Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,

 

వందనవచనాలు నాలుగవ వచనమునుండి ఆరవ వచనము వరకు నడుస్తుంది. ప్రకటన గ్ర౦థ౦ ఒక పత్రిక కాకపోయినా, ఈ పలకరి౦పు పత్రికలో వలె కనిపిస్తుంది.

యోహాను

యోహాను క్రొత్త నిబంధన యొక్క ఐదు పుస్తకాలను రచించాడు. ప్రకటన ఒక్కటే ఆయన సంతకం చేసిన పుస్తకం. యోహాను సువార్తలో తనను తాను “యేసు ప్రేమించిన వాడు” అని పేర్కొన్నాడు. మొదటి యోహానులో తనగురించి యేమియు చెప్పుకోడు. అతను తన రెండవ మరియు మూడవ యోహాను పత్రికలలో “పెద్దగా” ప్రస్తావిస్తాడు. ప్రకటనలో అతను తనను తాను ఐదు సార్లు (1:1, 4, 9; 21:2; 22:8) పేర్కొన్నాడు.

ఆసియలో ఉన్న యేడు సంఘములకు

“ఆసియాలోని ఏడు సంఘములు” అని తాను వ్రాసేవారిని యోహాను చెప్పాడు. వీరు ఆసియా మైనర్ (పశ్చిమ టర్కీ) లోని రోమన్ ప్రావిన్స్ లోని ప్రజలు. ఇవి రెండు, మూడు అధ్యాయాల సంఘములు. 1:11 లో ఈ సంఘములకు ఆయన పేర్లు పెట్టాడు. ఏడు సంఘములు వాస్తవ సంఘములు, సంఘములకు చిహ్నాలు కాదు.

పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో ఆసియాకు వచ్చాడు (అపొస్తలుల కార్యములు 16:6). ఆ సమయంలో అక్కడ పరిచర్యకోసం దేవుడు తలుపు మూసేశాడు. సమయం సరిగ్గా లేదు. అయితే, నాలుగు సంవత్సరాల తరువాత సమయం సరిగ్గా ఉంది.

రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి. (ఆపో.కా 19:10)

రోమన్ ప్రప౦చ౦లోని అన్ని ప్రా౦తాల్లో పౌలు ఆసియా మైనరులో తన గొప్ప విజయాల్ని సాధి౦చాడు. మొదటి సారి తన సువార్త బృందాన్ని అక్కడ ప్రారంభించాలని ప్రయత్నించినా దేవుడు తలుపు మూసి వేసాడు. రెండో సారి దేవుడు తలుపు తెరిచాడు. పౌలు, తన పరిచర్యకు స౦బ౦ధి౦చిన మరే ఇతర స్థల౦కన్నా ఎక్కువ కాల౦ అ౦టే మూడు స౦వత్సరాల పాటు రాజధానియైన ఎఫెసస్ లో ఉన్నాడు.

యోహాను ప్రకటన 50 సంవత్సరాల తరువాత వ్రాశాడు. పౌలు అప్పటికి పరలోక౦లో ఉన్నాడు. యోహాను ఇతర అపొస్తలులందరి కంటే ఎక్కువ కాలము జీవి౦చాడు. బహుశా మొత్తం ఏడు సంఘములు పౌలు తన మూడు స౦వత్సరాల పరిచర్య కాల౦లో స్థాపి౦చబడ్డాయి.

యోహాను ఏడు సంఘములకు ప్రకటన వ్రాశాడు కాబట్టి, ఈ పుస్తక౦ క్రైస్తవులకు. క్రైస్తవులు కానివారు ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోలేరు.

నియమము:

పరిచర్య దేవుని సమయపాలన మీద ఆధారపడివు౦టు౦ది.

అన్వయము:

కొన్నిసార్లు మన౦ పరిచర్య ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తాము. దేవుని సమయ౦ కోస౦ వేచిచూసే వివేచన మనకు లెకపొవచ్చు. కార్యానుకూలమైన మంచి సమయముకొరకు మనము ఎదురు చూడాలి.

ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీ క్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును. (1కొరిం 16:8,9)

క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని. (2కొరిం 2:12,13)

మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమునుగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమ యము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి. (కొలస్సీ 4:3,4)

 

Share