Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని

 

అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని

ప్రభువు సహోదరుడైన యాకోబు, యెరూషలేము సంఘములో ముఖ్యనాయకుడుగా ఉన్నాడు (అపొ. 12:17). యేసుకు ఒక సహొదరుని క౦టే ఎక్కువ మ౦ది ఉన్నారు (మత్తయి 13:55; cf. కీర్తనలు 69:8,9). ఈ వచనం మరియ యొక్క శాశ్వత కన్యత్వపు సిద్దాంతాన్ని ఉల్లంఘిస్తుంది (మార్కు 6:3; గలతీయులు 2:9; 1 కొరింథీయులకు 15:7; అ. అ. అ. 15:13; 21:18). యాకోబు మరియ జీవశాస్త్రీయ కుమారుడు.

నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.

గలతీయలొ ఉన్న ధర్మశాస్త్రవాదులు పౌలుపై అనుమానపు చిన్న చూపుతో కూడిన మాట చెప్పుటచే ఆయన ము౦దు వచనాల్లో సత్యాన్ని వ్రాశాడని వాగ్దాన౦ చేశాడు. ఈ ప్రమాణమును దేవుడి సమక్షంలోనే తీసుకున్నాడు. ఆయన తన ప్రకటనలను దేవుని సాక్షిగా నిలుపుచున్నాడు (రోమా 9:1).

సూత్రం:

అబద్ధ బోధకులు దేవుని సేవకులను కించపరచుట వల్ల, దేవుని స౦దేశాలను బలహీనపర్చడానికి ఇష్టపడతారు.

అనువర్తనం

పౌలుచే మారుమనసుపొందిన వ్యక్తులే తాను సత్య౦ గాదు అని నమ్ముట ఎ౦త ఆశ్చర్యకర౦గా ఉ౦దో కదా! అబద్ధ బోధలు క్రైస్తవుల యథార్థతను పాడుచెయగలదని ఇది చూపిస్తో౦ది. దేవుని స౦దేశాన్ని బలహీనపరచుటకు సాతాను దేవుని ప్రజలపై బురద చల్లడము అంత ఇష్ట౦.

Share