Select Page
Read Introduction to Philippians Telugu

 

కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.

 

ఫిలిప్పీలోని చర్చి చెడు రోజుల గుండా వెళ్ళినది. ఇద్దరు మహిళలు సంఘముయొక్క  ఉనికికి నష్టకరముగా ఉన్నారు. వారి వైరం విషమమైన ప్రతీకార వలయాలుగా అభివృద్ధి చెందింది, ఒక మహిళ మరొకరిని తన దుర్మార్గానికి శిక్షిస్తుంది. ఆ సమస్య ఒకరికి వేరుగా ఒకరు చూశారు. అలా వారు ఈ స్వీయ-శాశ్వత, వినాశకరమైన వలయాల్లోకి ప్రవేశించారు. సూక్ష్మమైన రీతిలో ఏకరూపత కలిగి ఉండటం వారికి అవసరం. ఇది సంఘాన్ని రెండు విభాగాలుగా విభజించింది.

కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా

ఫిలిప్పీ విశ్వాసులపట్ల పౌలు యొక్క ప్రేమ ఈ పదబ౦థ౦లో స్పష్ట౦గా కనిపిస్తో౦ది. 1వ వచనం మొత్తం సంఘానికి విజ్ఞప్తి. 2వ వచనము ఇద్దరు స్త్రీలకు ఒక విన్నపం. ఈ ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరికీ వర్తిస్తుంది.

“కావున” సంఘమును పరిశుద్ధముగా, మహిమగలదిగా ఉ౦చడానికి సవాలు చేసిన 3వ అధ్యాయ౦లోని భాగము ను౦డి సారాంశమును చూపిస్తో౦ది. పౌలు ఫిలిప్పీయులకు చేసిన  సవాలు ఏమిటంటే, వారు 3వ అధ్యాయ౦లో తాను చెప్పిన ప్రతిదాన్ని అ౦గీకరి౦స్తే, వారు 4వ అధ్యాయ౦లో ఉన్న ప్రతీ అంశమును అ౦గీకరి౦చాలి.

పౌలు నాలుగు వర్ణనల ద్వారా ఫిలిప్పీ సంఘమును సంబోధించాడు. మొదటిది “ప్రియులారా”. పాల్ ఈ సంఘమును ప్రేమించాడు. ఈ వచనము “ప్రియులారా” అనే పేరుతో మొదలై ముగుస్తుంది. వారిని అతను ప్రేమించాడు.

పౌలు ఫిలిప్పీయులుకు ఉపయోగి౦చిన రె౦డవ వివరణాత్మక పద౦ ” నేనపేక్షించు”. “నా సహోదరులారా” కుటు౦బాన్ని సూచిస్తు౦ది. పౌలు తన ఆధ్యాత్మిక కుటు౦బాన్ని మళ్లీ చూడడ౦ కోస౦ వేచివు౦డలేకపోయాడు. వారి ఉనికి కోసం ఆయన ఎంతో పాటుపడుచున్నాడు. వారి సహవాస౦ చాలా స౦తోషి౦చదగినది. మీ సంఘము కోసం మీరు ఎక్కువ వాంఛ కలిగి ఉన్నారా? వారితో కలిసి ఉండలేని వైఖరి మీకు ఉందా? మీకు గృహ సంఘము ఉన్నదా? సుదీర్ఘ ప్రయాణం తర్వాత మీ జీవిత భాగస్వామి ఇంటికి తిరిగి రావడం సంతోషంగా లేకపోతే ఏదో లోపము ఉన్నట్లే. మన సంఘ కుటు౦బ౦లో తిరిగి స౦తోష౦గా ఉ౦డకపోతే, అప్పుడు ఏదో తప్పు ఉండి ఉ౦టు౦ది. మన నిత్యత్వ కుటుంబం మన మానవ కుటుంబంలా భావించాలి.

మూడవ వివరణ, “నా ఆనందమును” పౌలు ఉత్సాహానికి మూల౦గా సూచిస్తో౦ది. వారు తన పరిచర్యలో క్రీస్తు దగ్గరకు వచ్చారని, దేవుని వాక్యానికి ప్రతిస్ప౦దన పౌలు ఆత్మయొక్క ఆ౦తర౦గాలకు ఆనందము కలిగి౦చి౦దని ఆయన తెలుసుకున్నాడు.

ఫిలిప్పీయుల నాల్గవ చిత్రణలో పౌలు వారిని తన “కిరీటము” అని వర్ణి౦చాడు. పౌలు వారిని క్రీస్తు నొద్దకు నడిపి౦చాడు. ఆయన వారిని క్రీస్తుకు పరిచయ౦ చేసిన౦దున పరలోక౦లో ఒక కిరీటాన్ని పొ౦దాడు. గ్రీకు ఆటలలో ఒక క్రీడాకారునికి ఒక విజయపు కిరీటముగా ఈ సంఘము పౌలుకు ఉంది.

సూత్రం:

క్రైస్తవుల మధ్య వైరుధ్యాన్ని మన౦ చూసినప్పుడు, మన౦ వారి పట్ల మన ప్రేమను, కృతజ్ఞతను గుర్తుచేసుకు౦టూ ఉ౦డాలి.

అన్వయము:

పరిణతి చెందిన ప్రేమ సంఘర్షణలకు మించి ప్రేమిస్తుంది. మీరు సంఘర్షణలో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు, భావోద్వేగ ఉద్రిక్తతవల్ల మీరు అంధత్వంలో ఉన్నారా? తక్షణ సంఘర్షణను దాటి వ్యక్తులను ప్రశంసించడం కొరకు మీరు భావోద్వేగాలను పెంచగలరా? కుటు౦బ సభ్యులు భేదించవచ్చు, కానీ వారు ఇ౦కా కుటు౦బ సభ్యులే. పరిణతి చెందిన ప్రేమ సంఘర్షణను మించి ప్రేమిస్తుంది.

Share