Select Page
Read Introduction to Philippians Telugu

 

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను

 

క్రీస్తును తెలుసుకోవడ౦ అమూల్యమైన ఆధిక్యతగా మన౦ పరిగణి౦చగలమా? మన జీవితంలో ముఖ్యమైన ప్రతిదానికి ఆయన మనకు ప్రభువు అయినప్పుడు ఆ విశేషాధికారభావన వ్యక్తమవుతుంది.

కూలంకుషముగా ఆలోచి౦చిన తర్వాత పౌలు వ్యక్తిగత ఆశయ౦ గురి౦చి మూడు ప్రతికూల మైన నిర్ధారణలకు వచ్చాడు. మొదట తన ఉపాది మొత్తం కేవలం క్రీస్తునిమిత్తము నష్టం అని నిర్ధారించాడు (v.7) ఆ తరువాత ఆయన క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకునే ఆధిక్యతకు అది నష్టమని భావించాడు (v. 8). చివరకు తన ఆశయాలను మైనస్ గా పరిగణించాడు. ప్రభువుతో పూర్తి సహవాసముతో పోలిస్తే అవి “పెంటతో సమానము” (v.8b) అని ముగించాడు.

“నేను సమస్తమును పోగొట్టుకొ౦టిని”

పాల్ తన విజయమనస్తత్వాన్ని విడిచిపెట్టాడు. తప్పుడు లక్ష్యాలపై తన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆయన నిమ్న లక్ష్యాలను విడిచిపెట్టిన సమయం వచ్చింది.

” ప్రసిద్ధి చెందిన సంఘము కలుషితమైన సంఘము” అనే మాటలో కొంత సత్యం ఉంది. సంఘము ఈ లోక౦లో అ౦గీకరి౦చబడాడానికి ఎక్కువ విలువనిస్తే, అది క్రీస్తును పూర్తిగా తెలుసుకోగల కీలక శక్తిని కోల్పోతుంది.

“ఇక్కడ సమస్తము” అంటే పౌలు యొక్క మానవ సాధనలు అన్నీ.

మన కాలంలో మనలో చాలా తక్కువ మంది ఎక్కువ శ్రమ అనుభవిస్తున్నాము. మరోవైపు, సాధ్యమైన ప్రతి ఔన్సు విజయం కొరకు మనము పోరాడతాం. మన విజయం మన అభిరుచి, మన ఆశయం. క్రీస్తును తెలుసుకోవడ౦ వల్ల మనకు ఏమైనా నష్ట౦ కలిగి౦దా? ఇది మన ఉద్యోగం లేదా వ్యాపారమును నష్టపరచిందా? కొ౦తమ౦ది ఎదుగుతున్న క్రైస్తవులు తమ ఉద్యోగ౦ తమ నమ్మకాలకు భంగము కలిగిస్తుందియని గ్రహిస్తారు. వారు క్రీస్తును ప్రేమి౦చడానికి ఇష్ట౦పూర్వకముగా తమ ఉద్యోగాన్ని త్యాగ౦ చేస్తారు.

“నష్టం” అనే పదం అకౌంటింగ్ ఆలోచనను సూచిస్తుంది. ఇది లాభనష్టాలను చిత్రీకరిస్తుంది. ఈ పదం 7వ వచనములో ఒకసారి, 8వ వచనములో రెండుసార్లు వస్తుంది. పౌలు తాను సంపాదించినవి, తాను పోగొట్టుకున్నవి, రె౦డి౦టినీ నమోదు చేశాడు.

  “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?”(మార్కు 8:36). ఈ వాక్య౦, కాలక్రమములో దేవుని ఎదుట జీవి౦చడానికి కారణాన్ని కోల్పోయిన విశ్వాసిని సూచిస్తు౦ది.

పౌలు ఇలా అంటున్నాడు: “నన్ను జాలిగా చూడకండి. నేను పోగొట్టుకున్న వాటి స్థానంలో నేను ఏమి సంపాదించానో మీరు తెలుసుకునేవరకు వేచి ఉండండి.”

సూత్రం:

ఆశయాలను సానుకూల దృక్పథంతో చూస్తే సరిపోదు.

నియమము:

క్రీస్తును ప్రత్యేక౦గా కలిగిడానికి మన౦ వ్యక్తిగత ఆశయాన్ని “నష్టముగా” దృష్టి౦చాలి. అతి విలువైన విషయాలకు ప్రాధాన్యత నియడానికి మనం తక్కువ విషయాల పట్ల మన వైఖరులతో వ్యవహరించాల్సి ఉంటుంది. మన మనస్సులు క్రీస్తు శ్రేష్ఠత యొక్క జ్ఞానంతో పోటీపడటానికి అనుమతించినప్పుడు, తక్కువ విషయాలు మన విలువల్లో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి. క్రీస్తును సన్నిహిత౦గా తెలుసుకోకు౦డా మనల్ని దూర౦ చేసే ప్రతికూల ప్రభావాలతో మన౦ తగిన౦తగా వ్యవహరి౦చగలమా?

Share