Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడువద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. ”

 

అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడువద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము.

గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు ప్రకటనకు యోహాను స్పందన ఇప్పుడు మనం చూశాము. ఆరాధించే నాలుగు సమూహాలను గమనించిన తరువాత, యోహాను తనను ఆరాధించడానికి దేవదూత పాదాల వద్ద సాగిలపడటం ద్వారా తీవ్రమైన తప్పు చేసాడు. దీనిని బట్టి దేవదూత అతనిని మందలించాడు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని అతడు యోహానును కోరాడు.

ఒక దేవదూత కేవలం యోహానుతో “సహదాసుడు” (cf. ప్రకటన 22: 8). ఒక దేవదూతను ఆరాధించడం సందేశం మరియు సందేశకుని మద్య గందరగోళపరుస్తుంది. సందేశములోని విషయము కంటే  సంభాషణకర్తను ఆరాధించే ధోరణి చాలా మందిలో ఉంది . బైబిల్ యొక్క ఉద్దేశ్యం మన దృష్టిని దేవునిపైనే కేంద్రీకరించడం, బైబిలును సంభాషించే వ్యక్తి మీద కాదు. కొంతమంది క్రైస్తవులు కొంతమంది క్రైస్తవ నాయకులను ఆరాధిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. మరోవైపు, సంభాషణకర్తను మనం గౌరవించాలని దేవుడు కోరుకుంటాడు.

“మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పు వారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి”(1 థెస్సలొనీకయులు 5:12,13).

యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. 

దేవదూత “యేసు సాక్ష్యం ప్రవచన సారము” అని పేర్కొన్నాడు. ప్రవచనములోని సారము లేదా జీవము యేసుని మహిమపరచడమే (లూకా 24; 12:17 2, 9: 25-27 1). యేసు స్తుతిపాత్రుడు.

నియమము :

ప్రవచనానికి మూలము మరియు ప్రాణము యేసే.

అన్వయము:

పాత నిబంధన క్రీస్తు యొక్క మొదటి రాకడను మరియు ఆయన రెండవ రాకడను ప్రవచించింది. మెస్సీయను స్పష్టంగా గుర్తించడానికి పాత నిబంధన ప్రవచనాలలోని అనేక భాగాలను మనము కలిపి చూడవచ్చు.

గౌరవం చెల్లించాల్సిన చోట మనము గౌరవం ఇవ్వాలి. ప్రవచనం యొక్క ఉద్దేశ్యం బైబిల్ అంతటా యేసు గొప్పతనానికి సాక్ష్యమివ్వడం. అప్పుడు ప్రవచనం యొక్క ఉద్దేశ్యం యేసును మహిమపరచడం. ప్రవచనం మనకు చివరి రోజులలో దేవుని కార్యక్రమాన్ని ఇవ్వడంలో ప్రధానంగా ఆసక్తి చూపుట లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు అనే వ్యక్తి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ఆయన దేవుని వ్యవస్థలో కేంద్ర ప్రముఖుడు.

Share