Select Page
Read Introduction to Philippians Telugu

 

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

 

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని.”

బహుమతి అనే పదం ఒక కిరీటంగా చెప్పబడిన తీవ్రమైన పదము. ఈ కిరీటమును గ్రీకుల బహిరంగ క్రీడలలో విజేతకు ధరింపబడునది. విజేత తలమీద ఒక ఆకులుగల తీగను ధరింపజేసేవారు. ఆ మాల పెద్దగా అనిపించేదికాదు. అయితే, ఆ కిరీటముతో ఇవ్వబడు సొత్తులే నిజమైన బహుమతి. విజేతను ఆయన సొంత నగరం బహిరంగంగా ప్రశంసించేది. ఆయన ఇక పన్నులు కట్టనవసరము లేదు. నగరములో అతని విగ్రహాన్ని తయారు చేసి బహిరంగ ప్రదేశములో ఉంచేవారు.

ఒక విశ్వాసి తన ప్రభువును కలిసినప్పుడు ఒక విశ్వాసి అందుకునే ఐదు “కిరీటాలను” బైబిలు జాబితా చేస్తుంది. ఒక నిర్ణీత సంకేతం ప్రకారం పరిశుధ్ధులు మహిమగల తమ కిరీటాలను యేసు సింహాసనము ఎదుట పడవేస్తారు (ప్రక. 4:10,11). ఆయన సింహాసనము యెదుట నీ కిరీటమును పెట్టగలవా?

విశ్వాసికి బహుమతి విజయస్థానం. ఒక వ్యక్తి క్రీస్తులో శక్తి, పరిపక్వత గల స్థాయికి చేరుకున్నప్పుడే విజయం పొందినట్లు. క్రీస్తు తన జీవితానికి కేంద్రబిందువుగా మారాడు, పరిధీయ ప్రదేశంగా కాదు.

విశ్వాసి తన ప్రభువును కలుసుకోవడానికి మహిమలోకి పిలువబడు సమయమే “ఉన్నతమైన పిలుపు”. విశ్వాసి క్రీస్తులో పరిణతి చెందిన దశకు చేరుకున్నాడా లేదా అని దేవుడు గుర్తిస్తాడు. క్రీస్తు మహిమచుట్టూ మన జీవితాలు కేంద్రీకృతమై ఉన్నాయా అన్నదే దేవుడు అడిగే ప్రధాన ప్రశ్న.

పరలోకానికి చేరుకున్నప్పుడు మన “బహుమతి” మనకు లభిస్తుంది. పరలోకానికి ముందు బహుమతి మనకు రాదు. మనము ముగింపు లైన్ వద్ద అది పొందుటకు. పౌలు “పరుగెత్తుచున్నాడు” (3:14a)

క్రీస్తునందు దేవుని యెదుట మన స్థితియొక్క సత్యము “క్రీస్తుయేసునందు” ఉన్నది. యేసుక్రీస్తు వలెనే మన౦ కూడా దేవుని ఎదుట అదే హోదాను కలిగి ఉన్నా౦. ఉన్నత పిలుపును పొంది మన౦ దేవుని యెదుట నిలబడినప్పుడు , “క్రీస్తులో” అక్కడ నిలుస్తాము. దేవుని ఎదుట నిలబడటం మన హక్కు. క్రీస్తును స్వీకరించిన సమయానికి క౦టే నిత్యజీవ౦ మరి౦త వాస్తవ౦గా ఉ౦డదు. ఆ సమయంలో దేవుడు మన౦ పరలోక౦లో ఉ౦డాలా వద్దా అని ప్రశ్ని౦చడు. మన క్రైస్తవ జీవితాన్ని మనం ఏమి చేశాం ? అనేదే ప్రశ్న. అది లాభసాటి జీవితమా లేక వృథా చేశామా?

సూత్రం:

ప్రతి విశ్వాసికి తన రక్షకుని కలుసుకొనుటకు, ఒక రోజు ఉన్నత పిలుపు పొందుకుంటారు.

అన్వయము:

దేవుని పిలుపు క్రీస్తులో మన స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆ హోదా వల్ల ప్రతి క్రైస్తవునికి ప్రభువును దర్శించడానికి హామీ ఇవ్వబడుతుంది. ప్రతి క్రైస్తవుడు తాను గడిపిన జీవిత నాణ్యతను ప్రభువు మదింపును ఎదుర్కొంటుటాడు. మీరు ప్రభువును కలిసే రోజు కోసం జీవిస్తున్నారా? ఆ సమయము గురించి మీరు ఊహించగలరా? మీ భవిష్యత్తు కలయికపై మీ జీవితం పై దృష్టి సారిస్తున్నారా? పౌలు జీవిత౦ మొత్త౦ ఆ కూటమి చుట్టూనే దృష్టి సారి౦చాడు. మీరు ఆ ఆసక్తికరమైన విషయము చుట్టూ మీ జీవితాన్ని జీవి౦చగలరా?

Share