Select Page
Read Introduction to Colossians Telugu

 

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

 

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై

మనము కొలస్సీ పత్రికలోని గొప్ప మరియు గంభీరమైన విభాగానికి వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుని కుమారుడని తన అత్యున్నత ప్రాధాన్యతలో ప్రదర్శిస్తున్నాడు.

15-20 వచనాలు క్రీస్తు మహిమను ప్రదర్శిస్తాయి. యేసు ఏడు విభిన్న విషయాల్లో ప్రత్యేకమైనవాడు. ఈ విలక్షణతలు ఆయనకు ఆధిపత్యాన్ని కలిగి ఉండటానికి అర్హత కలిగిస్తాయి (వ.18). ఏడు విషయాలలో పరిశుద్ధాత్మ దేవుని కుమారుని యొక్క ఆధిపత్యాన్ని నిర్దేశిస్తున్నాడు :

-దేవుని స్వరూపము కలిగినవాడు

-సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు

-విశ్వము యొక్క సృష్టికర్త

-సంఘమునకు శిరస్సు

-మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను

-ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు

-సమస్తమును సమాధానపరచువాడు

అందుకే ఆయన ప్రపంచ సార్వభౌమ రాజు అయిన యేసు రాజు.

ఏడు వర్ణనల ద్వారా ఆయన ఆధిపత్యాన్ని కూడా మనం చూడవచ్చు

-ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు

-సమస్త సృష్టికి ఆది సంభూతుడు

-ఆయన సృష్టికర్త

-ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు

-ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు

-అతడు సంఘమునకు ప్రభువు.

-మృతులలోనుండి లేచుటవలన ఆయన సంఘము యొక్క మూలపురుషుడు.

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై

మొదటిది, అదృశ్య దేవుని స్వరూపమే క్రీస్తు. ” స్వరూపము” అంటే యేసు దేవుని వలె ఉన్నాడనుటకంటే గొప్ప భావము; ఆయన దేవుని ప్రతినిధి, ప్రత్యక్షత. “ప్రతిమ” అనేది ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, అది దేవుని పోలికను లేదా పోలి ఉన్న అసలు దాన్ని సూచిస్తు౦ది. ఒక డాలర్ బిల్లులోని చిత్ర౦ అద్యక్షుని సూచించిన విధముగా యేసు త౦డ్రిని సూచిస్తున్నాడు (హెబ్రీ. 1:3). యేసును చూసినట్లయితే మనము తండ్రిని చూచినట్లే (యోహాను 1:14; 14:9). మానవుడు దేవుని  స్వరూపములో చేయబడిన విధంగా ఆయన చేయబడలేదు. ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును (హెబ్రీ 1:3). ఆయన దేవుడు కాబట్టి దేవుడు కలిగి ఉన్నవాటన్నిటిని ప్రతిబింబిస్తాడు.

“కుమారుడు” అనేది దేవుని యొక్క ఉత్పన్నమైన ప్రతిబింబము కాదు, ఖచ్చితమైన స్వరూపము. ఆయన కేవలము పోలి కాకుండా దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాడు (రోమా 8:29; I కొరిం 15:29). ఆయన సమస్త దైవత్వము కలిగిఉన్నాడు. ఆయన సార్వభౌముడు, నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, మార్పులేనివాడు మొదలైనవి. ఆయనే తానే దేవుడు (II కొరి౦. 4:4). కుమారుడు తప్పనిసరిగా, నిత్యమూ దేవుని స్వరూపమే. క్రీస్తునందు  దేవునిని వ్యక్తిగా ఉత్తమమైనవిధముగా చూడగలము. ఆయన ప్రత్యేక ప్రత్యక్షత యొక్క అత్యున్నత రూపం. కాంతి కిరణముల నుండి ప్రతిబింబములను చూచువిధముగా మనము క్రీస్తు నందు దేవుని చూడగలము. కుమారుడు దేవునిని బయలుపరచువాడు.

అతని స్వరూపం “అదృశ్య దేవుని స్వరూపము”. మానవునికి కనిపించే త్రిత్వములోని ఏకైక వ్యక్తి కుమారుడు (యోహాను 1:18; 6:46; 1తిమో 6:16; 1 యోహాను 4:12). ఆయన త్రిత్వమును బయలుపరచువాడు. మనకు దేవుడు క్రీస్తులో సంపూర్ణంగా కనిపిస్తాడు.

 “స్వరూపము” ఒక నమూనాకు కాపీ అని సూచిస్తుంది. తండ్రికి కుమారుడిగా ఆయన దేవుని పునరుత్పత్తి (హెబ్రీ 1:3; ఫిలిప్పీ 2:6). ఆయన సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు అని పౌలు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతున్నాడని తరువాతి మాట చూపిస్తుంది.

నియమము:

యేసు, దేవునిలో మనము చూడగలిగినవాడు. (యోహాను 10:30; 14:9; కొల 2:9).

అన్వయము:

ప్రభువైన యేసు లేఖనము యొక్క గొప్ప, ఘనమైన మరియు మహిమాన్విత విశేషము. ఆయన దేవుని వాక్యపు కేంద్రం మరియు పరివృత్తము. పాత నిబంధన ఆయన రాకను ప్రవచించిన తర్వాత, ఆయన వచ్చాడని సువార్తలు ప్రకటి౦చాయి, మిగిలిన లేఖనాలు మరలా ఆయన రాబోవుచున్నడు అని ప్రవచిస్తున్నవి. బైబిల్ నుండి ప్రభువైన యేసును తొలగించడం, సారాంశములేని ఒక కథలా, సామరస్యం లేని సంగీతంలా మరియు మోటారు లేని కారులా ఉంటుంది. ఈ వచన౦లోనే యేసు యొక్క ఆధిక్యతను అన్ని విధాలా చూపబడినది.

యేసు దావీదు, సొలొమోను, యోహాను, పేతురు, పౌలు ను౦డి వేరుగా ఉన్నాడు. ఏ మనిషితో సాటిలేనివాడు. సాధారణ మానవుడికి ఎంతో వ్యత్యాసముగా ఉంటాడు. మనుష్యుల స్థాయిలో యేసును పెట్టడం దేవుణ్ణి అఘాతపరచటం ” మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా –ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.” (మార్కు 9:7). పేతురు, యాకోబు, యోహాను అప్పుడే మోషేతో, ఏలీయాతో యేసును పోల్చిచేశారు. కుమారుడు ఖచ్చితంగా అద్వితీయుడు, ఏ మనిషితో తన మహిమను పంచుకొనడు.

ప్రభువు ఎంత అద్భుతంగా ఉన్నాడో మీరు గ్రహించడం ప్రారంభించారా?

Share