Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

 

ఇప్పుడు మనం చివరి మహాయుద్ధంలో ప్రపంచ సైన్యాల నాశనానికి వచ్చాము. అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ఇది. మనకు తెలిసిన నాగరికతను ఈ యుద్ధం అంతం చేస్తుంది. ఆర్మగిద్దోను యుద్ధం క్రీస్తు రెండవ రాకడను  కొనసాగిస్తుంది. ఆయన రాకముందే యుద్ధం ప్రారంభమవుతుంది. ఆయన వచ్చినప్పుడు, ఆయన సైనిక పరాక్రమం ద్వారా యుద్ధాన్ని ముగిస్తాడు.

19:17

మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, . . . . . దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

దేవుడు సరఫరా చేసిన సైనికుల గొప్ప విందు కోసం రాబందులు రావాలని ఒక దేవదూత పిలుస్తాడు. ఇది ప్రపంచ సైన్యాల వధ, పాలస్తీనా దేశంలో ఆర్మగిద్దోను యుద్ధం (యెహెజ్కేలు 38,39; యోవేలు 2; దానియేలు 11; యెషయా 24).

” దేవుని గొప్ప విందు ” గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు చాలా భిన్నంగా ఉంటుంది (19: 9). దేవుని విందు భూమిపై ప్రపంచ సైన్యాలను నాశనం చేయడం . గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు పరలోకములో ఉన్న పరిశుద్ధుల వేడుక.

19:18

రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై

రాబందుల కోసం సమృద్ధిగా ఉన్న తినుబండారాల పట్టికలో రాజుల, సహస్రాధిపతుల, బలిష్ఠుల, గుఱ్ఱముల మరియు రౌతుల మరియు చివరికి అన్ని రకాల ప్రజల మాంసము ఉంటుంది.

19:19

మరియు గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

పునరుద్ధరించిన రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడు క్రీస్తు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన దళాలను నిర్మిస్తాడు. ఇది “సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినమున జరిగే యుద్ధం” (19:14, 19-21). గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి ఇరవై లక్షలమంది సైనికులు ఒకచోట చేరారు.

19:20

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన అబద్ధప్రవక్తయు, పట్టబడి

యుద్ధంలో, క్రీస్తు పునరుద్ధరించిన రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడిని మరియు అతని అబద్ధప్రవక్తను బంధిస్తాడు. ఇది సాతాను యొక్క ఓటమిని మరియు భూమి కోసం అతని కార్యక్రమ ముగింపును సూచిస్తుంది.

వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

యేసు పునరుజ్జీవించిన రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుని మరియు అబద్ధ ప్రవక్తను ఇద్దరిని సజీవంగా  అగ్ని గంధకములతో ( సల్ఫర్ )  మండుతున్న గుండములోకి విసిరివేస్తాడు . చరిత్రలో ఈ సమయం వరకు, ఎవరూ అగ్ని గుండములో లేరు. వారు షియోల్ ( పాతాళము) లో ఉన్నారు . ఈ అగ్ని గుండము అపవాదికి మరియు వాడి దెయ్యముల కోసం తయారుచేసిన ప్రదేశం (మత్తయి 25:41). మానవులు అప్పటివరకు ఆ గుండమును ఆక్రమించరు (20: 14-15).

19:21

కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

యేసు మిగిలిన సైన్యాన్ని తన ఖడ్గముచేత చంపేస్తాడు. ఇది బలశాలియైన యోధునిగా యేసు చిత్రపటం, మీడియా లేదా సువార్తికులు అందించే ఆయన యొక్క సాధారణ చిత్రీకర కాదు .

నియమము :

దేవుడు తన న్యాయమును మరియు ప్రేమను స్థిరంగా ఉంచుతాడు.

అన్వయము:

దేవుణ్ణి ప్రేమగా చిత్రీకరించే అదే బైబిల్ ఆయన నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని కూడా చూపిస్తుంది. దేవుడు  కృపగలవాడు , కాని ఆ కృప ప్రపంచ చరిత్రలో తన తన కార్యాన్ని జరిపింది. చరిత్రలోని ఈ సమయంలో [19 వ అధ్యాయం], ఇక కృప లేదు. దేవుడు తన కృపను అంగీకరించడానికి మానవాళికి విస్తారమైన అవకాశాలను ఇచ్చాడు. మూర్ఖత్వముతో మానవులు దేవుని కృపను తిరస్కరించారు. దేవుని దీర్ఘశాంతము చివరకు ముగిసింది. “ చెల్లించవలసిన దినం” చివరకు వచ్చింది. దేవుడు ఇప్పుడు భూమిపై తన సార్వభౌమాధికారం యొక్క తుది న్యాయ తీర్పు చేయుటకు ప్రవేశించాడు.

ప్రకటన గ్రంథం బైబిల్ యొక్క ధీటైన, నగ్న సత్యాలను అందిస్తుంది. ఈ విషయాలను ప్రజల నుండి కప్పి ఉంచడం అంటే వాస్తవికతకు మరియు దేవుని వాక్యానికి నమ్మకద్రోహం.

Share