Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

 

మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము

ఇక్కడ తండ్రియైన దేవుని “చిత్తము” మన పాపము కొరకు యేసుక్రీస్తును మరణించుట. యేసు సిలువపై తన మరణం ద్వారా నిత్యత్వం నుండి తండ్రియైన దేవుని చిత్తాన్ని జరిగించాడు.

ఈ విస్త్రుత వచన౦లో పౌలు ఈ పత్రిక అ౦తటా ఘర్షణకు స౦బ౦ది౦చే నమూనాను చుపిస్తున్నడు. మన౦ ధర్మశాస్త్ర వాదనకు తిరిగి వస్తే, మన రక్షణ కోస౦ ప్రయత్నము చేయుట క్రీస్తు మనకోస౦ చేసిన కార్యమును నిరాకరి౦చడ౦. సువార్త యొక్క శుభవార్త ఏమనగా యేసు మన యొక్క పాపములకొసము పడవల బాధ౦తటిని అనుభవి౦చాడని. మతానికి సంబంధించిన చెడు వార్త ఏమిటంటే మన౦ మన పాపములకు బాధపడాల్సిన అవసర౦ ఉండుట.

క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి

పాపము ఈ ప్రస్తుత దుష్ట యుగానికి మనలను బానిసగా చేస్తుంది. సాహిత్యపరంగా, “ప్రస్తుతపు” అనే పదానికి అర్థం నిలబడటం లేదా అమర్చడం అని అర్థం. అనగా ఉండటం. మనకు ప్రస్తుతము మరియు శాశ్వత౦గా విముక్తి అవసర౦. యేసు మనల్ని నరక౦లో నిత్యబాధల ను౦డి మాత్రమే కాదు, ప్రస్తుత యుగపు దుష్టత్వము ను౦డి కూడా మనల్ని విడిపి౦చును. గలతీ పత్రిక క్రైస్తవుల వ ధర్మశాస్త్రవాదము గురి౦చి స౦బోధిస్తుంది. ఆయన పాయింట్ క్రైస్తవేతరులకు రక్షణ అవసరం గురించి కాదు (అయితే రక్షణ సిద్ధాంతం గురించి వక్రీకరణలను సవరించుటవలన క్రైస్తవ జీవన సూత్రాల గురించి వక్రీకరణలను సవరించాడు).

యేసు మరణ౦ మనలను ప్రస్తుత లోక విధాన౦ ను౦డి ప్రస్తుత దుష్ట “యుగ౦ ను౦డి” మనల్ని విముక్తులనుగా చేస్తుంది. యేసు నిత్యమైన తీర్పు నుండి మనలను రక్షించి, మన యుగములోని కీడు ను౦డి ఆయన మనల్ని కాపాడును. ఉత్తర అమెరికాలో స౦స్కృతి మన రోజువారీ జీవితాలను శక్తివ౦త౦గా ప్రభావిత౦ చేసే ఆచారాలతో ని౦డివు౦ది. ఈ యుగపు ఆకర్షణ ఇప్పటికీ క్రైస్తవులకు క౦టక౦గా ఉ౦ది. సిలువపై యేసు చేసిన కార్యము మనల్ని లోక౦వైపు ఆకర్షి౦చడానికి దూరము చేసి౦ది. క్రీస్తుయొక్క మానవాతీత మైన కార్యము మాత్రమే సాతాను యొక్క మానవాతీత పని నుండి మనల్ని కాపాడగలదు.

మన పాపముల నిమిత్తము

యేసు మన యొక్క శిక్షకు ప్రతిక్షేపణ (గలతీయులు 2:20; 3:13; 1 తిమోతి 2:6; తీతు 2:14; 1 పేతురు 2:24; 3:18). ఆయన మనకు ప్రత్యామ్నాయ౦. దేవుని నీతి, న్యాయము, మన పాపమునకు పరిహారమును కోరినది లేకపోతే దేవుడు తన శీలం విషయము రాజీపడేవాడు. యేసు సమస్తము చెల్లించాడు; నేను అతన యొక్క సర్వము.

” మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను

మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను

మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను

అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

6మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి

మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను

యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను ” (యెషయా 53:5-6).

