“ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. “
21:12
ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి.
12 గుమ్మములు, ఎత్తైన ప్రాకారము కలిగిన మహా పట్టణమును ప్రతి గుమ్మము వద్ద నిలబడియున్న దేవదూతలను యోహాను చూసాడు. ఒక గోడ కలుపుతుంది, మినహాయిస్తుంది. ఈ గోడ బయటి అక్రమ చొరబాటుదారులనుండి దేవుని మహిమను ఆపివేస్తుంది. ఈ గోడ దేవుని మహిమను కాచుతుంది.
ప్రతి గుమ్మము ఇశ్రాయేలు పన్నెండు గోత్రములలో ఒకరి పేరును కలిగి ఉంది. ప్రతి గుమ్మము వద్ద పన్నెండు కావలి దేవదూతల నిలబడి ఉన్నారు.
21:13
తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి.
నగరం యొక్క నాలుగు వైపులా మూడు ద్వారాలు ఉన్నాయి (21:16). ఇది భూమిపైన వెయ్యేండ్ల పాలనలోని యెరూషలేము వంటిది కాదు (యెహేజ్కేలు 48:31-34).
21:14
ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.
నూతన యెరూషలేము నగరం యొక్క పన్నెండు పునాదులు గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపొస్తలుల పేర్లను కలిగి ఉన్నాయి. ఇశ్రాయేలు మరియు సంఘము రెండూ నూతన యెరూషలేములో ఉంటాయి. ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల పేర్లు గుమ్మములపై ఉన్నాయి (21:12).
21:15
ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
ఒక బంగారు కొలకఱ్ఱతో దూత ఆ పట్టణముయొక్క గుమ్మములను, ప్రాకారమును కొలిచాడు ( 10 అడుగుల దూరం ) .
21:16
ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము.
ఆ నగరం పొడవు మరియు వెడల్పు ఒకే కొలత.
అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది;
ఆ నగరం ఎత్తు, దాని వెడల్పు మరియు పొడవు 1,367 మైళ్ళు. ఇక్కడ వివరణ పిరమిడ్ లేదా ఘనాకారమును వర్ణిస్తుంది.
దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
నగరం యొక్క స్థావరం 5468 మైళ్ల చుట్టుకొలత, దాని ఎత్తును మినహాయించి.
21:17
మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
ఆ పట్టణపు ప్రాకారము 216 అడుగుల ఎత్తు. “మనిషి కొలత చొప్పున ” అనే పదానికి అర్ధం పరలోకములోని దేవదూత మానవ కొలత ప్రమాణాలను ఉపయోగిస్తాడు.
21:18
ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
నూతన యెరూషలేము యొక్క ప్రాకారము సూర్యకాంతపు రాయితో మరియు స్పష్టమైన అద్దము వంటి స్వచ్ఛమైన బంగారుతో నగరం తయారు చేయబడింది. పారదర్శకత గురించి నిరంతరం ప్రస్తావించడం దేవుని మహిమ యొక్క ప్రసరణ గూర్చి ఆలోచింపజేస్తుంది.
బంగారం విలువైనది ఎందుకంటే అది బహిరంగంగా నేలపై ఉండదు. మనకు విలువైనది పరలోకములో సాధారణమైనది.
21:19
ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
దేవుడు ప్రాకారము యొక్క పన్నెండు పునాదులను పన్నెండు రత్నములతో అలంకరించాడు . సూర్యకాంతపురాయి నీలం రంగులో ఉంటుంది. నీలమణి స్వచ్ఛమైన నీలం రంగులో ఉంటుంది మరియు కాఠిన్యంలో వజ్రంతో పోల్చవచ్చు. యమునారాయి నీలం మరియు ఊదా మరియు పసుపు వంటి ఇతర రంగులో ఉంటుంది. పచ్చ ప్రకాశవంతమైన ఆకుపచ్చగా ఉంటుంది.
