Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.

 

నా పితరుల పారంపర్యాచారమందు

పౌలు ధర్మశాస్త్రవాదన కోస౦ జీవి౦చేవారు. మోషే ధర్మశాస్త్రాన్ని అఅధిగమించిన మతనియమాలలో ఆయన సంప్రదాయం ఒకటి. ఈ నిబంధనలు అంగీకారమును పాటించడాన్ని ధిక్కరించాయి. ఆయన నెపధ్యములో కృపకు ఎలాంటి అవకాశము లేదు. ఇది ఒక కర్మల మరియు పూర్వీకుల సంప్రదాయం ఆధారంగా పనిచేసే మనస్తత్వము. ఆయన గత విద్య, దురభిమానాలు అన్నీ కూడా కృపకు వ్యతిరేకమైన విరుద్దాలు.

విశేషాసక్తి గల వాడనై

క్రైస్తవమతనిర్మూలనకు తన నిబద్ధతలో పౌలు తన తోటివారి కన్నా ఎ౦తో శ్రేష్ఠ౦గా ఉ౦డేవాడని స్పష్టమవుతో౦ది. ఆయన ధర్మశాస్త్రవాదనకు కట్టుబడిఉన్నాడు. తన కోసం తీవ్రమయిన ఉద్రేకంతో ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. పౌలు ఇలా చెబుతున్నాడు: “నేను సంఘమును ఎ౦తో ఉద్రేకపరుడనై వృత్తిపర౦గా హి౦సి౦చేవాడను. అలా చేయడ౦లో నేను నా మత౦లో గొప్పవాణ్ణి.” ఈ బీబత్సకరమైన సంధర్భములోకూడా, కృపాసువార్తలోని అతీంద్రియ శక్తి ఆయనను రక్షకుని దగ్గరకు తీసుకువచ్చి౦ది.

నా సమానవయస్కులైన అనేకులకంటె

ఇశ్రాయేలులోని ఇతర నాయకులను పౌలు అధిగమి౦చాడు. జుడాయిజంలో ఆయన అద్భుతమైన పదవిని కలిగి ఉన్నాడు. ఆయన తన సమకాలీనులను యూదా మతానికి కొత్త ప్రా౦తాల్లో మార్గధర్శకుడుగా సేవచేశాడు. ఆయన చాలా విజయ౦ సాధి౦చిన పరిసయ్యుడు. పౌలు సంఘమును హి౦సి౦చడ౦లో సంచలనాత్మకమైన వాడుగా ఉన్నడు. ఆయన తన మత౦తో క్రూర౦గా, రక్తధాహముతో ఉ౦డడ౦తో, క్రైస్తవ్యము పట్ల వ్యతిరేకత విషయములొ  అప్రతిష్టపొ౦దినవాడు. మతం లో క్రూరత్వం అనే సంప్రదాయం ఉంది.

” ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని. ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారిని కూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని ” (అపొ. 22:4-5).

” నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;౹ 10యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;౹ 11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని. ” (అపో. 26:9-11).

యూదుల మతములో ఆధిక్యతనొందితినని

పౌలు క్రైస్తవుడు కావడానికి ము౦దు ఆయన “ఆధిక్యతనొంది” ఎ౦తో మ౦చి భక్తి కలిగివు౦డేవాడు. “ఆధిక్యత” అనే పదానికి అర్థం ముందుకు సాగడానికి అని అర్ధం. సైన్యం వేగంగా ముందుకు సాగడానికి వీలుగా అడవి గుండా ఒక కొత్త బాటను ముందుకు వేసిన పయినీర్ చెక్కకట్టర్లను సూచించడానికి లౌకిక గ్రీకు ఈ పదాన్ని ఉపయోగించింది.

ఇక్కడ ఆలోచన ఏమిటంటే, పౌలు తన మతాన్ని ముందుకు సాగించడానికి వ్యవస్థలను ఆవిష్కరించాడు. పరిసయుడైన పౌలు క్రైస్తవత్వ౦ అనే ఈ క్రొత్త మార్గముతో వ్యవహరి౦చడ౦లో పురోగతి పొందాడు.

“వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.” (అపొ. 26: 5).

సూత్రం:

కొందరు మతాన్ని స్వీయ ప్రగతికి వేదికగా ఉపయోగిస్తారు.

అనువర్తనం:

చాలామంది తమ తోటివారి మధ్య ఒక హోదా సంపాదించడానికి మతాన్ని ఉపయోగిస్తారు. ప్రజలను ఆకట్టుకోవాలన్నదే వారి ప్రధాన లక్ష్యం. ఇతరులు తమను గమనించాలని కోరుకుంటారు. స్వీయ ప్రచారం వల్ల ఒక విధమైన శత్రుభావం ఏర్పడుతుంది.

మతానికి క్రూరత్వం యొక్క చరిత్ర ఉంది. మత చరిత్ర లో అసహనం, దురభిమానం నిండి ఉన్నాయి. మన౦ ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉ౦టే మనము ఆ పద్దతి నుండి తిరగాలి.

Share