అందువలన … విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముచేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.
థెస్సలొనీకయుల కొరకు పౌలు నాలుగు విషయాల కొరకు ప్రార్థిస్తాడు. మొదట, అతను వారి పిలుపుకు సంబంధించి వారి నడక గురించి ప్రార్థిస్తాడు.
మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు,
“యోగ్యులుగా ఎంచుట” అనే పదానికి అర్థం తగిన అని అర్థం. దేవుడు థెస్సలొనీకయులను విలువైనవారినిగా చూడాలని ప్రార్థించాడు.
ఈ పదం మిమ్మల్ని అర్హులుగా మార్చడం కాదు. గ్రీకులో ఇది ఒక కారణ పదం. దేవుడే విలువకు కారణం, మనము కాదు.
క్రైస్తవుని నడక అతని మోక్షానికి అనుగుణంగా ఉండాలి. క్రైస్తవుడు పరలోకము వైపు వెళ్తున్నాడు. ఉత్తమమైనది ఇంకా ముందుకు ఉంది, కానీ అతని ప్రస్తుత జీవితం అతని భవిష్యత్తు జీవితాన్ని ప్రతిబింబించాలి.
“… దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది…” (2 థెస్సలొనీకయులు 1: 5).
సూత్రం:
మన శాశ్వతమైన విధికి అనుగుణంగా మనం క్రైస్తవ జీవితాలను గడపాలి.
అన్వయము :
ఏ క్రైస్తవుడూ రక్షణకు అర్హుడు కాదు కాని మన శాశ్వతమైన భవిష్యత్తుకు అనుగుణంగా జీవితాలను గడపవచ్చు.
” క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:14).
“మీ జీవితం ‘క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు’ ప్రతిబింబిస్తుందా? మీరు పరలోకానికి చేరుకున్నప్పుడు, మీరు జీవించిన విధానంతో దేవుడు దుఃఖించబడతాడా, లేదా ఆయన, “భళా” మీరు నాకు తగినట్లుగా నడుచుకున్నారు” అని ప్రసంశిస్తాడా ?
” ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.”(ఆపో. కా. 5: 41-42).
” అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు… దేవుని బతిమాలు చున్నాము “(కొలొస్సయులు 1: 9-10).
“… తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని” (1 థెస్సలొనీకయులు 2:12).