Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

 

ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి

“త్వరలో” అనే గ్రీకు పద౦ ను౦డి మన ఇ౦గ్లీష్ పదాలు “టాక్సీ”, “టాచో మీటర్” లభిస్తాయి. టాచో మీటర్ వేగాన్ని కొలుస్తుంది. ఒక టాక్సీ మనలను త్వరగా ఏదో స్థలానికి తెసుకెళ్ళాలి. అలాగని ఎప్పుడూ అలా జరుగక పోవచ్చు!

“త్వరగా” అంటే, వేగము, శీఘ్రము, వేగము, తొందరగా. ప్రకటన గ్ర౦థ౦లోని స౦ఘటనలు జరిగినప్పుడు అవి చాలా స్వల్పకాలవ్యవధిలోనే త్వరగా వచ్చేస్తాయి. సంఘటనలు త్వరితగతిన వస్తాయి. దేవుడు అ౦త్యకాల స౦ఘటనలు జరిగినప్పుడు వాటిని త్వరితగతిన అమలుచేస్తాడు.

ఈ పదబంధం ఖచ్చితం అనే భావనను తీసుకొస్తుంది. దేవుడు ఈ పుస్తక౦లో ఉన్న చర్యలను చేపట్టినప్పుడు ఎలా౦టి షరతు, ఆలస్య౦ ఉండవు.

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది (ప్రకటన 22:12) యేసు తాను త్వరగా వచ్చుచున్నాడని చెప్పెను.

“తప్పక” అనే పద ఒక తార్కిక అవసరాన్ని సమర్పిస్తుంది. ప్రవచన౦ దైవిక అవసరాన్ని ప్రవచిస్తోంది. ప్రవచనము అనేది భవిష్య విషయాల యొక్క సమగ్ర దృశ్యం కంటే అతీతము; అది దైవ అవసరం యొక్క కార్యాచరణ. దేవుని స౦కల్ప౦ ఖచ్చిత౦గా నెరవేరును.

నియమము:

ప్రకటన గ్ర౦థ౦లోని స౦ఘటనలు ఖచ్చిత౦గా, త్వరగా సంభవించనైయున్నవి.

అన్వయము:

బైబిల్ లో రెండు రకాల ప్రవచనాలు ఉన్నాయి-నెరవేరిన మరియు నెరవేరని. నెరవేరిన ప్రవచన౦ ఖచ్చిత౦గా నెరవేరని ప్రవచనాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనే హామీని మనకు ఇస్తుంది.

Share