Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

10వ వచన౦ ఉపోద్ఘాత౦ ను౦డి, పత్రికలోని ముఖ్యభాగమునకు పరివర్తన పొ౦ది౦ది.

ఇప్పుడు

పౌలు ఎనిమిది తొమ్మిది వచనాల్లో తాను ఉపయోగి౦చిన కఠినమైన మాటలను సమర్థి౦చుకున్నాడు. కృప సువార్త విషయము(vv. 8-9) కట్టుబడి ఉండని వారికి శాపాన్ని ప్రకటించటం ద్వారా, ఆయన ప్రజలను సంతోషపెట్టడు.

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా?

పౌలు ఇప్పుడు తన ఖ్యాతిని స౦పాది౦చుకోవడానికి తన స౦దేశాన్ని సరళించాడు అను ఆరోపణలకు జవాబిస్తున్నాడు. ఆయన అపొస్తలత్వము ఆధరపడు సందేశమును అప్రతిష్ఠపాలు చేయడానికి ధర్మశాస్త్రవాదులు బయలుదేరారు. వారు ఆయన అపొస్తలత్వాన్ని బలహీనపరచగలిగితే, వారు ఆయన కృప స౦దేశాన్ని బలహీనపర్చగలరు. మొదటి రె౦డు అధ్యాయాల్లో పౌలు తన అపొస్తలత్వపు చట్టబద్ధతను సమర్థిస్తున్నాడు.

 “సంపాదించుకొన జూచుట” అనే పదానికి అర్థం, తర్కం యొక్క ప్రభావం ద్వారా మనస్సును మార్చుట. ఇక్కడ ఒకరి ఆమోదం పొందాలనే అర్ధం. పౌలు మనుష్యుల ఆమోదాన్ని లేదా దేవుని ఆమోదాన్ని పొ౦దడానికి ప్రయత్నిస్తున్నాడా? పౌలు గుడ్డి వాడు కాదు. ఆయన సువార్తను అనుసరి౦చే౦దుకు ఎన్నడూ వక్రీకరించడు. తన కోసం కాకుండా తన సందేశమునకు ప్రజలను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సత్యానికి వస్తే, స్వప్రయోజనము ఎప్పుడూ సరైనది కాదు.

పౌలు ప్రజలను స౦తోషపెట్టడానికి జీవి౦చే కాల౦ ఉ౦దని “ఇప్పుడు” అనే మాట సూచిస్తో౦ది. ఆయన పరిసయ్యుడుగా ఉన్నప్పుడు ఆయన ప్రధాన ఉద్దేశ౦ అదే. ఇప్పుడు తాను క్రైస్తవుడుగా, తన స౦దేశాన్ని మార్పుచేయుట ద్వారా ఆయన మనుష్యులను స౦తోషపెట్టడు.

“పౌలు సువార్తను గలతీయులకు మరి౦త మధురముగా చేసేలా సువార్త లోని చట్టపరమైన అవసరాలను తగ్గి౦చాడని ధర్మశాస్త్రవాదులు సూచి౦చారు. వారు “అతను ఒక అధికార వాంచకలిగిన పర్యటనలో ఉన్నాడు మరియు రాజ్య నిర్మాణ వ్యాపారంలో ఉన్నాడు” అని వారు చెప్పారు. తన సందేశము బలహీనపరచుబడునని ఆశిస్తూ వారు తన వ్యక్తిత్వముపై దాడి చేశారు. “అతను కేవలం మనుషుల గుంపును పోగుచేసుకొనుటకు కోసం తన సందేశాన్ని రాజీ చేసే వ్యక్తి.”

ప్రజల మధ్య సత్స౦బ౦ధ౦ కోస౦, వారి అనుగ్రహాన్ని స౦పాది౦చడానికి, వారి మెప్పును స౦పాది౦చడానికి సర్దుబాటు సత్యమును త్యాగము చేస్తుంది. పౌలు మనుష్యులను సంతొషపెట్టే పనిలో లేడు [ఆయన ఉపయుక్తత చేసినను (1 కొరి౦థీయులు 9:22). ఆయన కృప సందేశము వలన దేవుని అనుగ్రహాన్ని పొ౦దుకొను పనిలో ఉన్నాడు. స్పష్ట౦గా, ఆయన దేవుని ఆమోదాన్ని పొ౦దడానికి తప్ప, మనుష్యుల ఆమోదాన్ని పొ౦దడానికి లేడు. క్రీస్తు కోసం ప్రజలను చేరుకునేందుకు ఆయన జిమ్మిక్కులు చేయలేదు. వారు తమ రక్షణను లేదా పరిశుద్ధతను తమకు తాముగా సహాయ౦ చేసుకొగలరని భావి౦చడ౦ ద్వారా ఆయన వారిని పొగడలేదు.

నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా?

పౌలు శత్రువులు, పరిస్థితికి సరిపోయేలా తన స౦దేశాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఆయన అవినీతి విధానాన్ని ఉపయోగి౦చాడని ఆరోపి౦చారు. ధర్మశాస్త్రవాదులు గలతీయులమెప్పు పొందుటకు కృపగురించి బోధించాడు అని ఆరోపి౦చారు. ఒకరు రక్షణ క్రియల అవసరము లేదు (ఎఫెసీయులకు 2:8,9).

సూత్రం:

మన స౦దేశానికి కట్టుబడి ఉన్నప్పుడు మన౦ దేవుని ఆమోదాన్ని పొ౦దుతాము.

అనువర్తనం:

వసతి మార్గాలను ఉపయోగించడం మరియు సందేశంలో రాజీపడటం మధ్య ఎప్పుడూ సౌవార్తీకరణలో ఉద్రిక్తత ఉంటుంది. క్రీస్తు లేని వారిని చేరుకోవటానికి మీ పద్ధతిని మలచడము ఒక విషయం, కానీ వారిని గెలవడానికి మీ సందేశాన్ని మలచుట మరొక విషయం.

పౌలు ప్రజలను చేరుకునెందుకు స౦దేశములో స౦స్కృతిపరమైన శైలీపరమైన మార్పులు చేశాడు (1 కొరి౦థీయులు 9:19-23) ఎందుకనగా సంస్కృతి సందేశమును గందరగోళము చేయకూడదని. అయితే, తాను చేరాలనుకున్న వ్యక్తులకు సరిపోయేవిధంగా తన సందేశాన్ని ఎన్నడూ వక్రీకరించలేదు.

నేడు సాధక సేవా దృక్పథ౦లో, సంఘమునకు వెలుపటివారు అభ్యంతరపడకుండా స౦దేశాన్ని నీరుగార్చే ప్రమాద౦ ఉ౦ది. 21వ శతాబ్దంలో ప్రజల సంస్కృతికి సరిపడువిధంగా సాధకసేవమెథడాలజీ బైబిల్ లో ఉంది. సందేశాన్ని సవరించినట్లయితే, సాధకసేవ యొక్క మెథడాలజీ వాక్యసంబంధమైనది కాదు. ప్రజలకు చేరుకునేందుకు మనం సందేశాన్ని వక్రీకరిస్తే, అప్పుడు మనం మనిషులను సంతొషపెట్టు వ్యాపారంలో ఉన్నాం. అనుచరులను సంపాదించడానికి మనుషులను సంతొషపరచడమునకు బైబిల్లో సమర్థన లేదు.

సువార్తను సవరణ చేస్తే, మన౦ విశ్వాసస౦బ౦ధమైన శాడోబాక్సర్లమైపోతాము. సువార్త యొక్క సత్యాన్ని ప్రజంట్ చేసేటప్పుడు ప్రజాదరణ పోటీలో మనము నిలవటం లేదు. సత్యం గుణకారం పట్టికవలె ధృడముగా ఉండి మరియు ఒక సంఘమునకు వెలుపలి వారి సంస్కృతికి అణుగుణముగా స్వీకరించబడదు.

మనం మతపరమైన టో డ్యాన్స్ ను మార్పుచేయబడిన సువార్తతో చేసినప్పుడు, దేవుని బాల్ రూమ్ నుంచి వెలుపల సువార్తను నాట్యం చేస్తాం. నికార్సైన కృప సువార్త ప్రకటన సులభమైనది కాదు ఎందుకంటే, తాము నశించినవారని, ఒక రక్షకుడు అవసర౦ అని ప్రజలకు చెప్పడ౦ అ౦త సులభ౦ కాదు. తమ రక్షణ కోసం తాము ఏదైనా చేయగలమని ప్రజలు వినాలని కోరుకుంటారు.

Share