Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

క్రీస్తుదాసుడను కాకయేపోవుదును

ప్రజలను సంతోషింపచేసే వారిపై పౌలు వాదన ఏంటంటే ఆయన “క్రీస్తుకు దాసుడు.” కృప క్రీస్తుపై తన భక్తిని తగ్గించలేదు. యేసుపట్ల ఆయన దాసుని మనస్తత్వ౦తో పనిచేశాడు. క్రీస్తు కోసం తాను ప్రాణము పెట్టడానికి ఆయన సిధ్ధముగా ఉన్నాడు. ఆయన కృపయొక్క సువార్తను వక్రీకరణ చేయలేదు. ఆయన కృప సువార్తకు కట్టుబడిఉండుటకు ముల్యమును చెల్లించాడు.

” అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి ” (అపొ. 14:19).

” నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమపెట్టవద్దు. ” (గలతీయులు 6:17).

బానిసకు ఒకే యజమాని ఉండగలడు అనునది సర్వ సాధారణము. బానిసకు తన స్వంత సంకల్పాలు లేవు. ఆయన దేవుని సంకల్పానికి మాత్రమే లోబడతాడు. మానవ అభిప్రాయాలకూ, దేవుని అంచనాకూ పౌలు దాసుడు కాలేడు. తన సందేశాన్ని నీరుగార్చలేదు లేదా పురుషులకు కొన్ని మార్పు చేర్పులుచేయలేదు.

సూత్రం:

యేసు తన ప్రభువు అయితే, ఒక క్రైస్తవుడు మనుష్యుల ను౦డి ప్రాచుర్య౦ పొ౦దాలని కోరుకోడు, కానీ ప్రభువును సంతోషపెట్టగోరును.

అనువర్తనం:

దేవుని స౦దేశానికి మన౦ కట్టుబడి ఉ౦టే, మన౦ ప్రజల పట్ల ఉన్న ఆదరణను కోల్పోతాము. నిజమైన సువార్తను చెపట్టువారి అనుగ్రహాన్ని పొ౦దుతాము కానీ కృప సువార్త ను౦డి తొలగువారి అనుగ్రహాన్ని కోల్పోతాము. “నేను నా స౦దేశాన్ని మార్చితే వేధి౦పును౦డి తప్పి౦చుకోవచ్చు. నేను వారి కోరికలకు అనుగుణముగా రక్షణ పరిశుధ్ధత కర్మలవలన సాధించవచ్చు అని బొధిస్తే అప్పుడు నేను ప్రజలలో ప్రసిద్ధి గా౦చబడేవాడిని” అని మనము ఎన్నడూ చెప్పము.

మనం క్రైస్తవులమైనప్పుడు, మనం యేసును ప్రభువుగా గుర్తిస్తాం. ప్రభువైన యేసుకు మన హక్కులు మన౦ అ౦దిస్తాము. మహిమాప్రభువైన యేసుకు మనమీద సంపూర్ణ అధికారము౦దని మన౦ అ౦గీకరి౦స్తాము. మనం సొంతంగా సాధించలేము.

Share