Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్.

 

తన రక్తమువలన

యేసు తన జీవితము వలన పాపము నుండి మనలను విడిపించలేదు. ఆయన మరణము ద్వారా, అనగా మన పాపముల నిమిత్తము సిలువపై తన ప్రత్యామ్నాయ మరణమువలన మనలను విడిపించెను.

రక్తము పాత నిబంధనలో ప్రాయశ్చిత్తము చేయు విధానము (నిర్గమకా౦డము 12:13; లేవీయకా౦డము 17:11). పాతనిబంధనలో దేవుడు పాపము [ప్రాయశ్చిత్తము, కప్పుకొనడానికి] కప్పాడు కాని క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు రక్తము ద్వారా పాపము పూర్తిగా తుడిచివేసాడు.

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. (మత్తయి 26:28)

పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. (రోమా 3:25,26)

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము (రోమా 5:9)

దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. (ఎఫెస్సీ 1:7)

అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. (ఎఫెస్సీ 2:13)

ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. (కొలస్సీ 1:19,20)

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1పేతురు 1:18,19)

ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు (ప్రకటన 5:9,10)

వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణమువరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు. (ప్రకటన 12:11)

నియమము:

మనకు నిత్యజీవము గలదు కాబట్టి యేసు తన జీవితాన్ని ఇచ్చాడు.

అన్వయము:

ప్రతి సందర్భంలోనూ మనలను క్షమించునది క్రీస్తు రక్తము, మతము కాదు, మంచి పనులు లేక సమాజానికి మేలు చేయుట కాదు.

రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ ఉండదు. యేసు మన పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల (యోహాను 1:29)

మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. (హెబ్రీ 9:22)

నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును. (హెబ్రీ 9:14)

సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, (హెబ్రీ 10:19,20)

యేసు తన రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను విముక్తం చేస్తున్నాడు. నా పాపమును కడుగునాడి యేది? యేసు రక్తము తప్ప మరేది లేదు. దేవుడు యేసును మన పాపములకొరకు తీర్పు తీర్చెను. ఇక పాపమునకు తీర్పు లేదు. దేవుని దృష్టిలో అవసరమైనవన్నీ యేసు అనుభవి౦చాడు. పాపాలను క్షమించగల ఏకైక వ్యక్తి యేసు. యేసు గొప్ప విమోచనకర్త.

పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. (కీర్తనలు 103:12)

యేసు మన పాపములను మన నుండి అంతగా తొలగించెను.

మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను

నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతినుండి విడిపించితివి.

నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి. (యెషయా 38:17)

Share