Select Page
Read Introduction to Philippians Telugu

 

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

 

మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”

మన విన్నపములు దేవునికి తెలియనవి కావు. తల్లి ఏడ్చుచున్న తన బిడ్డ తన సమస్య గురించి చెప్పడం వినడానికి ఇష్టపడుతోంది. ఆమె సానుభూతిని, అవగాహనను ప్రదర్శిస్తు౦ది. ఆమె గాయాల గురించి మరియు విజయం గురించి వినాలని అనుకుంటుంది. చిన్న పిల్లవాడు తనకు ఏమి జరిగినా, అది అతని తల్లికి ఆసక్తి కలిగిస్తుంది అని అనుకుంటాడు. మన౦ మన అవసరాలు, భయాలను మన భూత, భవిష్యత్, సమస్తమైన స౦రక్షణల అవసరకలను దేవుని సన్నిధికి తీసుకుపోగల౦.

మీ విన్నపములు తీసుకొనివచ్చి మరియు అక్కడ వదిలి వేయాలి. దేవుడు ఎప్పుడు జవాబిస్తాడో, ఆయన ఎలా జవాబిస్తాడో, ఆయన అసలు జవాబిస్తాడో లేదో అని మన౦ చి౦తి౦చము. ఒకసారి ఆ అభ్యర్థన చేసినప్పుడు, మనము దేవునికి మన వైపు నుండి అవసరమైన అన్ని చేశాము. ఆయన ఎలా జవాబివ్వాలి అని దేవునికి మన౦ చెప్పలే౦. ప్రార్థన ఒక అయిష్టంగా ఉన్న దేవుని చేతిని మెలితిప్పడం కాదు. దేవుడు మనలను తన సార్వభౌమమార్గంలో కలుసుకు౦టాడు. మన కోరికల సమయంలో ఆయన మనల్ని కలిసిన సందర్భాలున్నాయి. ఇతర సమయాల్లో మన ప్రార్థనకు “అవును” అని జవాబియ్యకూడదని ఆయన ఎ౦పిక చేసుకు౦టాడు.

శ్రమ ముగిసిన తర్వాత మనం ఇలా చెబుతాం, “నేను దాని గురించి ఎందుకు ఆందోళన చెందాను? దేవుడు తన చిత్తానుసారంగా దానిని రూపొందించాడు. ఈసారి నేను అలాంటి ఇబ్బందికి లోనైనను, నేను బాధపడను. నేను పాఠం నేర్చుకున్నాను”. తరచూ ఆ పాఠం నేర్చుకోము.

అవిశ్వాసానికి నిదర్శనం చింత. సమస్యను పరిష్కరి౦చడానికి దేవునికి సహాయ౦ చేయాలి అని మన౦ అనుకు౦టాము. నా కష్టం తీర్చడానికి చింత నాకు సాయపడుతుంది. కాబట్టి మన హృదయాలను చింతతో నింపుకు౦టాము. ప్రార్థన కేవలం దానికి వ్యతిరేకమైనది. ఇది సమస్యలను దేవుని చేతిలో విశ్వాసంగా ఉంచుతుంది.

మన౦ ప్రార్థి౦స్తే, ఆ ప్ర్రార్ధన రక్షకుడు ఆమోదము పొందగలిగేదిగా ఉ౦డేలా ప్రార్థి౦చాలి. మనం ఆమోదము చేయు విషయాల పట్ల మనందరం జాగ్రత్తగా ఉంటాం. మనము ప్రతిదానిపై మన సంతకం ఉంచం. అలాగే ప్రభువైన యేసు ప్రతి ప్రార్థనను సమర్థి౦చడు. అలా చేస్తే, ఆయన నిలకడ లేని వాడవుతాడు. ఆ పని చేయలేడు. అలా చేస్తే తన పేరు అపఖ్యాతి చెందుతుంది.

మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.. (యోహాను 14:13-14)

“దేవునికి” అనే పదాలు దేవుని సన్నిధిలో అని అర్థం. దేవుని సాన్నిధ్యాన్ని గురించిన భావనతో చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన. చాలా మ౦ది యాంత్రికంగా ప్రార్ధిస్తారు. మనం మాటలు చెబుతాం కానీ వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడం.

సూత్రం:

మన విన్నపాలను దేవుడు తెలుసుకోవాలని అనుకుంటాడు.

అనువర్తనం:

మన విన్నపాన్ని దేవునికి తెలియపరచడమే మన బాధ్యత. ప్రార్థనకు పిలుపు నిశ్చేష్టగా ఉండుటకు పిలుపు కాదు. దేవుడు తనకు శక్తి ఇచ్చిన విషయాలకు విశ్వాసి బాధ్యత వహించాలి. ఉదాసీనత క్రైస్తవ్యము యొక్క లక్షణం కాదు.

Share