అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
ఈ వచనము ఈ పుస్తక ప్రవచనానికి రాజముద్ర వేస్తుంది. దేవుని వాక్యాన్ని, ప్రత్యేక౦గా యేసుక్రీస్తు సాక్ష్య౦ గురి౦చి సాక్ష్యమిచ్చే విషయ౦లో దేవుడు ఈ పుస్తక౦లోని విషయాలను చిహ్నాల్లో పెట్టాడు.
ఈ వచనములోని మూడు విషయాలకు యోహానున సాక్షి.
అతడు దేవుని వాక్యమునుగూర్చియు
మొదటిది, దేవుని వాక్యమును గూర్చి యోహాను సాక్షి (యిర్మీయా 15:16; యోబు 23:12; మత్తయి 4:4; 24:35; 1 పేతురు 1:23, 25). దేవుని వాక్య౦లోని సాక్ష్య౦ ప్రాథమిక౦, అనివార్యమైన విషయ౦. అది పునాది. దేవుని వాక్య౦లో దాని పునాది లేకపోతే మన౦ నిశ్చయత కోస౦ ఏమీ తెలుసుకోలేము.
యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు
రెండవది, “యేసుక్రీస్తు సాక్ష్యము”కు యోహాను సాక్షి. యేసు భూమ్మీది ఉన్నప్పుడు, మరియు ఆయన ఈ పుస్తక౦లో సమర్పి౦చుకున్న దానికి సాక్ష్య౦.
తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
మూడవది, “ఆయన చూచిన సమస్తము” కు యోహాను సాక్షి. యోహాను “తాను చూచిన సమస్తము” అనే పదాన్ని 54 సార్లు పుస్తకంలో పునరుక్తి చేశాడు. “చూశాను” 37 సార్లు సంభవిస్తుంది. ఈ పుస్తకంలోని విషయములు దర్శనాలువలన వచ్చాయి.
యోహాను సువార్త ప్రత్యక్ష సాక్షి యొక్క సువార్త. ఇది సాముదాయిక సువార్తలలో (మత్తయి, మార్కు, లూకా) నిజము కాదు. యోహాను లో మనం చదివే చాలా విషయాలు సాముదాయిక సువార్తలలో దొరకవు. యోహాను సువార్త వ్రాసిన అదే వ్యక్తి ప్రకటన గ్రంథము వ్రాశాడు. యోహాను చూచినంతగా మరి ఎవరూ చూడలేదు. యోహాను సత్యానికి ప్రత్యక్ష సాక్షి. ప్రకటనలోనిది ఏదీ యోహాను యొక్క ఆవిష్కరణ కాదు.
నియమము:
ప్రకటన గ్రంథం మన దృష్టిని సావధానతను కోరుకుంటుంది.
అన్వయము:
ప్రకటన దేవుని వాక్యము, యేసు యొక్క సాక్ష్యము, భవిష్యత్తు విషయాలకు సాక్ష్యము గనుక మన అవధానాన్ని కోరుతుంది. ఈ గ్రంథము దేవుని విలువల గొప్ప అధికారమును కలిగిఉన్నది.
ప్రకటన గ్రంథం లో ఏదీ యోహాను యొక్క స్వీయరచన కాదు. అంతా ప్రత్యక్షత ద్వారా వచ్చింది.