నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
భూపతులకు అధిపతియునైన
యేసు రాజైన యేసు, ప్రపంచానికి రాజు. ప్రపంచ పాలకులు అందరూ యేసు నుండి తమ అధికారాన్ని కలిగిఉన్నారు. యేసు యొక్క అధికారము వారి అధికారాన్ని పరిమితం చేస్తుంది. భూలోకపు రాజకీయ నాయకులకు ఈ విషయం ఇప్పుడే తెలియదు కానీ భవిష్యత్ లో మాత్రం వారు తెలుసుకుంటారు.
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. (1తిమో 6:15)
యేసు సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6)
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. (అపో.కా. 3:14,15)
ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు. (అపో.కా. 5:31)
నేడు అపవాది లోకాధికారిగా ఉన్నాడు(ఎఫెసీయులకు 2:2). ఒక రోజు సహస్రాబ్దిలో యేసు రాజులకు రాజుగా, లోకానికి రాజుగా ఉంటాడు.
నియమము:
యేసు అంతిమంగా లోక సమస్యలను అధిగమిస్తాడు.
అన్వయము:
ప్రపంచ సమస్యలు అంతిమంగా ప్రజాస్వామ్యం ద్వారా పరిష్కరించబడవు. ఒక సద్గతి నియంత, రాజైన యేసు, ప్రపంచ చక్రవర్తి వాటిని పరిష్కరించుట దేవుని ప్రణాళిక.
మనిషి స్వభావం ఎంతగా భ్రష్టుపట్టిందంటే, ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రజాస్వామ్యాలలో కూడా మానవునికి ఆశ లేదు. ఒకే వ్యక్తిలో అంతిమ సమాధానం ఉంది. వ్యక్తిగత స్థాయిలో, అదే వ్యక్తి ప్రతి వ్యక్తికీ సమాధానం. ఆయనను మన రక్షకునిగా హత్తుకుంటే మనకు దేవుని తో సమాధానము పొంది, దేవుని సమాధానమును కలిగి ఉండగలము.