Select Page
Read Introduction to Philippians Telugu

 

మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.

 

అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు “

“అదే విషయాలు రాయడం” పునరావృతం చేయడము. పౌలు ఫిలిప్పీలో ఉన్నప్పుడు అతను ఈ లేఖలో నమోదు చేసిన అనేక విషయాలను వారికి వెల్లడించాడు.

” కష్టమైనది” అనే పదానికి నెమ్మదిగా, కఠినంగా లేదా బద్ధకంగా అని అర్థం. పునరావృతం అనగా వెనుకకు లాగుట. సత్యం వద్దకు మళ్లీ మళ్లీ వెళ్లడం అంటే వివరాల ద్వారా నెమ్మదిగా విషయమును వెలికి తీయుట. చాలా మంది దీనిని మందకొడిగా, నీరసంగా, మార్పులేనిదిగా భావిస్తారు. పౌలు దీనిని ” క్షేమకరము” అని పిలిచాడు. అతను ఇలా అన్నాడు, “ప్రభువుపై ఎల్లప్పుడు దృష్టి పెట్టమని నేను చెప్పుటకు అలసిపోను. మీ ఆనందానికి మూలం ప్రభువు అని మీకు గుర్తు చేయడంలో నేను అలసిపోను.” అది శ్రమతో కూడుకున్నది కాదు; అది సురక్షితం.

మనం జీవించిన దానికంటే చాలా ఎక్కువ తెలుసుకొనిఉన్నము. మనం ఎప్పుడూ నమ్మిన దానికంటే చాలా ఎక్కువ విన్నాం. జీవితంలోకి సత్యాన్ని అమర్చడానికి పునరావృతం ఎంతో అవసరం.

” ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెం బడి సూత్రము సూత్రమువెం బడి సూత్రము

కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.” (యెషయా 28:10)

అదే మనం నేర్చుకునే మార్గం. వృద్ధి అనేది ఒక ప్రక్రియ. సత్యాన్ని అన్వేషించుట జీవితానికి అనేక అనువర్తనాలను కలిగిస్తుంది.

ఒక అనుభవజ్ఞుడైన పాస్టర్, “నేను మొదట బోధించటం మొదలుపెట్టినప్పుడు నన్ను నేను పునరావృతం చేయడానికి చాలా భయపడ్డాను. ఇప్పుడు నేను చేయక ఉండుటకు భయపడుతున్నాను! ప్రజలు ఎంత సందేశాన్ని అర్థం చేసుకుంటారు? వారు ఎంత నిలుపుకుంటరు? వారు కొంచెం భిన్నమైన రూపంలో విన్నట్లయితే వారు దానిని గుర్తిస్తారా?

మీకు అది క్షేమకరము”

” క్షేమకరము” అనే పదానికి దృఢమైన, స్థిరమైన అని అర్థం. పునరావృతం సురక్షితమైన ముందు జాగ్రత్త. ఇది ప్రజలను పడిపోకుండా చేస్తుంది మరియు భద్రత మరియు మద్దతును అందిస్తుంది. సత్యాన్ని సంభాషించే వారు దాని వాస్తవానికి చేరిక చేసే విధంగా దానిని అందించడానికి మళ్లీ మళ్లీ దానివద్దకు  వెళ్ళాలి. వారు వాక్యాన్ని బోధించినట్లయితే, అది శాశ్వతతకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

పేతురు అదే పరిచర్య తత్వాన్ని తీసుకున్నాడు:

” కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీక రించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.౹ 13-14మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. ” (2 పేతురు 1:12, 13)

నియమము:

సత్యం యొక్క అనువర్తనం యొక్క పునరావృతం క్రైస్తవ జీవితాన్ని గడపడానికి స్థిరత్వాన్ని అందిస్తుంది.

అన్వయము:

మనం వాక్యమును నేర్చుకున్నంత జీవించినట్లయితే, మన క్రైస్తవ జీవితాల నాణ్యత ఒక్కసారిగా భిన్నంగా ఉంటుంది. ఏది సరైనదో మనకు తెలుసినను, మనం తప్పుగా జీవిస్తాము. సత్యాన్ని అనుభవంలోకి అనువదించడానికి మనము ఉద్దేశపూర్వకంగా గుడ్డిగా ఉన్నాము. మనలో చాలా మందికి నిజం ఒక మేధో వ్యాయామం వంటిది, ఒక జీవిత పరిస్థితి కాదు. నిజం మన జీవితాల్లోకి మారాలంటే, ఇది చాలా అనువర్తనాలను కోరుతుంది. అన్వయము చేసుకొనుటకు మీకు తగినంత సత్యము ఉందా? మీ హృదయంలో నిజం ఉన్నదా ?

Share