Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

 

ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని

ప్రవచన౦ విన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రవచనమును “చదువుట” ఒక విషయమైతే “వినుట” మరో విషయం.

ప్రకటన చరిత్ర కాదు; అది ప్రవచనమే. ప్రకటన తప్పనిసరిగా ప్రవచనమే. భవిష్యత్ పై మనందరి ఆసక్తి పడుతుంది. భవిష్యత్తుగురించి మనకు వెల్లడి చేయడానికి దేవుడు కరుణిస్తున్నాడు.

పుస్తకం చివరలో ఆశీర్వాదం యొక్క ఈ ప్రకటనను యోహాను పునరుక్తి చేసాడు.

ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు. (ప్రకటన 22:7)

గతంలోని యే ప్రవచనము నెరవేరక యుండలేదు. క్రీస్తు మొదటి రాకడ యొక్క ప్రవచనముల పూర్తి వివరముగా నెరవేరినవి. లేఖన౦లోని వేలాది ప్రవచనాల్లో ఒక్కటి కూడా నెరవేరక మానలేదు.

మన౦ ప్రకటన చదివితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మాత్రమే కాదు, మన౦ ఈ ప్రవచన౦ విన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.

నియమము:

మన౦ ప్రవచన౦ వినాలని దేవుడు ఆశిస్తున్నాడు, దాన్ని ఉపేక్ష చేయకూడదు.

అన్వయము:

ప్రవచనాన్ని అణచివేయు రోజులో మన౦ జీవిస్తున్నాము. దేవుని ప్రవచనాన్ని చిన్న చూపు  చూడడానికి అనేక కారణాలున్నాయి, కానీ కారణమేదైనా, అవి యోహాను విషయానికి వ్యతిరేకం.

ప్రవచనాల మీద చిన్నచూపు చూసే వారూ ఉన్నారు. అది వేరే రకమైన వక్రీకరణ. అయితే, దేవుని ప్రవచనార్థక కార్యక్రమము వైపు ఆశ కలిగి ఉన్నారా? ఈ వచన౦ ప్రవచనమును “విన౦డి” అని ఆజ్ఞాపి౦ది. అది మీ ఆధ్యాత్మికతపై ఎ౦తో ప్రభావ౦ చూపిస్తుందని మీరు గ్రహి౦చగలరా? ప్రకటన గ్ర౦థ౦ పట్ల మీ హృదయ౦లో సానుకూలమైన స౦క్షేపణ ఉన్నదా?

Share