Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి. వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” 

 

మనము ఇప్పుడు పరిశుద్ధుల పునరుత్థానం మరియు ప్రతిఫలానికి వచ్చాము. పరిశుద్ధుల యొక్క రెండు సమూహాలు రాజ్యంలోకి ప్రవేశిస్తాయి:

1) శ్రమలకాలం ముందు దేవుడు పునరుత్థానం చేసినవారు మరియు శ్రమలకాలపు హతసాక్షులు మరియు

2) శ్రమల నుండి శారీరకంగా సజీవంగా బయటకు వచ్చినవారు.

20: 4

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.

సింహాసనాలపై కూర్చున్న కొంతమందికి తీర్పు చెప్పే హక్కు ఉందని యోహాను దర్శనంలో చూస్తాడు. అతను వారి గుర్తింపును ఇవ్వలేదు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని ఇతర లేఖనాలు చెబుతున్నాయి .

“మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ” (1 కొరింథీయులు 6: 1,2).

మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.

పాలించే రెండవ సమూహం శ్రమలకాలపు హతసాక్షులు. “శిరచ్ఛేదం” అనే పదానికి గొడ్డలితో నరకడం అని అర్థం . తలలు నరకడం రోమన్ శిక్ష యొక్క ఒక రూపం. వారు బహుశా పౌలు తలను అతని శరీరం నుండి వేరు చేశారు.

“యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును” మరియు “దేవుని వాక్యము నిమిత్తమును” అను మాటలలోని “నిమిత్తము” అను పదమునకు కొరకు, వలన, బట్టి అని అర్థం . వారు శిరచ్ఛేదం చేయబడటానికి కారణం సువార్త కోసమే .

వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

శ్రమలకాలములో మరణించిన హతసాక్షులు తిరిగి బ్రతికి క్రీస్తుతో భూమిపై వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు . ఈ సమయంలో, తోడేలు మరియు గొర్రె కలిసి తింటాయి. సింహం ఎద్దులాగా గడ్డిని తింటుంది. ప్రపంచ శాంతి ఉంటుంది మరియు యుద్ధం ఉండదు. దేశాలు తమ కత్తులను నాగలిగా, ఈటెలను కొడవళ్లుగా కొడతాయి.

ఇప్పుడు ఉన్నట్లుగా భూమి శాపాన్ని అనుభవించదు. భూమి దాని పంటను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తుంది. వంద సంవత్సరాల వయస్సు ఉన్నవారు చాలా యౌవనులుగా ఉంటారు (యెషయా 65:20). కొందరు పాపం చేస్తారని, అది వారి ఆయుష్షును ప్రభావితం చేస్తుందని యెషయా చెబుతూ ఉన్నాడు. పాపం వల్ల జరిగే అన్యాయాలను నియంత్రించడానికి యేసు ఇనుప దండముతో పాలన చేస్తాడు. ఈ విధంగా నీతి వెయ్యేండ్లలో వ్యాపిస్తుంది. న్యాయం విజయం సాధిస్తుంది.

20: 5

వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు;

వెయ్యేండ్లు ముగిసేవరకు మృతులైన మిగిలినవారు బ్రతుకరు. ఇది అన్ని కాలములలో మరణించినవారి పునరుత్థానం (20: 11-15). ఈ పునరుత్థానం వెయ్యేండ్ల తరువాత వరకు జరగదు(వ.11).

ఇదియే మొదటి పునరుత్థానము.

 “పునరుత్థానం” అనే పదాన్ని క్రొత్త నిబంధన 40 సార్లు ఉపయోగిస్తుంది.  లూకా 2:34 లో తప్ప ప్రతిసారి ఇది భౌతిక, శారీరక పునరుత్థానాన్ని సూచిస్తుంది .

“మొదటి పునరుత్థానం” అంటే కాలక్రమంలో మొదటి పునరుత్థానం కాదు ఎందుకంటే క్రీస్తు మృతులలోనుండి లేచిన మొదటి వ్యక్తి. క్రీస్తు లేచినప్పుడు “చాలా మంది” మృతులలోనుండి లేచారు (మత్తయి 27: 52-53).

“మొదటి” పునరుత్థానం “చివరి” పునరుత్థానానికి భిన్నంగా ఉంటుంది (20: 12-13). “మొదటి” అనే పదం “ ముందు ” అనే అర్థాన్ని కలిగి ఉంది . దుష్టుల పునరుత్థానమునకు ముందే 1000 సంవత్సరాల ముగంపులో మృతులైన నీతిమంతులు అందరూ లేస్తారు.

