Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

 

తన దాసులకు కనుపరచుటకు

” కనుపరచుటకు” అనే పదానికి తెలియజేయుట, చూపించడం  – వెలుగులోకి తీసుకురావడం, ప్రదర్శించడం, ఎత్తి  చూపుట. క్రీస్తు యొక్క మానవత్వం, గొప్ప సచ్ఛలత్వం కలిగి ఉన్నప్పటికీ, భవిష్యత్తు విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రకటన అవసరం. క్రీస్తు యొక్క మానవత్వం అతని దైవత్వము ఒకటికాదు. తన మానవత్వంవలన పూర్తిగా తండ్రిపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రకటన గ్ర౦థ౦లోని చివరి గ్రహీతలు “ఆయన సేవకులు (దాసులు).” ప్రవచన౦ గురి౦చి ఊహాగానాలు చేసేవారికి కాకుండా, సేవక హృదయాలు ఉన్నవారికి దేవుడు ఈ పుస్తక౦ ఇచ్చాడు. భవిష్యత్తులో జరిగే విషయాల గురి౦చి ఆసక్తికరమైన దృక్పథ౦ కన్నా ఎక్కువగా తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనం సేవక హృదయాన్ని కలిగి ఉన్న మేరకు, ఆ మేరకు ఈ పుస్తకం ద్వారా మనకు లాభం చేకూరుతుంది. ప్రకటన ప్రభువు తన నుండి దాసులకు, ఒక యజమాని నుండి అతని సేవకులకు ఒక మాట.

స్పష్టంగా లేకపోయినట్లైతే ప్రకటన ఏం బాగుంటుంది? ప్రకటన గ్రంథం ప్రభువైన యేసు యొక్క ప్రదర్శన. బైబిలులో మరెక్కడా లేని విధంగా తండ్రి యేసును ఇక్కడ ప్రదర్శిస్తాడు. ఈ అధ్యాయ౦లోని చివరి భాగ౦, ప్రభువైన యేసుక్రీస్తు గురి౦చిన పూర్తి నిడివి గల చిత్రపటాన్ని ఇస్తు౦ది.

దేవుడు తన కుమారుని చూపే ఏకైక ప్రజ తన వారు మాత్రమే. బైబిల్ అనేది క్రీస్తు లేకుండా ఉన్నవారికి ఒక మూయబడిన పుస్తకం. దేవుని యొక్క ప్రతి కుమారునికి పరిశుద్ధాత్మ అను ఒక ఆంతర్య బైబిలు బోధకుడు ఉన్నాడు. క్రైస్తవేతరలు పరిశుద్ధాత్మను కలిగి ఉండరు, కాబట్టి వారు బైబిలును మరి ముఖ్యముగా ప్రకటన గ్ర౦థాన్ని అర్థ౦ చేసుకోలేరు.

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1కొరిం 2:14)

దేవుడాయనకు అనుగ్రహించిన

త౦డ్రియైన దేవుడు ప్రకటన గ్ర౦థానికి మూల౦ కాబట్టి, ఈ సమాచార౦ సర్వోన్నతమైన అధికారాన్ని కలిగిఉన్నది.

అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. (1కొరిం 15:24)

నియమము:

దేవుని ప్రజలు యేసును మరింత ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటారు.

అన్వయము:

మీరు ఒక పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించి, దానిని అర్థం చేసుకోక పోవడమో లేదా ఆసక్తికరంగా భావింపక పోయిఉండవచ్చు. మీరు బహుశా ఒక అధ్యాయం చదివి ఆ పుస్తకం తిరిగి షెల్ఫ్ లో పెట్టి ఉండవచ్చు. సంవత్సరాల తరువాత, మీరు వ్యక్తిగతంగా రచయితను కలుస్తారు. అప్పుడు మీరు తిరిగి పుస్తకంవద్దకు వెళతారు మరియు అది మీకు కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. బైబిలులో ఇది ఖచ్చిత౦గా నిజ౦. మనకు వ్యక్తిగత౦గా ప్రభువు గురి౦చి తెలిస్తే, ఆయన మనకు స౦భాషి౦చగల ప్రతీ విషయాన్ని, ప్రకటన గ్ర౦థాన్ని కూడా తెలుసుకోవాలని కోరుకుంటాం.

ఇప్పుడు మనకు ప్రభువు వ్యక్తిగత౦గా తెలుసు కాబట్టి ప్రకటన గ్ర౦థ౦ ఇ౦కా ఇలా చెబుతో౦ది. ప్రభువైన యేసును మనము ప్రేమిస్తాం. ఆయన గురించి మనం అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం.

Share