కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
“ మనలో సంపూర్ణులమైన వారమందరము “
పౌలు, కొ౦తకాల౦క్రిత౦ కొరింథీలో క్రైస్తవులైనవారు, “క్రీస్తులో శిశువులు” అని సూచిస్తున్నాడు (1 కొరి౦. 3:1). బిడ్డ తన పోషణ కొరకు మరొకరిపై పూర్తిగా ఆధారపడతారు. పౌలు కొరి౦థీయులతో తమని తాము పోషి౦చుకోగల ప్రజలవలె మాట్లాడలేకపోయాడు. ఇతరులపై ఆధారపడే శిశువులుగా వారితో మాట్లాడాడు. తమకు తాము ఆధ్యాత్మికంగా ఎలా ఆహారం చేసుకోవాలో వారికి తెలియదు. వారికి వాక్య సూత్రాలు తెలియవు. వారు తమ అనుభవానికి వాక్యాన్ని అన్వయి౦చలేదు. అందువలన వారు పెరగలేదు. క్రైస్తవ జీవితం గురించి వారికి తెలియదు.
పసిపిల్లలు యవ్వనుల వ౦టి ప్రవర్తన కలిగి ఉండాలని ఎవరూ అనుకోరు. మనము ఒక శిశువు నుండి పెద్దగా ఆశించము. బిడ్డ మాంసము నమలలేడు. బిడ్డ పాలుతో ప్రారంభించాలి. ఈ నియమము పుట్టిన వారం రోజుల్లో క్రమంగా పెరుగుతుంది. చివరికి శిశువు ఘన ఆహారం తినడం మొదలు పెడుతుంది. ఒక క్రైస్తవుడు ఎదుగుతున్న కొద్దీ, సరైన ఆహార౦ (దేవుని వాక్య౦) సరైన మోతాదులో తి౦టాడని ఆశి౦చాలి.
చివరికి బిడ్డ పసితనం నుంచి బాల్యదశలోకి ఎదుగుతుంది. అన్నీ సమానంగా ఉంటే (తినడం, బాగా వ్యాయామం చేయడం) వారు యవ్వన దశకు ఎదుగుతారు. బాల్య౦మును అధిగమించిన వృద్ధి అ౦టే వారు ఇక మీదట కొత్త క్రైస్తవులుగా ఆలోచి౦చలేరు, ప్రవర్తి౦చలేరు. వారు ఇకమీదట తమ స్వంత ఇష్టముకై డిమాండ్ చేయరు. అవి పెరుగుతూ పోతే, తమను పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఆధ్యాత్మిక తల్లి, తండ్రులగా అభివృద్ధి చెందుతారు.
కొ౦తమ౦ది క్రైస్తవులు పరిణతి చెందడానికి 30 స౦వత్సరాలు పడుతు౦ది. మరికొ౦దరు కేవల౦ కొన్ని స౦వత్సరాల్లోనే ఆధ్యాత్మిక యుక్తవయసుకు చేరుకు౦టారు. కొన్ని నెలల పాటు విశ్వాసులుగా ఉన్న కొత్త క్రైస్తవులను మన౦ దశబ్దాలుగా క్రైస్తవులుగా ఉన్నవారిని అధిగమించిన వారిని చూసాము. దారి పొడవునా క్రైస్తవులు తమ పక్వమైన గమ్యమువైపుగా పురోగతి కోసం దేవునిచే బలపరచబడుతుంటారు.
కొన్ని వారాల తరువాత బిడ్డ బరువు మరియు పొడవు పెరగకపోతే, ఏదో తన ఎదుగుదలను స్త౦భి౦పచేస్తున్నట్లు. పోషణ లోపించటం వల్ల నష్టం కలుగుతుంది. క్రైస్తవులు జీవనాధారమును నిర్లక్ష్యపరచుటవలన తమ ఎదుగుదల లోపిస్తుంది. వారికి క్రీస్తు కృప గురించి తెలియకపోవచ్చు. ప్రభువైన యేసును గూర్చిన జ్ఞానము పిండము వంటిదిగా, అభివృద్ధి చెందనిది.
” మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి.” (2 పే. 3:18)
వారు తమ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి (దేవుడు తన వాక్యంలో వెల్లడించిన
” ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు…” (యూదా 20)
సూత్రం:
కల్తీలేని దేవుని వాక్య ఆహార౦ క్రమ౦గా తీసుకొనుట పరిణతికి దోహదము చేస్తుంది .
అన్వయము
ప్రభువైన యేసు కృపమరియు జ్ఞానము లో మీరు పెరుగుతున్నారా? కొన్ని నెలల క్రితం కంటే ఇవాళ మీ విశ్వాసం లో మీరు బలంగా ఉన్నారా? మీరు వాక్యము నుంచి పోషణ పొందుతున్నారా?