నీతిమంతుల పునరుత్థానం దశల్లో జరుగుతుంది (1 కొరింథీయులు 15:23). క్రీస్తు మొదట లేచాడు, తరువాత “చాలా మంది”, తరువాత సంఘము, తరువాత శ్రమలకాలపు పరిశుద్ధులు మరియు చివరిగా పాత నిబంధన భక్తులు (యెషయా 26: ​​19-21; యెహెజ్కేలు 37: 12-14; దానియేలు 12: 2-3).

20: 6

మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు.

“మొదటి పునరుత్థానం” లో పాల్గొనే వారు “ధన్యులు మరియు పరిశుద్ధులు.” నీతిమంతులై చనిపోయిన వారందరూ వెయ్యేండ్లకు ముందే లేస్తారు. ఇది శారీరక పునరుత్థానం. వారు అంతిమ పవిత్రీకరణ దశకు చేరుకున్నందున వారు “పరిశుద్ధులు”.

ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు;

“రెండవ మరణానికి” [నిత్య మరణానికి] మొదటి పునరుత్థానంలో ఉన్నవారిపై అధికారం లేదు. వారి ఆశీర్వాదం ఏమిటంటే వారు దేవుని మరియు క్రీస్తు యాజకులు మరియు క్రీస్తుతో 1,000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు .

“రెండవ మరణం” రెండవ పునరుత్థానం తరువాత అగ్ని గుండముకు శాశ్వతంగా అప్పగింపబడేవారిని సూచిస్తుంది (వ.14). మరణం అంటే వేరుచేయబడటం . యేసు విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక మరణాన్ని సిలువ వద్ద తనమీదకు తీసుకున్నాడు, కాబట్టి విశ్వాసి దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడడు.

“మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” (1 పేతురు 2:24).

వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు [విశ్వాసులు] “దేవుని మరియు క్రీస్తు యాజకులు” అవుతారు మరియు వారు “ఆయనతో వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.” ఈ ఆరాధన వెయ్యేండ్ల బాధ్యత.

సాధారణ జీవిత కాలం వెయ్యేండ్ల మొత్తం వ్యవధి వరకు ఉంటుంది. ఒక పిల్లవాడు 100 సంవత్సరాల వయస్సులో చనిపోతాడు (యెషయా 65:20). యేసు రాజ్య అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారికి తప్ప అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా సంక్షిప్త జీవిత కాలం ఉండదు (యెషయా 11: 4; 65: 20).

నియమము :

మొదటి పునరుత్థానంలో దేవుడు పరిశుద్ధులందరిని లేపుతాడు.

అన్వయము:

మొదటి పునరుత్థానం నీతిమంతుల కోసం, రెండవ పునరుత్థానం దుర్నీతిపరులకు.

“దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. (యోహాను 5 : 28,29).

ప్రకటన 20 ఈ రెండు పునరుత్థానాలను 1,000 సంవత్సరాలు వేరు చేస్తుంది. మొదటి పునరుత్థానానికి ఒక క్రమం ఉంది. దేవుడు ఒక నిర్దిష్ట క్రమం ద్వారా పరిశుద్ధులను లేపుతాడు.

“ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.”(1 కొరింథీయులకు 15: 23-24)

“వరుస” అనే పదానికి దళము, సహచరులు, పటాలము మరియు శ్రేణి అని అర్ధం . ప్రతి పునరుత్థానం వారి సహచరులు ద్వారా జరుగుతుంది. ఈ చిత్రం శ్రేణులుగా కవాతు చేస్తున్న సైన్యం, ఒక శ్రేణి మరొక శ్రేణిని అనుసరిస్తుంది. ప్రతి ఒక్కరికి పునరుత్థానంలో శ్రేణి ఉంటుంది. మొదట, శ్రమలకాలమునకు ముందు దేవుడు సంఘమును లేపుతాడు. శ్రమలకాలమునకు తరువాత, ఆయన శ్రమలకాలపు పరిశుద్ధులను మరియు పాత నిబంధన భక్తులను లేపుతాడు.

పాత నిబంధన భక్తులు, ప్రభువైన యేసు, సంఘము మరియు వెయ్యేళ్ళ పరిశుద్ధులు అందరూ మొదటి పునరుత్థానంలో పాల్గొంటారు. మొదటి పునరుత్థానం ప్రభువైన యేసు మరియు విశ్వాసులందరికీ.

Share