Select Page
Read Introduction to Philippians Telugu

 

ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,

 

4వ వచన౦లో, పౌలు శరీరమును ఆస్పదము చేసుకొను విషయ౦లో, తాను ప్రధమ స్థానములో నిలుస్తాడని చెప్పాడు. ఈ వచనములో ఆయన తన విజయాలను వివరించారు.

ఎనిమిదవదినమున సున్నతి పొందితిని”

5, 6 వచనాలు పౌలు ఒకప్పుడు తన సొత్తుగా భావించిన ఏడు అంశాలు చూపును. ఇవన్నీ దేవునిని ఆకట్టుకుంటాయని ఆయన నమ్మాడు. ఆయన తన రక్షకుని సంధినప్పుడు, అవి బాధ్యతలని తెలుసుకున్నాడు. ఇక్కడ అతను జాబితాను ఇస్తున్నడు .

జాబితా యొక్క ఒక వైపు, అతను తనను దేవునికి సిఫార్సు చేయగలవని భావించిన ఏడు కార్యాలను వ్రాసాడు. మరొక వైపు యేసు క్రీస్తును ఉంచాడు. ఆయన తన ఆధీక్యతలను యేసుక్రీస్తు కోస౦ వర్తక౦ చేశాడు. ఇది ఒక తీవ్రమైన మతవాది క్రైస్తవుడుగా మరిన సంధర్భము. మతవాదులు క్రైస్తవులగుట బహుశా మతవాదులుకానివారి కంటే చాలా కష్టము. వారి ధర్మశాస్త్రవాదముపై నమ్మకం వారు కొలత వేయలేనంత పెద్ద పర్వతం. కొ౦దరు తాము ఎవరినీ చ౦పి౦చలేదు లేదా దేనినీ దొ౦గిలి౦చలేదు (ఏదైనా పెద్ద తప్పులు చేయలేదు) గనుక దేవునిని ఆకట్టుకోగలమని భావిస్తారు.

మొదటి విషయము”ఎనిమిదవ రోజు సున్నతి చేయబడుట.” అతని మతం యొక్క మొదటి ఆధీక్యత ఎనిమిది రోజుల వయస్సు ఉన్నప్పుడు సున్నతి చేయబడుట. తన జీవితప్రారంభంలో నే అతనికి మతం ప్రదానం చేయబడింది. ఎనిమిదవ రోజు అనునది ఒక చిన్న పిల్లవాడు సున్నతి చేయబడడానికి పాత నిబంధన ధర్మశాస్త్రము నిర్దేశించిన రోజు. సున్నతి అనేది అబ్రహమిక్ నిబ౦ధనకు (ఆదికా౦డము 17) బాహ్య చిహ్న౦, అది నిబ౦ధన స౦బ౦ధ౦లో దేవునితో స౦బ౦ధాన్ని చూపిస్తు౦ది. పౌలు పాత నిబంధనలోని ఉపదేశక౦లో సున్నతి పొ౦దాడు. బాప్తిస్మము పొందిన యోహానుకు, యేసుకు ఎనిమిదవ దినమున సున్నతి చేసిరి (లూకా 1:59; 2:21) చాలామ౦ది కేవల౦ బైబిలు నియమాలను పాటిస్తే తాము దేవుని దృష్టిలో ఎ౦త ఎత్తుగా నిలబడతామని అనుకు౦టున్నారు. మత సంబంధ సాంప్రదాయము ఒక యాంత్రిక చర్య. యాంత్రిక చర్యలు  దేవుని ప్రభావితం చేయవు. ధృవీకరణ, చిలకరింపు, బాప్తిస్మ౦, ప్రభువు రాత్రి భోజనము,  తమలో తాము దేవుని ఆకట్టుకోవు. దేవునితో వ్యక్తిగత సంబంధం ఒకటే జవాబు.

పౌలు పత్రిక పఠకులు చాలామ౦ది యూదమతమునుండి మారిన వారు. వారు జీవితంలో ఆలస్యంగా సున్నతి పొందారు. ఎనిమిదవ రోజున వారు సున్నతి పొందలేదు. పౌలు వారికి భిన్న౦గా, నిర్దేశి౦చబడిన రోజున సున్నతి పొ౦దాడు. సాంకేతికంగా పౌలు వారికంటే ఎక్కువ మతపరుడు.

సూత్రం:

మత పరమైన ఆచారాలు దేవుని ఆకట్టుకోవు; నిజానికి భక్తికార్యాలు కూడా దేవుని ప్రబావితము చేయలేవు.

అన్వయము:

దేవునియొక్క అంగీకారము యేసుక్రీస్తు ద్వారానే వస్తు౦ది. యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఒక ముఖ్యమైన సంబంధం మాత్రమే దేవుని దృష్టిని పొందుతుంది.

మనం చేసే పని ద్వారా మనం దేవుని ఆకట్టుకుంటాం అని అతిశయము విశ్వసిస్తుంది. అది యేసుక్రీస్తును దాచిఉంచుతు౦ది. దైవిక ఏర్పాట్లలో కాక, మానవ కర్యాచరణలలో నమ్మికను ఉంచబడుతుంది. మీ భక్తి లేదా ఆధ్యాత్మికత దేవుని ఆకట్టుకు౦టు౦దని మీరు నమ్ముతున్నారా? దేవుని యొక్క ఆమోదమును పొందుటకు యేసుక్రీస్తు చేసిన దానికి విరుద్ధంగా మీరు చేసిన దానిమీద మీరు ఆనుకొనుచున్నారా?

Share