలిప్పీయుల గురించి ఆలోచించాడు. అతను తన మొత్తం స్వీయతను వారికి ఇచ్చాడు.

2 కొరింథీయులలో 7:3 లో పౌలు ఇలా అన్నాడు, “మీకు శిక్షావిధి కలుగ వలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని గదా.” పరిచర్య పౌలుకు కేవలము ఉద్యోగం లేదా వృత్తి కాదు. దేవుని ప్రజలు పౌలు హృదయంలో ఉన్నారు. వారు అతనిని పట్టుకున్నారు; వారు అతనిలో భాగమే.

“నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును”

“నా బంధకములయందును” – పౌలు చెరశాలలో ఉన్నాడు.

పౌలు తన హృదయంలో ఫిలిప్పీయులను రెండు విభాగాలుగా కలిగి ఉన్నాడు: సువార్తపక్షమున వాదించుటయందు మరియు దానిని స్థిరపరచుటయందు.  ఫిలిప్పీ వద్ద ఉన్నవారు సువార్తను సమర్థించడంలో పౌలుతో భాగస్వాములు. వారు కలిసి ఉన్నారు. వారందరూ ఒకే బృందములో ఉన్నారు.

పౌలు సందేశాన్ని తయారు చేయలేదు; అతను దానిని కేవలము అందించాడు. వారు దాని విలువను గుర్తెరిగి దానిని అంగీకరిచారు. చాలా సంవత్సరాల క్రితం దమస్కు వెళ్ళే మార్గంలో పౌలుకు చేసిన కార్యమే ఈ సందేశం ఫిలిప్పీయులకు చేసింది. ఇప్పుడు వారు సువార్త పక్షముగా వాదించుటలో మరియు దానిని స్థిరపరచుటలో పాలివారయ్యారు.

సువార్త మాటల చేత వాదించబడుతుంది మరియు క్రియల చేత స్థిరపరచబడుతుంది. మనము పెదవులతో సువార్త పక్షముగా వాదిస్తాము మరియు జీవితాలతో సువార్తను స్థిరపరుస్తాము. సువార్తను ప్రకటించుట ఒక ఎత్తయితే దానికి అనుగుణంగా జీవించుట మరొక ఎత్తు.. ఇది పూర్తిగా వేరే విషయం. కాబట్టి సువార్తతో రెండు విషయాలు చేయవలసి ఉంది: దాని పక్షముగా వాదించుట మరియు దానిని స్థిరపరచుట. సువార్త పక్షముగా వాదించుట అంటే దానిని ఆమోదించడం, దాన్ని బలోపేతం చేయడం, ప్రాముఖ్యమైనదిగా లెక్కించడం. మనము సువార్తకు అనుగుణంగా జీవించినప్పుడు సువార్తకు విశ్వసనీయతను ఇస్తాము; సువార్తను జీవిస్తున్న ఒకరి ప్రదర్శనను చూడగలిగితే ప్రజలు సువార్తను విశ్వసించటానికి మొగ్గు చూపుతారు.

మీ కోసం సువార్త ఏమి చేసింది? సువార్త మీ జీవన విధానాన్ని మార్చివేసిందా? సువార్త మీకు ఎప్పుడైనా సహాయం చేసిందా? అవునా? అయితే ఎలాగో చెప్పండి. సాక్ష్యం చెప్పడం అంటే ఇదే. సువార్తను స్థిరపరచుట అంటే సువార్త మీ కోసం ఏమి చేసిందో నివేదించడం. “నేను క్రైస్తవునిగా మారడానికి ముందు నేను అలా ఉండేవాడను , ఇప్పుడు నేను క్రైస్తవుడిని కాబట్టి నేను ఇలా ఉన్నాను” సువార్తను స్థిరపరచుట అంటే అది.

‘స్థిరపరచుట ‘ అంటే హామీ ఇచ్చుట, స్థాపించుట లేదా భద్రత కల్పించుట. భద్రతకు హామి ఇచ్చేటట్లుగా స్థాపనచేయుట అనే అర్థం ఇస్తుంది. సువార్త మన జీవితం ద్వారా సంరక్షించబడుతుంది.

నియమము :

క్రీస్తునుగూర్చి పంచుకోవడములో రెండు విధానాలు ఉన్నాయి: పెదవులు మరియు జీవితము.

అన్వయము :

క్రీస్తునుగూర్చి పంచుకోవడములో రెండు విధానాలు ఉన్నాయి: పెదవులు మరియు జీవితము. క్రీస్తుకు పూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ రెండూ అవసరమైనవి.

మనము సువార్తను వ్యక్తపరుస్తున్నామా, మారిన జీవితాలతో సువార్తను స్థిరపరుస్తున్నామా?

మీరు సువార్తకు విశ్వసనీయత ఇస్తున్నారా?

Share