అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
దేవుడు ఇప్పుడు ప్రకటన గ్ర౦థముపై సంతకము పెట్టాడు. బైబిలులోని మరే పుస్తకములో దేవుని యొక్క సంతకము లేదు. ఇది దేవుడి ఆటోగ్రాఫ్. యేసు సర్వశక్తిమ౦తుడైన దేవునిగా సంతకము చేస్తున్నాడు.
అల్ఫాయు
“ఆల్ఫా” గ్రీకు అక్షరమాల యొక్క మొదటి అక్షరం. క్రొత్త నిబంధన ఆల్ఫా ను ప్రాముఖ్యత లేదా ముఖ్యమైన అనే ఆలోచనతో ఒక శ్రేణిలో మొదటిదిగా ఉపయోగిస్తుంది. లౌకిక సాహిత్యం ఆల్ఫా మరియు ఒమేగా ను మొత్తం విశ్వంముకు వర్తింపజేస్తుంది. ఈ శీర్షిక, యేసు విశ్వమ౦తటికీ అధినివేశ౦ అని అర్థమునిస్తుంది. ఆయన సమస్తముకు “అ” మరియు “ఱ”. ప్రకటన తండ్రికి (21:6; 22:13) మరియు కుమారునికి (1:17; 2:8) రెండింటిలో ఆల్ఫా మరియు ఒమేగా లను ఉపయోగిస్తుంది.
ఆల్ఫా ఇప్పుడు క్రీస్తు యొక్క బిరుదు (1:8, 11; 21:6; 22:13). ఇది దేవుడు (1:8; 21:6) మరియు క్రీస్తు (22:13) ఒకే సమాంతరంతో (మొదటి మరియు చివరి) ఉన్న ఒక హోదా. ఇది క్రీస్తు దైవత్వాన్ని నిర్ధారిస్తుంది. పరిశుద్దాత్మ తండ్రికి ఏమి వర్తింపజేయునో, అది కుమారునికి వర్తింపజేయును. ఈ నిబంధనలు నిత్యుడైన దేవునిని సూచిస్తాయి. ఇది సమస్త సృష్టిలోనూ తన కార్యసాధక కార్యకలాపాన్ని కుదస్తుంది.
ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. (రోమా 11:36)
ఓమెగయు నేనే
ఒమెగా అనేది గ్రీకు వర్ణమాల యొక్క చివరి అక్షరం. అన్ని విషయాల్లోనూ దేవుడే అంతం. దేవుడు ఆది (ఆల్ఫా) మరియు అన్ని విషయాల సమాప్తి. సమస్త సృష్టికి మూలము, లక్ష్యము రెండూ దేవుడే. ఏదీ అతనికి అతీతము కాదు. ఆయన పరమ దేవుడు. ఒమేగ సూచనార్థక౦గా “అంతము” అని అర్థ౦. భగవంతుడు అన్ని విషయాలలోనూ ఆది, అంతం రెండూ అయి ఉన్నాడు. సమస్త సృష్టికి దేవుని మహిమే లక్ష్యం.
ఆల్ఫా మరియు ఒమేగా అనే బిరుదు క్రీస్తు యొక్క సర్వ సమగ్రతను సూచిస్తుంది (ప్రకటన 1:8, 11; 21:6; 22:13). అధికారం, హోదా అను వాటిలో ఆయన సమస్తమును కలిగి ఉన్నారు. కేవలం యోహాను మాత్రమే ఈ నామమును దేవుని కొరకు ఉపయోగించెను (1:8; 21:6). ఈ పదాన్ని యేసు (22:13; 1:17; 2:8) కు కూడా వర్తింప చేశాడు. యేసు తనను తాను ప్రకటన గ్ర౦థ౦లో నాలుగుసార్లు “ఆల్ఫా, ఒమేగా” గా పిలిచాడు.
అనగా–ఆదియు అంతము నేనే
” ఆదియు అంతము” తో ఆల్ఫా మరియు ఒమేగా యొక్క ఉపయోగం దాని అర్థాన్ని నిర్వచిస్తుంది. అన్ని విషయాలలోనూ దేవుడు ఆది, అంతం. ” ఆదియు అంతము” యెషయా 41:4 లో సంభవిస్తుంది; మరియు 44:6.
ఈ వాక్యం “ఆల్ఫా మరియు ఒమేగా” ను పోలి ఉంటుంది. యేసు ప్రారంభము మరియు అంతము(1:17; 21:6).
మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. (హెబ్రీ 12:2)
యేసు మన విశ్వాసాన్ని ఉద్భావి౦పచేసి, దానిని సంపూర్తి చేయును.
నియమము:
యేసుక్రీస్తు సమస్త సృష్టికి లక్ష్యము.
అన్వయము:
సృష్టి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మనము ప్రపంచంలో దేవుని మహిమను గుర్తించుట. అదే మన వ్యక్తిగత జీవితాల పరమార్థం. దేవుడు అంటే ఏమిటో ప్రపంచానికి తెలియచేయాలి. ఆయన మహిమ మహోన్నతమైనది; మనకు తెలిసిన వారికి దానిని మహోన్నతంగా ప్రచురపరచాలి.