21:20
అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
వైడూర్యము నీలం తెలుపు రంగులో ఉంటుంది. కెంపు ముదురు -ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. కెంపు మరియు సూర్యకాంతము నాల్గవ అధ్యాయంలో దేవుని మహిమను ప్రతిబింభించాయి (4: 3). సువర్ణరత్నము బంగారం రంగులో ఉంటుంది ( ఆధునిక సువర్ణరత్నము రాయి లేత ఆకుపచ్చ రంగు ఉంటుంది ) . ఎనిమిదవ రాయి, గోమేధికం, పారదర్శక సముద్ర ఆకుపచ్చ రంగులో ఉంటుంది . పుష్పరాగము పారదర్శక పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటుంది . సువర్ణల శునీయము పసుపుతో కలిపి ఆకుపచ్చగా ఉంటుంది. పద్మరాగము ఊదారంగు లేదా ఎరుపు పసుపుతో కలిపి ఉంటుంది. సుగంధము ఊదా రంగులో ఉంటుంది.
ఈ రంగుల కలయిక నగరానికి అందం యొక్క అమరికను అందిస్తుంది. నగరం యొక్క సౌందర్యం కంటికి అందం యొక్క వర్ణవిశ్లేషణముతో అలరిస్తుంది . ఈ సౌందర్యం దేవుని అందాన్ని ప్రతిబింబిస్తుంది.
21:21
దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది.
పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యాలు. “ముత్యాల గుమ్మములు” అనే పదాన్ని మనం పొందే వచనం ఇది. ఈ గుమ్మములలో ప్రతి దాని నుండి ప్రవేశ ద్వారం చేయడానికి సరిపడ పెద్ద ముత్యం ఉంది.
పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.
నగర వీధులు గాజు వంటి స్వచ్ఛమైన బంగారం కలిగివున్నాయి. ఇది స్పష్టంగా గొప్ప వైభవము గల నగరం.
నిత్యత్వము యొక్క వివరాల గురించి బైబిలు పెద్దగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే అవి భూసంబంధమైన మనస్సులకు అర్థం కానివి . మన ప్రస్తుత పదజాలంలో వర్ణించడం అసాధ్యం. మనకు నిత్యత్వము కోసం పదజాలం లేదు. నిత్యత్వము యొక్క వివరణ భాష ద్వారా పరిమితం చేయబడింది. మన శాశ్వతమైన గృహము ఎంతో విలువైన ప్రదేశం (1 పేతురు 1: 3-5, 7-18; 2:11).
నియమము :
నియమిత వ్యక్తుల కోసం నియమించబడిన ప్రదేశం పరలోకం.
అన్వయము:
పరలోకంలో స్థానం కలిగి ఉండటం ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని పిల్లలుగా మనకు గొప్ప భవిష్యత్తు ఉంది. మనము పరలోకంలో ఉన్న మన ఇంటిపై చెల్లింపును చేసాము. ఎవరంటే వారు అక్కడ స్థానం పొందలేరు. ఇది దేవుని స్వజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన నగరం.
గ్యారేజీలోకి నడిచినంతమాత్రాన అది మనలను కారుగా చేయదు. కోళ్ళ ఫారములోకి అడుగుపెట్టినందున, అది మనలను కోడిని చేయదు. చర్చిలోకి నడవడం మమ్మల్ని క్రైస్తవునిగా చేయదు. సిలువపై ఆయన మరణం ద్వారా మన పాపాలకు ఋణం చెల్లించిన వ్యక్తిగా యేసు ప్రభువును హత్తుకొనడమే మనం పరలోకానికి చేరుకునే ఏకైక మార్గం.
ఈ నగరంలోని ప్రజల కంటే పరలోకంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. మెస్సీయ / క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ పరలోకం కలిగి ఉంటుంది. పరిపూర్ణమైన ప్రదేశానికి మనం వెళ్ళగల ఏకైక మార్గం పరిపూర్ణంగా ఉండడమే. మనలో మనం పరిపూర్ణంగా ఉండలేము. మనము యేసువలె నీతిమంతులమని అని యేసు మాత్రమే ప్రకటించగలడు.