అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
అది మరియొక సువార్త కాదుగాని
“ మరియొక” అనే పదం అదే రకమైన మరొక దాన్ని సూచిస్తుంది. ప్రజలు సువార్త సారాన్ని మార్చితే అది ఏ మాత్రం సువార్త కాదు. పౌలు ప్రకటి౦చిన సువార్త వంటిది కాదు కాని అది వక్రీపరింపబడిన సత్యమైన సువార్త. వారు సువార్తను సవరించినప్పుడు, అది అసలు సువార్తయే కాదు.
క్రీస్తు సువార్తను చెరుపగోరి
” చెరుపగోరి” అనే ఆలోచన, దేనినైనా వ్యతిరేక పాత్రగా మార్చడ౦. జూడైజర్లు సువార్తను దాని నిజస్వభావానికి వ్యతిరేకమైన దానికి రూపాంతర౦ చేశారు. ఆ విధ౦గా వారు సువార్తను వక్రీకరించారు. వారు దాని అసలు రూపకల్పనకు పూర్తి విరుద్ధంగా దానిని తిప్పారు. వారు దాని సారాంశాన్ని కృప అనే ఒక సిద్దాంతం నుండి కర్మ సిద్ధాంతానికి మార్చారు. సువార్త లేకుండుట కన్నా వక్రీకరించిన సువార్త చాలా ప్రమాదకరమైనది.
సువార్త క్రీస్తు సువార్త, పౌలు సువార్త కాదు. ప్రజలు సువార్తను వక్రీకరించినప్పుడు, వారు క్రీస్తును అతిక్రమిస్తారు.
మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
ధర్మశాస్త్రవాదులు తమ తప్పుడు సిద్దాంతంతో గలతీయులను “కలవర” పరిచారు (అ.కా.15:24; గలతీయులు 1:7; 5:10). ధర్మశాస్త్రవాదము ఎల్లప్పుడూ ఆత్మను అస్థిరం చేసి, సంఘాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తుంది (5:10-12). “కలవరపరచుట” అనగా ఆలోచనను ముందుకీ వెనక్కూ కదిలించుట. ధర్మశాస్త్రవాదులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
సూత్రం:
క్రీస్తు సువార్తకు ప్రత్యామ్నాయం లేదు.
అనువర్తనం:
భిన్నమైన సువార్త సువార్తయే కాదు, క్రీస్తు సువార్తకు ప్రత్యామ్నాయం లేదు. క్రీస్తు సువార్త మరి ఏ ఇతర సువార్త కంటె ప్రత్యేకమైనది. క్రీస్తు సిలువపై సంపూర్ణమైన కార్యమును పాపమునకు పరిహరము చెల్లించడానికి సరిపోదని బొధించు ఏ సువార్త ఐనా, అది అబద్ధ సువార్త. కర్మల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా కృప వలన రక్షణ ఎప్పుడూ కలుగుతుంది.
మనం సువార్తను కొత్త నిబంధన సువార్తకాకుండా వేరే దానిలోకి వక్రీకరించగల దినములలో జీవిస్తున్నాము మరియు ఎవరూ కన్ను మినుకుమినుకు అనుటలేదు. “మనలాగే నమ్మని వ్యక్తుల పట్ల మనం సహనంగా ఉండాలి” అని కొందరు అంటారు. “యథార్థవ౦తులుగా” ఉన్న౦తకాల౦,నిజమైన విశ్వాసులుతో నకిలీలు మ౦చి స౦బ౦బ౦దాలతో నిలబడతారు. క్రైస్తవ్యము 50% విశ్వాసం మరియు 50% క్రియలు కాదు. లేదు, నిజమైన సువార్త, క్రియలను రక్షణకు లేదా పరిశుద్ధతకు ఒక మార్గంగా నిర్బ౦దిస్తో౦ది.
” ట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?” (హెబ్రీ 10:29).
నేడు క్రైస్తవులు నిజమైన సువార్తను వక్రీకరి౦చేవారితో వ్యవహరి౦చాల్సిన అవసర౦ ఉ౦ది. సహనం అంటే మనం ఎవరికీ తీర్పు చెప్పం. సత్యము మన౦ సువార్తను వక్రీకరించువారిని తీర్పు తీర్చమని కోరుకు౦టు౦ది. కర్మల ద్వారా రక్షణ అనేది శుభవార్త కాదు. అది చెడు వార్త, ఎందుకంటే రక్షణ మనమీద ఆధారపడవలసి ఉన్నది, క్రీస్తు మీద కాదు.