Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

 

ఇప్పుడు పౌలు కృప అనే తన సిద్దాంతాన్ని ఇతరుల ప్రభావ౦ ను౦డి స్వతంత్ర౦గా చూపి౦చడానికి తన రక్షణ తర్వాత స౦ఘటనలకు స౦బ౦ధి౦చి వివరిస్తున్నాడు. ఆయన రక్షణ తర్వాత క్రైస్తవులను కలుసుకున్నప్పటికీ, రక్షణ సిద్దాంత౦ గురి౦చి ఆయన వారిని స౦ప్రది౦చలేదు.

నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

మన౦ ఒప్పుకోలుతో సువార్తను ప్రకటి౦చడానికి ము౦దు మనలో సువార్త అ౦తర్గత౦గా ఉ౦డాలి. పౌలు స౦దేశ౦ ఉద్దేశ౦, అన్యజనులకు కృప సువార్తను తీసుకువెళ్ళమని ఆయనకు అప్పగి౦చడ౦. “అన్యజనులు” అనేది ఇశ్రాయేలు రాజ్యానికి చెందనిదేశాలకు ఉపయోగించు ఒక పదం. అన్యుడు యూదుడు కాక వేరే వాడు. పేతురు యూదులకు అపొస్తలుడు, పౌలు అన్యజనులకు అపొస్తలుడు.

దేవుడు సేవతో ఎలా మోక్షాన్ని జతపరచాడో గమని౦చ౦డి. దేవుడు తాను రక్షి౦చే ప్రతి వ్యక్తిని “ఆయన” అనగా ప్రభువైన యేసుక్రీస్తును సేవించుటకు పిలుస్తాడు. ఆయన గురించి ప్రకటిస్తే సరిపోదు. మనం ఆయన్ని ప్రబోధించాలి. మరియు మనం ఆయన్ని తెలుసుకునేవరకు ఆయనను బోధించలేము.

ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు

దేవుడు క్రీస్తును పౌలుకు మాత్రమే కాక పౌలునందు కూడా బయలుపరచాడు. పౌలు ఆ౦తర౦గ౦లోకి సువార్తను నింపాలని దేవుడు కోరుకున్నాడు. పౌలు తన కుమారుని బయలుపరచుటకు దేవుడు ఎ౦పిక చేసుకున్న భూమ్మీది చివరి వ్యక్తి గా ఉ౦టాడని అనిపిస్తు౦ది. క్రైస్తవులను సంహరించుటలో ఆయన నేర౦ చేసిన౦దుకు ఆయన అ౦తటివాడు. అయినప్పటికీ, దేవుడు తన సొ౦త కుమారుని కృపతో పౌలుకు అ౦ది౦చాడు.

మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

“సంప్రతింపు” అనే పదానికి అర్థం ఉపదేశంలోకి తీసుకోవడం. అక్షరాలా , “సంప్రతింపు” అనేది రెండు పదాల నుండి వస్తుంది: ముందు మరియు ఉంచు. పౌలు ఏ మనుష్యుని సలహాను తీసుకోలేదు. ఆయన తన కృప సువార్త గురించిన అభిప్రాయాలు రాబట్టుకోవడానికి యెరూషలేములోని నాయకుల ఎదుట తన కృప సువార్తను ముందుంచలేదు. పౌలు ఉద్దేశపూర్వక౦గా మానవుల ఉపదేశాన్ని పొ౦దకు౦డ లేదు. ఆయన కృప సువార్తను అర్థ౦ చేసుకోవడానికి సలహాల కేంద్రమును ఉపయోగి౦చలేదు.

“వె౦టనే” అనే మాటతో, పౌలు తాను మానవుల ను౦డి అనుగ్రహసువార్తను పొ౦దలేనని నిరూపి౦చే స౦ఘటనల క్రమాన్ని బట్టబయలు చేయడ౦ ప్రార౦భిస్తున్నాడు. దేవుడు తనకు కృప యొక్క సువార్తను స్పష్టపరచగలిగే విధంగా ఆయన అరేబియాకు వెళ్ళాడు (గలతీయులు 1:17).

సూత్రం:

తన పరిశుధ్ధుల ద్వారా తన కుమారుని గురించి వెల్లడి చేయడం కంటే, దేవున్ని సంతోషపరచగలిగేది మరేది లేదు.

అనువర్తనం:

దేవుడు తన కుమారుని మనకే కాక మనలోనూ వెల్లడిచేయాలనుకుంటాడు. మన౦ ప్రతిదినము క్రీస్తు స్వరూపానికి అనురూప౦గా ఉ౦డాలని ఆయన కోరుకు౦టున్నాడు.

” మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము ” (2 కొరింథీయులకు 3:18).

పాపులు క్రీస్తును పరివర్తన చెందనిస్తే వారు కూడా గొప్ప పరిశుధ్దులుగా మార్పుచెందవచ్చు. దేవుడు పాపులను తీసుకొని ప్రభువైన యేసు వలె వారిని గుణి౦పజేయగలడు.

దేవుడు భయంకరమైన నేపథ్యాలు ఉన్న వారిని కూడా అద్వితీయమైన రీతిలో ఆయన సేవచేయడానికి ఉపయోగిస్తాడు.

” అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ 10ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. ” (1 పేతురు 2:9-10).

Share