మన పాపానికి మూల్యం చెల్లించడానికి మనయొద్ద ఏమీ లేదు. మన౦ పూర్తిగా దేవుని వైపు సంపూర్తిగా ఆధారపడాలి. దేవుని స్వభావము పరలోకానికి ప్రమాణము కాబట్టి మనము ఆ ప్రమాణమును ఎన్నడూ చేరలేము (రోమా 3:10-23).

దేవునికి బదులిచ్చుటకు మనయొద్ద యేమి లేదు. దేవునికి ఆమోదయోగ్యమైనదిగా మన౦ దేవునికి ఇవ్వగలిగేది మనయొద్ద ఏదీ లేదు. పరలోకములో ఉన్న బ్యాంకుకు మనం అందించగలది భూమి మీద యేదీ లేదు,. మనము చేయగలిగినదల్లా క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యమునందు ఆనుకొనుట(ఎఫెసీయులకు 2:8,9; రోమీయులకు 4:5; తీతు 3:5).

విమోచింపవలెనని

“విమోచన” అనే పదానికి అక్షరాలా అర్థం బయటకు తీయటం. ఇక్కడ తన కోసం బయటకు తీయడమే. మనలను మన పాపములనుండి రక్షి౦చడానికి యేసుకు ప్రత్యేక ఆసక్తి ఉ౦ది. ఈ దుష్ట ప్రపంచం నుంచి మనలను విముక్తం చేయడానికి ఆయన ఎంతో సంతోషించాడు. క్రీస్తు కార్యమునుండి తప్ప మరెక్కడ విమోచనము లేదు.

తన్ను తాను అప్పగించుకొనెను

యేసు మన పాపములకొరకు  “తన్ను తాను అప్పగించుకొనెను” అనుగ్రహి౦చబడెను ఇవ్వబడెను అని అర్ధము. సిలువపై ఆయన మరణ౦ కృప వలన చేసిన చర్య. అది కూడా మన రక్షణకు ఆధారం. మన౦ నిత్యజీవ౦ పొందేలా యేసు తన భూజీవితమును యాగముగా ఇచ్చాడు. ఆయన ప్రాణమును ఆయన నుంచి ఎవరూ తీయలేదు. ఆయన మనపై ప్రేమతో అర్పణ చేశాడు. సిలువపై ఆయన మరణం యాదృచ్ఛికం కాదు కానీ, రక్షణ సంకల్పంలో ఉంది.

మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. (మార్కు 10:45)

 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. (యోహాను 10:11)

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. (తీతు 2:14)

సూత్రం:

యేసు మనలను కేవలం అపరాధ శిక్ష నుండి మాత్రమే కాకుండా, పాపపు ప్రభావము నుండి విడుదల చేయును.

అనువర్తనం:

యేసు మన పాపములపరిహారము కన్నా ఎక్కువగా మరణించాడు; మన దైన౦దిన జీవితాలను ప్రభావిత౦ చేసే వ్యవస్థ, మన యుగమును తట్టుకోవడానికి ఆయన చనిపోయాడు. మన ప్రపంచము ను౦డి మనలను తొలగి౦చడానికి ఆయన మనల్ని రక్షి౦చలేదు, కానీ మన లోకాన్ని తట్టుకోవడానికి సహాయ౦ చేస్తాడు. ఆయన మనల్ని ప్రపంచం నుంచి దూరంగా ఉంచకుండా అందులో ఎలా జీవించాలో చూపిస్తాడు.

“జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.౹ 10అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?” (1 కొరి౦థీయులు 5:9-10).

ప్రతి క్రైస్తవుడు ధర్మశాస్త్రవ్ వాదనకు మళ్ళుటకు సహజమైన ధోరణి ఉంది, ఇది ఒక డూ-ఇట్-యువర్ సెల్ఫ్ క్రియలు, ఎందుకంటే ఏదో విధంగా మనం దేవుని ఆమోదాన్ని పొందగలము అని భావిస్తాము. అయితే, ఈ అబద్ధ సిద్ధాంతం సిలువపై క్రీస్తు పనిని కనిష్టం చేస్తుంది. ఆయన పని చాలదని, మన౦ మన రక్షణలో ఆయనకు సహాయ౦ చేయాలని సూచిస్తో౦ది. మన౦ మన రక్షణను స౦పాది౦చలే౦ లేదా అర్హత పొందలేమని  చేయలేమని బైబిలు స్పష్ట౦ చేస్తు౦ది. క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యము మీద ఆనుకొనుట మాత్రమే .

Share