Select Page
Read Introduction to Philippians Telugu

 

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

 

ఈ వచనము తరచుగా సందర్భోచితంగా ఉదహరించబడని ఒక ప్రసిద్ధ వచనము.

కాగా దేవుడు … మీ ప్రతి అవసరమును తీర్చును “

“కాగా” వ. 19 అనేది పౌలు ఇప్పటివరకు చెప్పిన దాని ఫలితమని సూచిస్తుంది. ఈ భాగములో, జైల్లో పౌలు ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఫిలిప్పీయులను ఉపయోగి౦చడ౦లో దేవుని నమ్మకత్వాన్ని గురి౦చి ఈ పేరాలో తెలియజేయబడీంది. ఫిలిప్పీయులు పౌలు అవసరాన్ని తీర్చారు. ఇప్పుడు దేవుడు వారి అవసరాన్ని తీరుస్తారు. దేవుడు జైలులోఉన్న పౌలు అవసరాన్ని తీర్చడానికి ఫిలిప్పీయులను ఉపయోగి౦చాడు. దేవుడు ఫిలిప్పీయుల ధాతృత్వమునకు అవసరమైనదానిని తీర్చగలడు. పౌలుకు ఏది జరిగినను దేవుడు తగినవిధముగా స్పంధిస్తాడు. దేవుడు పొగడ్తలను ఇచ్చిపుచ్చుకు౦టాడు. దేవుడు తన ప్రజలపట్ల నమ్మక౦గా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు ఇవ్వవలసినవి దాచుకొనడు.

మన ఆర్థిక అవసరాలను దేవుడు తీర్చే సందర్భం ఇతరుల అవసరాల్ని మనము తీర్చే వాతావరణంలో ఉంటుంది. 18వ వచన౦లో ఫిలిప్పీయులు దేవునికి సువాసనలు వెదజల్లే ఒక ఆమోదయోగ్యమైన అర్పణను ఇచ్చారు. అంతా వెలుపలకు ప్రవహిస్తూ, ఏదీ లోనికి ప్రవహించకపోయినట్లైతే, ఫిలిప్పీయులు ఆర్థికంగా ప్రమాదంలో పడేవారు. అర్పణ ఇచ్చేవారిని దేవుడు లోటులో ఉంచడు. మనం దేవునికి మించి ఇవ్వలేము. అతను వద్ద పెద్ద పార కలిగి ఉన్నాడు.

ఈ వాగ్ధానము దేవుడు ఫిలిప్పీయుల”అన్ని” అవసరాలను తీర్చగలడు, వాటిలో కొన్ని మాత్రమే కాదు అని. దేవుని సరఫరా అన్ని రకాల అవసరాలతో సమగ్రమైనది. మన అవసర౦ తాత్కాలికమైనదైనా, ఆధ్యాత్మికమైనా దేవుడు దాన్ని తీరుస్తారు.

క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.” (లూకా 6:38)

“నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గానివారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.” (కీర్తనలు 37:25)

“నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి

పొరలి పారును..” (సామె 3:9,10)

సూత్రం:

మన ఇతరుల అవసరాన్ని తీర్చితే దేవుడు మన అవసర౦ తీర్చుతాడు.

అనువర్తనం:

దేవుడు త్యాగపూరితమైన అర్పణను లక్ష్యపెట్టును. మీరు ఇతరులతో ఉదారంగా ఉన్నారా? మీరు ఒక మొండి వ్యక్తిగా ఉన్నారా? దేవుడు మీ అవసరాన్ని తీర్చుతాడని మీరు నమ్మకుండుట మీ డబ్బును మీరు గట్టిగా పట్టుకొనుటకు కారణమా? మీరు ఆయన పనికి ఇస్తే దేవుడు మీ “ప్రతీ అవసరమును” తీరుస్తాడు అని మీరు నమ్ముతారా? దేవుడు జ్ఞాపకము చేసుకొను అర్పణ ప్రతి విశ్వాసికీ అన్వయి౦చబడదు. త్యాగపూరితముగా చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దేవుడు మీ ఔదార్యాన్ని తిరిగి నింపగలడని మీరు నమ్ముతున్నారా?

Share