“దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము”
ఇప్పుడు దేవదూత యోహానును నూతన యెరూషలేము నగరంలోకి నడిపిస్తున్నాడు. స్వచ్చమైన స్పటికము వంటి శుద్ధ సువర్ణముతో నిర్మించిన వీధులను అతను గమనించాడు (21:21). ఈ నగరంలో దేవాలయం లేదని అతను చూసాడు.
21:22
దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు
నూతన యెరూషలేములో దేవాలయం ఉండదు ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు గొర్రెపిల్ల యొక్క తక్షణ సన్నిధియే దాని ఆలయం అవుతుంది. దేవుని సన్నిధి ఆలయ గోడల ద్వారా పరిమితం కాదు. మనతో దేవుని శాశ్వతమైన సన్నిధి ఉంటే ఆలయం అవసరం లేదు.
21:23
ఆ పట్టణములో ప్రకా శించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది
సూర్యుడు లేదా చంద్రుని నుండి వెలుగు అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ నూతన యెరూషలేమును ప్రకాశింపజేస్తుంది.
గొఱ్ఱెపిల్లయే దానికి దీపము
గొర్రెపిల్ల నగరాన్ని వెలిగిస్తాడు. ఈ ఆలయంలో బలి లేదు ఎందుకంటే గొర్రెపిల్ల దాని వెలుగు (యోహాను 1: 7-9; 3:19; 8:12; 12:35). పరలోకం క్రీస్తు కేంద్రీకృతమై ఉంది. ఆయన నిత్యత్వమంతటి ఆకర్షణకు కేంద్రంగా ఉంటాడు.
నియమము :
ప్రభువైన యేసుక్రీస్తును మన జీవితానికి కేంద్రంగా చేసుకోవాలి.
అన్వయము:
యేసు మీ జీవితంలో ప్రముఖ వ్యక్తినా? ఆయన ఉంటే, మనం శాశ్వతత్వం కోసం మంచి ఆచరణలో ఉన్నాము – ఎందుకంటే అది నిత్యత్వములో మన ప్రధాన వృత్తి అవుతుంది. పరలోకములో మనం అనుభవించే సహవాసం భూమిపై తెలిసిన సహవాసమును మించిపోతుంది. మన ఆరాధన అక్కడ పరిపూర్ణంగా ఉంటుంది.
“సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. ” (కొలొస్సయులు 1:18).