Select Page
Read Introduction to Philippians Telugu

 

ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.

 

ఈ భాగం వారి పాప సామర్థ్యముచే జయించబడీన ఇద్దరు వ్యక్తుల సంఘటన కనిపిస్తుంది. వారు నెలల తరబడి నడుస్తున్న కలహములో ప్రవేశించారు. పౌలు ఫిలిప్పీ పత్రిక వ్రాసినప్పుడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ సమస్యకు తమ సహకారం విషయము గుడ్డిగా ఉన్నారు. వారు తమలో కాక ఎదుటి వ్యక్తిలో ఉన్న సమస్యను చూశారు.

యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను”

ఈ వచనానికి అసలు అమరికను ఊహి౦చ౦డి. ఫిలిప్పీ మొదటి పత్రిక పఠన సమయములో యువొదియ, సుంటుకే సంఘములో కూర్చొని ఉన్నారు. ఎపాఫ్రోదితు మొదటి అధ్యాయాన్ని చదివినప్పుడు, వాళ్ల౦దరూ స౦తోషి౦చారు. రెండు, మూడు అధ్యాయాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన 4వ అధ్యాయ౦ లో ఇలా చదివాడు: “నేను యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.” సంఘముకు విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు మహిళలు స్థంబించిపోయారు. బహిరంగంగా వారిని ఒంటరిచేశారు. యువొదియ సంఘముకు కుడివైపున తన మద్దతుదారులతో కలిసి కూర్చుని ఉంది.  సుంటుకే తన మద్దతుదారులతో కలిసి ఎడమవైపున ఉంది.  వారు సమస్యాత్మక౦గా ఉన్నకారణ౦గా వారి పేర్లు బైబిల్లో కనిపిస్తున్నయి.

వారు తమ సొంత మార్గాన్ని కోరుకున్నారు మరియు ఇది వారు చెల్లించిన మూల్యము. వారు సంఘమును చీల్చబోతున్నారు మరియు వారు సంఘము ఉన్నా లేకున్నా నిరూపి౦చబడిన౦త కాల౦ వారు పట్టి౦చుకోలేదు. ఫిలిప్పీపట్టణ సువార్తీకరణపై వారికి ఆసక్తి లేదు. ఎవరు సరైనవారు అనే ఆసక్తి వారిలో ఎక్కువగా ఉంది.

ఇది సిద్ధాంతవిషయం కాదు. అది వ్యక్తిగతం. వారు ఫిలిప్పీని సువార్తికరించడానికి ఇతర విశ్వాసులు ఆసక్తి చూపనంత విధముగా పొగతెరను ఏర్పాటు చేశారు. సంఘము తన పిలుపును కోల్పోయింది. వారు ఏ వైపు ప్రజలు ఉన్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు: “సుంటుకే సరైనదని మీరు భావిస్తున్నారా?” “యువోదియా పరిస్థితి ఏమిటి, ఆమె చెప్పింది నిజమేనా?”

ఇద్దరూ గాయపడ్డారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడప్పుడు దెబ్బలు తగలకుండా ఆఫీసులో పనిచేయలేం, కానీ తిరిగి కలిసి పోతూ ఉంటాము. మనము గాయపడగలమని ఊహిస్తాము. అదే మన పని. ప్రజలు ఉన్న చోట పొరపాటులు, అపార్థాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇతరులు అనాలోచితంగా, దయలేనివారుగా ఉంటారు, కానీ మనమ౦దరూ కాదా? మనమంతా ఒకే పడవలో ఉన్నాం.

సూత్రం:

క్రీస్తు కారణాన్ని గాయపరచటానికి వ్యక్తిగత బాధ కారణముగా ఉండకోడదు.

అన్వయము:

మీ పరిచర్యలో వ్యక్తిగత౦గా గాయ౦ కాకు౦డా మీరు అనుమతి౦చగలరా? మీరు క్రీస్తు పరిచర్య కుంటుపడడానికి కారణముగా వివాదములలో తలదూర్చారా ?

Share