అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు
అతడు ఇనుపదండముతో వారిని ఏలును
ఈ వచనము రెండవ కీర్తన (2: 8,9) యొక్క ఉల్లేఖనం మరియు యేసు తన వెయ్యేళ్ళ రాజ్యాన్ని భూమిపై ఏర్పాటు చేయడాన్ని సూచిస్తుంది .
” నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా
పగులగొట్టెదవు”(కీర్తన 2: 8-9).
సంఘయుగంలో నమ్మకమైన విశ్వాసులు వెయ్యెండ్ల పాలనలో క్రీస్తుతో పరిపాలన చేస్తారు . “ఏలును” అనే పదానికి గొర్రెల కాపరి అని అర్థం . ఒక గొర్రెల కాపరి తన చేతికర్రను ఉపయోగిస్తాడు. అతను తన గొర్రెలను రక్షిస్తాడు. క్రైస్తవులు గొర్రెల కాపరి యొక్క అధికారంతో పని చేస్తారు.
యేసు వెయ్యేళ్ళ పరిపాలనలో పరిపూర్ణ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు . ఆయన నేరాలను నియంత్రిస్తాడు. ప్రపంచ రాజధాని వాషింగ్టన్ లో కాకుండా జెరూసలెంలో ఉంటుంది
వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు
యేసు తనపై తిరుగుబాటు చేసే ప్రతి వ్యక్తిని, ప్రభుత్వాన్ని భూమి ముఖం నుండి తొలగిస్తాడు. ప్రపంచ దేశాల యొక్క అన్ని అధికారాలను యేసు విచ్ఛిన్నం చేస్తాడు . ఆయాన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసు తన రాజ్యంలోనుండి దుష్టశక్తులను విచ్ఛిన్నం చేస్తాడు.
నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు
తండ్రి ప్రభువైన యేసుకు ఇచ్చిన అధికారం వంటి అధికారం క్రైస్తవులకు లభిస్తుంది .
నియమము:
క్రైస్తవులకు వెయ్యేళ్ళ రాజ్యంలో ప్రత్యేక హక్కు మరియు బాధ్యత ఉంది.
అన్వయము:
యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన పరిపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అతను “అతడు ఇనుపదండముతో వారిని ఏలును.” సహస్రాబ్ది ప్రభుత్వంలో ఎవరికీ ఓటు లేదా స్వరం కూడా ఉండదు.
దేవుని వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఆదర్శవంతమైన ప్రభుత్వం కాదు. ప్రపంచానికి ఏమి అవసరమో బాగుగా యెరిగిన యేసు రాజుగా పరిపాలన చేస్తాడు .