Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక

 

కృపాసమాధానములు మీకు కలుగునుగాక

ప్రతి క్రైస్తవుడు దేవునితో సమాధానమును కలిగి ఉంటాడు (రోమా 5:1) కానీ కొద్దిమందే దేవుని సమాధానము కలిగి ఉంటారు (ఫిలిప్పీయులు 4:6). సిలువపై యేసు అందించిన రక్షణే దేవునితో సమాధానము. సిలువపై ఆయన చేసిన పనిని మనము అంగీకరించినపుడు, మనము దేవునితో శాశ్వతమైన సమాధానము కలిగి ఉన్నాము. ఇక మనం ఆయన శత్రువులం కాము.

మనం లోపలివైపు సరిచేయబడితే దేవుడి సమాధానము వస్తుంది. కొంత మంది బైట నవ్వుతారు కానీ లోలోపల ఏడుస్తారు. ఇది దీనికి పుర్తిగా వ్యతిరేకం. బయట కన్నీళ్లు పెట్టుకుంటాం కానీ లోలోపల సమాధానము.

                           ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు.

                            ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. (యెషయా 26:3)

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.౹ 7అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. (ఫిలిప్పీ 4:6,7)

దేవుడు సమాధాన అధిపతి

గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. (హెబ్రీ 13:20,21)

అదే క్రమములో, త్రిత్వము ను౦డి కృప, సమాధాన౦ వచ్చే లేఖన భాగము ఇది మాత్రమే. సాధారణంగా కృప, సమాధానము అనేవి తండ్రి, కుమారుల నుంచి వస్తాయి.

నియమము:

దేవుని సమాధాన౦ మన హృదయాలను కప్పుతుంది.

అన్వయము:

కృప, సమాధానములు దేవుని వద్ద మాత్రమే దొరుకును. దానికోసం దేవుని దగ్గరకు వస్తే మనకు సమాధానము దొరుకును.

కష్టాల్లో ఉన్న సమయాల్లో దేవుని సమాధానము వస్తుంది. బాహ్య అలజడులలో అంతర్గత ప్రశాంతత పొందవచ్చు. ఆయన సమాధాన౦ మన హృదయాలను, మనసులను నిబంధిస్తుంది. దేవుని సమాధానము మన సమస్యలను మార్చదు కాని ఈ సమస్యలలో మనకు ప్రశాంతత నిస్తుంది. మన సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోడానికి వీలు కల్పిస్తుంది.

Share