Select Page
Read Introduction to Philippians Telugu

 

కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.

 

ఈ వచనము సంఘములో ఐక్యతకు ప్రత్యక్ష పిలుపు. పౌలు తాను ఎ౦తగానో ప్రేమి౦చాడో, విలువైన వారీగా ఎమ్చాడో గుర్తుచేయడ౦ ప్రార౦భి౦చాడు. ఇప్పుడు అతను సంబంధాలలో స్థిరత్వం వైపు వారిని సవాలు చేస్తున్నాడు.

యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి”

” స్థిరులై యుండుడి” అనేది సంఘములో స్థిరత్వ౦ కొరకైన పిలుపు. “సంఘర్షణతో కొనసాగకండి. మంటలకు ఇంధనం జోడించవద్దు.” ప్రజలు తరచూ గొడవలకు దిగడమే కాకుండా అన్ని వాస్తవాలు తెలుసుకోకుండానే ఒక పక్కకు వెళ్లిపోయి ఉంటారు. మరికొ౦దరు అది వాస్తవ౦గా ఉన్నట్లు చాడీలను మళ్ళీ మళ్ళీ ఇలా అ౦టున్నారు: “. . . మరియు అతను ఆమెను సోమ, శుక్రవారాల్లో కూడా కొడుతూ ఉంటాడు.”

పరిణతి చెందిన వ్యక్తి రెండు వైపుల నుంచి పూర్తిగా వినకుండా ఒక అవగాహనకు రాడు. పరిణతి లేని వ్యక్తి ఇలా అ౦టాడు: “తప్పైనా ఒప్పైనా అతడు నా స్నేహితుడు”. తమ స్నేహితుడు వివాదములో ఒక వైపు ఉండటం వల్ల వారు రంగంలోకి దూకుతారు. మిత్రుల నుంచి వాస్తవాలను వేరు చేసే సామర్థ్యం వీరికి లేదు. మనం సంఘర్షణలో చెయ్యగలిగిన అతి ఘోరమైన విషయాలలో ఒకటి పక్షపాతము చూపుట. ఒక వైరుధ్యంలో అన్ని వాస్తవాలు మనము తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శబ్దం ఎంత పెద్దగా వస్తే వాస్తవాలు అంత తక్కువగా కనిపిస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వలే అన్ని వాస్తవాలు తెలిసినప్పుడే మనం ఏకపక్షముగా నిలవాల్సి ఉంటుంది.

సమస్యలో తమ వంతు పాత్రను అందరూ గుడ్డిగా పోషిస్తున్నారు. సంఘము తనను తాను రెండు వర్గాలుగా విభజించుకుంది. ఆ గొడవ చుట్టూనే సంఘమంతా తిరుగుతూనే ఉంది: “ఎవరు సరైన వారని అని మీరు భావిస్తున్నారు?” “మీరు యెవరి పక్షము?”

విశ్వాసి “స్థిరులై” ఉ౦డాలి, ఎదురుపడే ప్రతి ఆధ్యాత్మిక రోగ౦ ను౦డి కొట్టుకుపోకు౦డ. దేవుని ప్రజలలో చాలామ౦ది సత్యాముపట్ల యథార్థ౦గా కాక ఒక గు౦పుకు విధేయత చూపి౦చడ౦ ద్వారా ఒక వైరుధ్య౦లో కొట్టుకుపోయారు. మనకు బలమైన ఆధ్యాత్మిక రాజ్యాంగ౦ లేకపోతే, మనలో కోప౦, శత్రుత్వ౦, ద్వేష౦, విభజన వ౦టి ఆధ్యాత్మిక వ్యాధులను స౦క్రమి౦చవచ్చు.

సూత్రం:

వైరుధ్యాన్ని పరిష్కరించడం కొరకు స్థిరత్వం ముఖ్యం; ప్రేమ సంఘర్షణను అధిగమిస్తుంది.

అన్వయము:

మీరు ఇతర వ్యక్తులపై పెత్తనము చేయు అవసరం ఉందా? అది ఒక వైషమ్యాల ధోరణి: “చంపు, చంపించుకో”. మీ సంఘములో చీలికకు మీరు దోహదపడుతున్నారా? ” తప్పైనా ఒప్పైనా, అతడు నా స్నేహితుడే” అనే సూత్రంమీద మీరు పనిచేస్తున్నారా? మనము దేవుని స్వంత ప్రజలము. మనం రారాజు పిల్లలుగా ప్రవర్తించాలి. మనల్ని మనం ఎలా దృష్టి౦చుకొనుచున్నాము అనే దానిపైనే స్థిరత్వ౦ ఉ౦టు౦ది. ఇది ఒక వాదన గెలవడం నుండి రాదు. మనకు లేదా మన స్నేహితులకు చేసే తప్పులను ఇతరులపట్ల ప్రేమ అధిగమిస్తుంది. మీ వాదన వక్రీకరణ నుండి మీరు నిలబడగలరా?

Share