అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే
యోహాను ఈ బిరుదును నాలుగవ వచనములో తండ్రికి ఇచ్చాడు మరియు ఇప్పుడు దానిని క్రీస్తుకు ఇస్తున్నాడు. ‘భూత కాలములో’ అనునది కుమారుని భూత కాలములోని కుమారుని ఉనికిని గూర్చి చెబుతుంది, ‘ వర్తమాన కాలములో… ఉండువాడను’ అనునది శరీరధారిగా వచ్చిన సంధార్భమును సూచిస్తుంది. ‘ భవిష్యత్కాలములలో ఉండువాడను ‘ అనునది రెండవ రాకను సూచిస్తుంది (యోహాను 1:1). తన పట్టాభిషేకానికి రానున్నాడు. ఆ దినమున లోకమంతా అతని న్యాయముకై ఎదురు చూస్తుంది. ఇది ఆయన యొక్క ముఖ్యమైన మరియు సాగిపోవు స్వభావాన్ని వివరిస్తుంది. దేవుని ఉనికి మరియు కాలము శాశ్వతత్వము.
అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
‘సర్వాధికారి’ అంటే అందరికీ అధిపతి. ఈ పదం రెండు పదాల నుండి వచ్చింది: అన్నీ మరియు పట్టుకొనుట. దేవుడు సమస్తమును స్వాదీనములో కలిగి ఉంటాడు. ప్రకటన ఈ పదాన్ని తొమ్మిది సార్లు (1:8; 4:8; 11:17; 15:3; 16:7, 14; 19:6, 15; 21:22) ఉపయోగిస్తుంది. ఆయన విశ్వవ్యాప్తంగా సార్వభౌముడు.
భగవంతుడు అన్నింటినీ నియంత్రించు సార్వభౌముడు. షద్దాయ్ అను మాటను అనువదించడానికి పాత నిబంధన ఈ పదాన్ని 48 సార్లు ఉపయోగిస్తుంది. షద్దాయ్ అంటే సర్వ సమృధ్ధిగల వాడు అని అర్థం. దేవుడుడు సర్వ శక్తిగల వాడు మాత్రమే కాదు, అన్ని విధాలా సరిపోయిన వాడు.
యేసుక్రీస్తు సర్వశక్తిగల దేవుడు. తండ్రీకొడుకులిద్దరూ ఈ శీర్షికను బైబిలు ఉపయోగిస్తో౦ది.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన భుజముమీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని
అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:6)
అందుకే యేసు ‘ నేనును, తండ్రియును ఏకమై ఉన్నాము ‘ (యోహాను 10:30; 14:9) అని చెప్పెను. తండ్రీ కుమారులు బలములో సమానులు. వారు సరి సమానులు.
నియమము:
యేసు సర్వశక్తిమ౦తుడు, కాబట్టి ఆయనకు మన జీవితాలపై సర్వాధిపత్య౦ ఉ౦డాలి.
అన్వయము:
యేసు సర్వశక్తిమ౦తుడైన దేవుడు. యేసు గురి౦చిన ఈ వాస్తవమునకు మన౦ ఎ౦తో అవధానము ఇవ్వాలి, ఎ౦దుక౦టే ఆయన ఎవరు అనే విషయ౦ వాస్తవ౦. మనల్ని ఎట్టి పరిస్థితిలోనూ ఆదుకునే సామర్ధ్యము ఆయనకు ఉంది.