Select Page
Read Introduction to Philippians Telugu

 

“నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.”

 

“ఈ కృపలో నాతోకూడ”

ఫిలిప్పీలోని ప్రజలు పౌలుకు ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా మద్దతు ఇచ్చారు. పౌలును క్రీస్తు వద్దకు తీసుకువచ్చిన అదే కృపలో వారు భాగస్వామ్యం పొందటమే కాదు, పౌలును మిషనరీగా చేసిన అదే కృపలో కూడా వారు భాగస్వామ్యం పంచుకున్నారు. వారు పౌలు పరిచర్యలో పాలివారయ్యారు.

వారు పౌలుకు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతిసారీ, ఆయన పనిలో వారికి పాలిభాగం ఉంది, ఆయన పనిలో వాటా ఉంది, ఆయనలో వారికి భాగస్వామ్యం ఉంది. “నేను పౌలు పరిచర్యలో ₹500 పెట్టుబడి పెట్టాను; ఆయన పరిచర్యలో ₹1000 పెట్టుబడి పెట్టాను. “పౌలు పరిచర్యలో ₹500 వాటా కలిగి ఉండటం గొప్ప విషయం కాదా ?! క్రీస్తు న్యాయపీఠము వద్ద తిరిగి వచ్చే వంతును గురించి ఆలోచించండి! మీరు అలాంటి సువార్త సంస్థల పట్ల బాధ్యత కలిగిై చూస్తున్నారా? సువార్తికునితో మనకు వాటా ఉంటుంది. ఆ శాశ్వతమైన పెట్టుబడి మహిమలో లాభమును చెల్లిస్తుంది.

“ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.” (హెబ్రీ 10:34)

నియమము :

పరిచర్యలో ఉన్నవారికి మనము ఆర్థికంగా సహాయపడినప్పుడు, వారి పరిచర్యలో మనకు భాగస్వామ్యం ఉంది మరియు ప్రతిఫలం ఉంటుంది.

అన్వయము:

ఒక సువార్తికుడు ప్రభువు కొరకు కొందరిని సంపాదించిన ప్రతిసారీ, దానిలో క్రీస్తు న్యాయపీఠము వద్ద మనకు కొంత శాతం లభిస్తుంది. దేవునివద్ద అవి నమోదు చేయబడతాయి.

 ప్రజలు సామర్థ్యంగల బాక్సర్‌ను చూసినప్పుడు, వారు ఆ యువకుడిలో స్టాక్ కొనుగోలు చేస్తారు. ఇది వ్యాపార ఒప్పందం. బహుశా ఐదుగురు అతనిలో స్టాక్ కొంటారు. వారు తమ డబ్బును తిరిగి పొందాలని మరియు కొంత లాభం పొందాలని ఆశిస్తారు. మనము ప్రభువు పనిలో పెట్టుబడి పెట్టినప్పుడు, మనం తిరిగి ఏదో ఆశిస్తాము -ఇక్కడ కాదు, ఇకమీదట. మీరు ఖర్చుచేసిన తరువాత మీరు తిరిగి ఏమి పొందుకోకూడదు అని దేవుడు ఆశించడు. దేవుని ప్రతిఫలము మన అంచనాలకు మించి ఉంటుంది. ప్రపంచం డబ్బు ఆధారంగా పనిచేస్తుంది, కానీ అది ఏమి ఇస్తుంది? మనము మన డబ్బును పెట్టుబడి పెట్టినప్పుడు, ఉత్తమ రాబడిని పొందాలనుకుంటాము. మనము దేవుని పనిలో పెట్టుబడి పెట్టినప్పుడు, మనకు శాశ్వతమైన రాబడి లభిస్తుంది.

Share