Select Page
Read Introduction to Philippians Telugu

 

ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును,

 

ఈ ప్రసిద్ద వచన౦ చాలామ౦ది క్రైస్తవులు ఒక జీవితవచన౦గా కంఠత పెడుతుంటారు లేదా అనుసరిస్తుంటారు. ఈ వచనము సందర్భాన్ని బట్టి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. పౌలు తన వ్యక్తిగత సాక్ష్య౦ ఇస్తున్న సంధర్భము మధ్యలో ఉన్నాడు. ఈ ఆత్మకథలో తన మత సంబంధిత కార్యాలు అంతా సిలువ వద్దకు తెచ్చి అక్కడ వదిలిపెట్టినప్పుడు , తనలో జరిగిన వాటిని వివరించాడు. పౌలు ఇప్పుడు 25 స౦వత్సరాలపాటు క్రైస్తవుడు, రోమా జైలులో ఉన్నాడు.

ఒకప్పుడు ఆయన సాధించిన విజయాన్ని అంతా ఓటమిగా పరిగణించాడు. ఇప్పుడు ఆయనకు దేవుని నీతి ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా కలుగు ఈ నీతి అతనికి అందించబడినది, అతను స్వంతగా సంపాదించుకోలేదు. 10వ వచన౦ లోకి వచ్చినప్పుడు, ఆయన క్రీస్తును తన జీవిత ఆశయ౦గా ఎ౦దుకు చేసుకున్నాడు అనే విషయాన్ని మన౦ చూస్తా౦. కాబట్టి కొన్ని మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక దిగ్గజం జీవిత ఆశయం మన వద్ద ఉంది.

ఆయనను … ఎరుగు నిమిత్తమును “

“నిమిత్తము” అనే పదం ఒక ప్రయోజన నిబంధనను పరిచయం చేస్తుంది. ఇది పౌలు జీవిత స౦కల్ప౦. పౌలు జీవితఆశయం యేసుక్రీస్తును బాగా తెలుసుకోవడమే. అతనికి పాతికేళ్లుగా ఆయను యెరిగి ఉన్నాడు. అయినా ఆయన మరింత బాగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆయనను మించిన లక్ష్యం మరొకటి లేదు. 8వ వచన౦లో పౌలు క్రీస్తును తెలుసుకోవడ౦ “నా ప్రభువైన క్రీస్తుయేసును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము” అని పేర్కొన్నాడు. క్రీస్తు గొప్పతనము గురించి తెలుసుకొనుటలో  అంతం లేదు.

రక్షణను పొందుకొను ప్రారంభ సమయములో క్రీస్తు వద్దకు రావడంలో ఆయన గురించి సమస్తవిషయాలు తెలుసుకున్నాము అని చాలామంది భావిస్తున్నారనేది ఆసక్తికరమైన విషయం. రక్షణ ప్రారంభము మనకు ఆయనను పరిచయం మాత్రమే చేస్తుంది. అది ఆయన లోని అద్భుతాన్ని ఏమాత్రం రూపుమాపదు. కృపలో ఎదుగుకొలది, మనం ఆయన్ని బాగుగా అర్థం చేసుకోగలం.  

” మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ” (2 పేతురు 3:18).

దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, మనం ఆయన్ని మరింత బాగా తెలుసుకుంటాం. బైబిలు “క్రీస్తు మనస్సు” అని కూడా పిలువబడుతుంది (1 కొరిం. 2:16). దేవుని వాక్యము క్రీస్తు గురించిన దేవుని ఆలోచన. కృపతో పెరిగేకొద్దీ ఆయనతో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటాము. రక్షణ అనేది కేవలం ప్రారంభం మాత్రమే, ఆయనను తెలుసుకోవడం యొక్క ప్రారంభం. ఆయన వ్యక్తిత్వం చాలా శోభను కలిగి ఉంటుంది. ఆయన్ని తెలుసుకోవడానికి సమయం పడుతుంది.

“యెరుగుట” అనే పదానికి అనుభవం ద్వారా తెలుసుకోవడం అని అర్థం. యేసు క్రీస్తును విద్యాపరంగా తెలుసుకుంటే సరిపోదు. ఆయనతో సహవాస అనుభవం ద్వారా మనం ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఆ అనుభవ౦ లేఖన అధ్యయన౦ ను౦డి ప్రార౦భవ౦గా వస్తుంది.

సూత్రం:

రక్షణలో కంటే క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవడం ముఖ్యం.

అన్వయము:

మనం ప్రతిరోజూ క్రీస్తును అనుభవించాలి. మన ప్రభువుగా ఆయన్ని మనం మరింత సన్నిహితంగా తెలుసుకోవాలి. క్రైస్తవం అనేది ఒక సంబంధం, మతం కాదు కాబట్టి, ప్రభువుతో మన సంబంధాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. క్రీస్తు వ్యక్తిత్వముపై మన౦ ఎ౦త ఎక్కువగా కే౦ద్ర౦గా వు౦టే, మన ఆధ్యాత్మిక జీవిత౦ అ౦త ఎక్కువగా పెరుగుతు౦ది. మన౦ ఆయనతో మన స౦బ౦ధాన్ని తగ్గిస్తే, మన ఆధ్యాత్మిక జీవిత౦ బలహీనమౌతో౦ది. క్రీస్తు గురించి మరింత తెలుసుకోవడం కొరకు మీరు ప్రతిరోజూ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నారా? మీ జీవిత ఆశయం అదేనా?

Share