Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము పట్టణములో కనబడెననెను

 

18 వ అధ్యాయం యొక్క సంఘటనలు శ్రమలకాలపు చివరిలో జరుగుతాయి. మనము ఇప్పుడు సృష్టిలో దేవుని విజయం వద్దకు వచ్చాము .

18:20

పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు

బబులోనీయ అంతర్జాతీయ వ్యవస్థ పతనం గురించి సంతోషించమని దేవుడు పరలోకానికి ఆజ్ఞాపించాడు. ఇందులో ఆనందం ఉంది ఎందుకంటే ఈ వ్యవస్థ పరస్పర భిన్నమైన సత్యం పట్ల అసహనం వ్యక్తపరచే దుష్ట వ్యవస్థ (అపొస్తలుల కార్యములు 4:12). దేవుడు చివరికి తన ప్రజల పక్షముగా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది పగ కాదు, దేవుడు న్యాయం చేస్తాడనే కోరిక. దుఃఖించే మరియు విలపించే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు సంతోషించే పరిశుద్ధుల మధ్య వ్యత్యాసాన్ని గమనించండి.

18:21

తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.

బబులోనీయ వ్యవస్థ యొక్క నాశనాన్ని వివరించడానికి ఒక శక్తివంతమైన దేవదూత ఒక భారీ రాయిని తీసుకొని సముద్రంలోకి విసిరాడు. బబులోను యొక్క నాశనం పూర్తయింది , ఈ వ్యవస్థ యొక్క సూచనను ఇకపై ఎవ్వరూ ఎప్పటికీ కనుగొనలేరు. ఇది సముద్రపు అడుగుభాగానికి ఒక తిరుగటి రాయిలాగా మునిగిపోతుంది (యిర్మీయా 51: 61-64).

” ఇక ఎన్నటికిని కనబడకపోవును ” అనే పదం ఏడుసార్లు చిన్న తేడాలతో ప్రకటనలో సంభవిస్తుంది. ఇది బబులోనీయ వాదం యొక్క ఓటమి యొక్క అంతిమతను సూచిస్తుంది .

18:22

కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి శిల్పమైనచేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు.

సంగీతకారులకు ప్రసిద్ధియైన బబులోను ఇకపై ఎన్నటికీ సంగీతాన్ని వినదు. వినోదం పరిశ్రమ ఇకపై ఎన్నటికీ జనులను సమకూర్చదు. హస్తకళాకారులు తమ వాణిజ్యాన్ని ఇకపై అమలు చేయరు.

వినోద పరిశ్రమ యొక్క , నైపుణ్యం కలిగిన కార్మికుల యొక్క  మరియు చివరకు ధాన్యపు పిండి మిల్లుల యొక్క నాశనంలో బబులోను పతనం యొక్క విస్తృతి మరియు పరిపూర్ణతను మనం చూడవచ్చు .

18:23

దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.

మెరుస్తున్న దీపాలు బబులోనీయ వ్యవస్థలో ఇకపై ప్రకాశించవు. ప్రజలు వివాహాలను జరుపుకోరు (మత్తయి 24:38).

నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి.

బబులోను పై తీర్పు యొక్క కారణాలు  ఏమిటంటే 1) జనములను మాయమంత్రముల చేత మోసం చేసింది మరియు 2) పరిశుద్ధులను హతమార్చింది (వ. 24). శ్రమలకాలములో, వ్యాపారవేత్తలు “భూమి పై గొప్ప వ్యక్తులు”. సంపద నేడు చాలా మందిని ఆకట్టుకుంది. అందుకే వారు ప్రపంచంలో ఇటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటారు.

“మాయమంత్రము” కు గ్రీకు పదం ఫార్మకేయా , దీని నుండి మనకు “ఫార్మసీ” అనే ఆంగ్ల పదం లభిస్తుంది. వ్యాపారవేత్తలు ” మాయమంత్రము ” ద్వారా చాలా మంది ప్రజలను మోసం చేశారు. మొదటి శతాబ్దంలో ప్రజలు ఇతరులను మోసం చేయడానికి మాదకద్రవ్యాలు ఉపయోగించారు. ఈ వ్యాపారవేత్తలు స్పష్టంగా దెయ్యం మరియు క్షుద్రంతో సంబంధం కలిగియుంటారు.

18:24

మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము పట్టణములో కనబడెననెను.

అధికారం దాహంతో బబులోను ప్రవక్తలను మరియు పరిశుద్ధులను హతమార్చింది (18:24). ఇది అంతర్జాతీయ ప్రభుత్వం మరియు మతం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుపుతుంది . మతం చేత చంపబడిన పదుల వేల మందిని చరిత్ర నమోదు చేసింది. మతం ఒక నకిలీ సువార్త. దేవుడు చివరికి నకిలీని బహిర్గతం చేసి దానిని నాశనం చేస్తాడు.

నియమము :

దేవుడు చివరికి అన్ని తప్పుడు విలువలపై విజయం సాధిస్తాడు.

అన్వయము:

బబులోనీయ వ్యవస్థను నాశనం చేయడం అన్యజనుల కాలానికి చివరి దెబ్బ (లూకా 21:24). ఇది సరియైన సమయంలో దేవుని విజయం. బబులోనీయ వ్యవస్థ ఒక భౌతిక వ్యవస్థతో కలిపిన ఒక మత వ్యవస్థ.

నేడు చాలామంది సంపదను ఆరాధిస్తారు. సంపద వారి మహాగ్ర విలువ. వారు వేరే విషయాలకు ఇంత ఎక్కువ విలువ ఇవ్వరు. డబ్బు వారి దేవుడు. మతం / సంపద నమ్మక వ్యవస్థతో కలవడానికి మీకు సానుకూలత ఉందా?

దేవుడు చివరికి విషయాల సత్యాన్ని కాలములో మరియు ప్రదేశంలో సరైన స్థలంలోకి పునరుద్ధరించి తీసుకువస్తాడు.

Share