Select Page
Read Introduction to Revelation-ప్రకటన


ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది

 

19:12

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి 

యేసు, పరిస్థితి యొక్క వాస్తవికతలోని అంతర్దృష్టిని చొచ్చుకొనిపోయేవిధంగా తీర్పును ఇస్తాడు (1:14). ప్రజలు తమ ఆత్మను యేసు పరిశీలించకుండా దాచలేరు. వారు తమ వేషధారణకు ముసుగు వేయలేరు. యేసు వారి వేషధారణ గుండా విషయం యొక్క వాస్తవాన్ని సూటిగా చూస్తాడు. ఆయన వారి మోసం, వంచన, ఊహలు మరియు కపటములను చూస్తాడు. ఆయనను ఎవరూ మోసం చేయరు.

ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను

యేసు “చాలా కిరీటాలను” ధరించాడు. ఇక్కడ గ్రీకు పదం విజేత కిరీటం అనే పదం కాదు, సార్వభౌమత్వ కిరీటం అయిన మకుటం. ఇది రాజు కిరీటం. యేసు ఈ యుద్ధంలో విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా విశ్వ సార్వభౌమాధికారి అవుతాడు. ఆయన ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క కిరీటం ధరిస్తాడు. ఆయనకు నచ్చినది చేయటానికి ఆయనకు పూర్తి అధికారం ఉంది.

వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు

యేసు గొప్పతనము వర్ణనాతీతమైనది వర్ణించదగినది.

19:13

రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

ఇక్కడ వస్త్రం [పై వస్త్రం] ముంచబడిన  రక్తం శత్రువుల రక్తం . ఆయన తన శత్రువులను ఒక్కసారిగా ఓడిస్తాడు. ఈ రోజు కొంతమంది బోధించే “అందరికీ శాంతి మరియు సోదరభావం” యొక్క బోధ కాదు ఇది. మునుపెవ్వరూ చేయనంతగా రక్తం చిందేలా యేసు చేస్తాడు.

ఈ సందర్భంలో యేసు పేరు “దేవుని వాక్యం”. ఒక “వాక్యం” మనస్సులోని ఒక ఆలోచనను వ్యక్తపరుస్తుంది. దేవుని వాక్యము అనే పదము ఇతర వాక్యాలకంటే గమనార్హమైనది. యేసు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తాడు. ఆయన త్రిత్వములో వెల్లడి చేసేవాడు (యోహాను 1: 1-18).

19:14

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

యేసు తన “పరలోక సైన్యాలతో” వస్తాడు. ఈ సైన్యాలు దేవదూతల సైన్యాలు (మార్కు 8: 38 ; 13:27; 2 థెస్సలొనీకయులు 1: 7-8) మరియు సంఘము (2 థెస్సలొనీకయులు 1: 7, 10). యేసు తన దూతలతో వస్తాడు.

” తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును” (మత్తయి 25:31).

“… ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై…” (2 థెస్సలొనికయులకు 1: 7).

యేసు తన పరిశుద్ధులతో వస్తాడు.

” మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.” ( కొలొస్సయులు 3: 4).

“ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను”(యూదా 14-15).

19:15

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది.

ఈ వచనములోని “ఖడ్గము” అనే పదం పొడవైన కత్తి [కొన్నిసార్లు ఈటెగా ఉపయోగించబడుతుంది]. రోమన్ సైనికులు తమ శత్రువులను పొడవడానికి ఈ ఖడ్గమును ఉపయోగించేవారు. ఈ ఖడ్గము ప్రభువైన యేసు నోటి నుండి వస్తుంది. యేసు తన శత్రువులను ఓడించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడు. మనలో చాలా మంది మన జీవితాల్లో దేవుని వాక్యం యొక్క వాడియైన అంచులను అనుభవించాము (హెబ్రీయులు 4: 12,13). యేసు తీర్పు మాటలు అర్మగిద్దోను వద్ద గుమిగూడిన సైనికులను చంపుతాయి.

ఆయన యినుపదండముతో వారిని ఏలును;

యేసు ప్రపంచాన్ని వెయ్యేండ్ల పాలనలో పాలించనున్నాడు (20 వ అధ్యాయం). యేసు ఇనుప రాజదండంతో ప్రపంచాన్ని పరిపాలిస్తాడు (కీర్తన 2: 9; ప్రకటన 2:27). ఆయన అరాచకం లేదా అన్యాయానికి కట్టుబడి ఉండడు.

“ఏలుట” అనే పదానికి కాయుట అని అర్ధం . యేసు పాలన యొక్క స్వభావం గొర్రెల కాపరిలా ఉంటుంది. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను నీరు మరియు పచ్చని పొలాలకు నడిపిస్తాడు. గొర్రెల కాపరి తన గొర్రెలను క్రమశిక్షణలో పెట్టడానికి మరియు గొర్రెలను ఇబ్బందుల నుండి తప్పించడానికి దండమును ఉపయోగిస్తాడు.

” దండము ” అనే పదం ఆయన పాలన రాజీపడనిదని సూచిస్తుంది. సాధారణంగా, గొర్రెల కాపరులు కర్ర దండముతో పనిచేసేవారు. ఈ దండము యొక్క శక్తి పొలములోని కాపరి దండము యొక్క శక్తికంటే అతీతమైనది.

సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును

యేసు వచ్చినప్పుడు, ఆయన “సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత మరియు కోపంతో” వస్తాడు. ఆయన తీర్పు భయంకరమైన తీర్పు. ఆయన తీర్పు ద్రాక్షల గానుగలో ద్రాక్షను తన పాదాలతో నలిపి పిండిచేసి ద్రాక్ష రసాన్ని ఉత్పత్తి చేసినట్లుగా ఉంటుంది.

19:16

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది

యేసు తన బిరుదును బహిరంగంగా ప్రదర్శిస్తాడు (ఫిలిప్పీయులు 2: 9-11). గ్రీకు డెఫనెట్ ఆర్టికల్ [the] ఏ బిరుదుకు ముందు తటస్తించదు, తద్వారా ఆయన అధికార మరియు దైవ లక్షణాలను నొక్కి చెబుతుంది . ఈ బిరుదులు పాక్షికంగా ఆయన వస్త్రముపై మరియు కొంతవరకు ఆయన తొడపై ఉన్నాయి మరియు ఆయన వస్త్రము నుండి ఆయన తొడ వరకు విస్తరించాయి. ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు కాబట్టి ఎవరూ ఆయన ఆజ్ఞను ధిక్కరించరు.

నియమము :

దేవుని వాక్యం మన ఆత్మలలో శక్తివంతంగా చొచ్చుకుపోతుంది.

అన్వయము:

దేవుని వాక్యం మన మనస్సాక్షిని వేగవంతం చేస్తుంది. దేవుడు మన ఆత్మలలో చూడగలడని ఆయన మనకు అవగాహన కల్పిస్తాడు. దేవుని వాక్యం మన పాపాన్ని దోషిగా చేస్తుంది. దేవుని వాక్యం “హృదయంలోనికి దూసుకొని వెళుతుంది.”

” ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది “(హెబ్రీయులు 4:12).

Share