Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద మేఘధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను. యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగాఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనిఇక ఆలస్యముండదు గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను

 

ఏడు బూర తీర్పులు ఏడవ ముద్ర తీర్పులో భాగం . మనము ఆరు బూర తీర్పులను అధ్యయనం చేసాము.

ఆరవ మరియు ఏడవ బూర తీర్పుల మధ్య ఈ అంతరాయం ఆరవ మరియు ఏడవ ముద్రల మరియు పాత్ర తీర్పుల మధ్య అంతరాయానికు సమాంతరంగా ఉంటుంది . ఏడవ అధ్యాయం ఆరు మరియు ఏడవ ముద్రల మధ్య ( 144,000 మరియు అమరవీరుల )  పరిచయాన్నిప్రస్తావనలోకి తెచ్చినట్లు , 10 మరియు 11: 1-14 అధ్యాయాలు ఆరవ మరియు ఏడవ బూరలు మధ్య రెండు వ్యత్యాసాలను పరిచయం చేస్తాయి. ఈ విరామం క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పాలనను ప్రకటించడం ద్వారా విశ్వాసులను ధైర్యపరచింది (11:15). ఈ అంతరాయం ఏడవ బూర కోసం మనల్ని సిద్ధం చేస్తుంది .

ఈ ప్రస్తావనలో, క్రీస్తు రెండవ రాకడకు రెండు విడతలుగా అగ్రగాములున్నారు: 1) బలిష్ఠుడైన దూత మరియు 2) ఇద్దరు సాక్షులు. ఈ రెండు విడతల అగ్రగాములు ( ఒక దూత మరియు ఇద్దరు మానవులు ) క్రీస్తు రాజ్యం యొక్క రెండు విడతల సందేశవాహకులు. బైబిల్లో, రాజు ముందు ఎల్లప్పుడూ అతని సందేశవాహకులు ఉంటారు. యేసు మొదటి రాకకు బాప్తీస్మమిచ్చు యోహాను ఆయనకు సందేశవాహకుడు.

10: 1

బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను

బూరలు ఊదిన ఏడు దూతలకు భిన్నంగా ఉన్న మరొక దూతను యోహాను పరిచయం చేస్తున్నాడు. గ్రీకు భాషలో ఈ దూత ఏడు బూరలు ఊదిన దూతలవంటివాడని సూచించినప్పటికీ, ఈ దూతకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ఒక ” మేఘమును ” ధరించుట అతను క్రీస్తు రాకడను ప్రకటించే రెండవ రాకడ సమాచారవాహకుడని సూచించవచ్చు

ఆయన శిరస్సుమీద మేఘధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

“ఇంద్రధనస్సు” అనేది దేవుడు మాట తప్పనివాడు అని గుర్తుచేస్తుంది (ఆదికాండము 9: 12-17). ప్రపంచాన్ని మరలా నీటితో నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పటికీ తన మాటకు వ్యతిరేకించడు. ఆయన ఎప్పుడూ వాగ్దానం తప్పడు . దేవుడు అస్తిరుడు కాదు.  ఆయన స్వయంగా సత్యస్వరూపి.

ఈ దూత ముఖం దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది మరియు దేవుని తీర్పును అమలు చేయడానికి అతను వచ్చాడని అని అతని పాదాలు సూచిస్తున్నాయి .

10: 2

ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను.

దేవుని గొర్రెపిల్ల ఏడు ముద్రల గ్రంథాన్నితెరిచాడు (5: 1) కానీ దూత ఒక చిన్న పుస్తకమును కలిగి ఉన్నాడు. ఈ పుస్తకము అతని రాబోయే లక్ష్యాన్ని కలిగి ఉంది .  ప్రపంచం యొక్క యాజమాన్య పత్రం యేసు కలిగి ఉన్నాడని ప్రకటించడం అతని లక్ష్యం. దేవుడు సాతాను నుండి ప్రపంచాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నాడు. యేసు వచ్చినప్పుడు, ఆయన సరైన యజమాని అని నిరూపించడానికి తన యాజమాన్య పత్రం తెస్తాడు.

ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

దూత తన కుడి పాదం సముద్రం మీద మరియు ఎడమ పాదం భూమిపై మోపడం భూమిపై తన అధికారం యొక్క హక్కును సూచిస్తుంది . దేవుడు తనవైనవాటిని తిరిగి తీసుకోబోతున్నాడు (కీర్తన 2: 6-8). ఈ దూత ప్రపంచంపై క్రీస్తు హక్కును ప్రకటిస్తున్నాడు.

నియమము :

దేవుడు ప్రపంచాన్ని తిరిగి పొందుతాడు.

అన్వయము:

ప్రస్తుత సమయంలో, క్రైస్తవులు దెయ్యపు ప్రపంచంలో నివసిస్తున్నారు , కాని మనం వ్యక్తిగతంగా ప్రభువైన యేసుకు చెందినవాళ్ళం. మనము ఆయన ప్రణాళికలోని భాగం. ప్రవచనాన్ని తెలుసుకోవడం ద్వారా మనము ఆ ప్రణాళికను అనువర్తించగలము. మనము ఇలా చేస్తే, దేవుడు మనలను భూమిపై ఉంచిన ఒక ఉద్దేశ్యాన్ని మనము నెరవేరుస్తాము.

ప్రపంచం కోసం దేవుని ప్రవచనాత్మక ప్రణాళికపై ఆధారపడిన విశ్వాసులను చూడటం కంటే దెయ్యం యొక్క ఘనతకు వేదింపు మరేమీ లేదు. ఈ వ్యక్తులు వాడికి పిచ్చెక్కిస్తారు. పడిపోయిన దూత, దెయ్యం – వాడు వెంటబడేటంతగా వీరు వాడిని చికాకుపెడతారు. ఈ దెయ్యాలు నిరంతరం విశ్వాసులకు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరిస్తారు. దెయ్యం ఈ జాబితాను దేవుని ముందు తెస్తుంది మరియు వారు చేసిన పనికి విశ్వాసులను నిందిస్తుంది. విశ్వాసులు చేసిన భయంకరమైన పనులను ఆయనకు ఎత్తి చూపుతుంది. అప్పుడు దేవుడు విశ్వాసుల రక్షణ న్యాయవాది, ప్రభువైన యేసును వారి పక్షమున నిలవడానికి పిలుస్తాడు. క్రీస్తు రక్తం ఆధారంగా, న్యాయమూర్తి ( తండ్రి ) ఈ వ్యాజ్యమును న్యాయస్థానమునుండి కొట్టివేస్తాడు.

దెయ్యం ప్రధానంగా అనైతిక వ్యాపారంలో లేదు. వాడు మతం యొక్క వ్యాపారంలో ఉన్నాడు. వాడు మాధుర్యం మరియు నకిలీ కాంతిని ప్రేమిస్తాడు. ప్రతి వ్యక్తిలో స్వీయ మరియు సాతాను ద్వారా ఉత్పత్తి చేయబడిన ” దైవ కాంతి” అని పిలవబడే దానిపై ప్రజలు దృష్టి పెట్టాలని వాడు కోరుకుంటాడు. వాడు దేవుని నుండి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. వాడు దీనిని “పరిపూర్ణ రాజ్యం” గా మార్చాలని కోరుకుంటాడు, కాని ప్రజల పాప సామర్థ్యం కారణంగా, వాని రాజ్యం విఫలమవుతూనే ఉంటుంది. ఇప్పుడు సాతాను విధి క్రీస్తు రాకతో మూసివేయబడింది.

Share