Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

 

దేవుని వాక్యము నిమిత్తమును

రోమా ప్రభుత్వ౦, “దేవుని వాక్యము” కోస౦, 2) “యేసుక్రీస్తు సాక్ష్య౦ కోస౦” అనే రె౦డు కారణాలను చెబుతూ, యోహానును పత్మాసుకు తరలించింది. యోహాను పొందిన శ్రమలు దేవుని వాక్యము నిమిత్తమును, యేసుక్రీస్తు గూర్చిఇచ్చిన సాక్ష్య౦ నిమిత్తమును వచ్చాయి.

గ్రీకు భాషలో “నిమిత్తము” అనే పదానికి అర్థం ‘ఎందుకంటే’. దేవుని వాక్యము వల్లనే ఆయన చెరలో వేయబడ్డాడు. యోహాను దేవుని వాక్య౦లో తీర్మానము తీసుకున్న౦దుకు హి౦సి౦చబడ్డాడు. ఆయన దేవుని వాక్యముకు నమ్మకస్తుడు. దాని విషయములో ఆయన రాజీ పడలేదు.

కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చి యైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైనశ్రమానుభవములో పాలివాడవై యుండుము. (2తిమో 1:8)

యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును

“నిమిత్తము” అనే పదానికి అర్థం ఎందుకంటే. క్రీస్తు కోస౦ సాక్ష్య౦ ఇచ్చిన కారణ౦గా రోమా యోహానును పత్మాసుకు తరలించబడ్డాడు.

పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

పత్మాసు ఒక చిన్న (ఆరు కిలోమీటర్ల వెడల్పు మరియు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన) రాళ్ళుకలిగిన ద్వీపం ఏజియన్ సముద్రంలో సుమారు 80 నుండి 100 కిమీ నైరుతి దిశలో (ఆధునిక టర్కీలో) ఉంది. రోమా ప్రభుత్వము, క్రీస్తు కొరకు తన సాక్ష్యము కొరకు యోహానును బహిష్కరించింది. క్రీస్తు కొరకు చెరలో ఉన్నాడు.

నియమము:

విశ్వాస౦ ద్వారా జీవి౦చే వారు సమాజ౦ ను౦డి బహిష్కరించబడుటను సహి౦చగలరు.

అన్వయము:

ప్రపంచం మన స్నేహమును అడుగుతుంది. మనము ఇవ్వనప్పుడు వారు మనలను బహిష్కరించబడిన వారిగా దృష్టించుకుంటారు. మన విశ్వాసాన్ని పంచుకునే విషయములో తటస్తత అను మాట లేదు. దేవుని వాక్యాన్ని నమ్మక౦గా ప్రకటి౦చుటకు బహిష్కరింపబడుట అను  వెల చెల్లి౦చు సంధార్భము ఇది.

తన విశ్వాసాన్ని పంచుకునే వ్యక్తి బహిరంగ యుద్ధాల్లో ప్రవేశిస్తాడు. క్రీస్తు యొక్క పరస్పర ప్రత్యేక సందేశము వలన తటస్థత లేదు.

క్రీస్తుకు మీరిచ్చిన సాక్ష్య౦ కారణ౦గా మీరు బహిష్కరింపబడిన వారిగా అనిపిస్తారా? అపొస్తలుడైన యోహాను దగ్గరకు చేరండి, ఎ౦దుక౦టే ఆయన కూడా బహిష్కరింపబడ్డాడు. క్రీస్తును తాను గొప్పగా ఉద్దేశించినందున క్రీస్తు కొరకు బాధ పడటానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు పట్ల మనకున్న ప్రేమ, మెప్పుదల ఈ విషయ౦లో స్పష్టమౌతుంది.

Share