దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
మహిమ కలుగును గాక
“మహిమ” అనే పదం ప్రధానంగా ఒక అభిప్రాయం, అంచనా లేదా కీర్తిని సూచిస్తుంది. కొత్త నిబంధన ఎల్లప్పుడూ ఈ పదాన్ని గౌరవ, శ్రేష్ఠత మరియు గొప్పతనానికి సంబంధించిన మంచి అర్థంలో ఉపయోగిస్తుంది. క్రీస్తునందు ఆయన చేసిన కార్యమును గూర్చి మంచి అంచనా కలిగి యున్నాము గనుక మనము దేవుని ఘనపరచుచున్నాము (1:4; యోహాను 1:14; 2:11; 11:4,40; 17:5, 24; రోమీయు6:4; ఎఫెసీయులు 1:6,12,14; హెబ్రీ 1:3).
గ్రీకులో “మహిమ” అనే పదానికి ముందు “ది” (ఆంగ్లము లొ) అనే నిర్దిష్ట మైన పదము ఉంది. విశ్వాసము ద్వారా కృప చేతనైన రక్షణను బట్టి మహిమ దేవునిదే కాని మనది కాదు. ఈ మహిమ ఆయన ప్రత్యేకత.
” మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ” (ఎఫెస్సీయులకు 3:20-21).
సూత్రం:
యేసుక్రీస్తు విశ్వానికి నిజమైన ప్రముఖుడు, ఎ౦దుక౦టే ఆయన చేసిన పని ఇతరుల౦దరి ను౦డి మన గౌరవాన్ని కోరుకు౦టు౦ది.
అనువర్తనం:
క్రీస్తు మహిమ మన కన్నులను ఆకట్టుకోవాలి. ఆయన నిజంగా ఒక ప్రసిద్ధ వ్యక్తి. మన రక్షణను బట్టి ఆయన అర్హుడు. గౌరవమంతా ఆయనకే. ఆయన వ్యక్తిత్వంలోనూ, పనిలోనూ గొప్ప మహిమ, శోభ ఉంది. క్రైస్తవ మనస్సుకు, యేసు అద్భుతమైన గొప్పస్థితిలో ఉన్నాడు.