“అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.”
21: 5
అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను;
సింహాసనంపై ఆసీనుడైయున్నవాడు “సమస్తమును నూతనముగా చేస్తాను” అని నొక్కి చెప్పాడు. నిత్యత్వములో, నూతనత్వము యొక్క శాశ్వత స్థితి ఉంటుంది. ప్రతిదీ ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. నూతన ఆకాశం మరియు భూమి ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాని నుండి సమూలమైన మార్పు కలిగి ఉంటాయి.
మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
మరోసారి, యోహాను తన దర్శనం యొక్క ప్రత్యేకతలను వ్రాయడానికి సూచనలను అందుకున్నాడు. అతను ఈ విషయాలను కాగితంపై వ్రాయడానికి కారణం “ఈ మాటలు సత్యమైనవి మరియు నమ్మకమైనవి.” దేవుడు చెప్పిన ప్రతిదానిలో పరిపూర్ణ నిజాయితీ ఉంది [సత్యమైనవి]. ఆయన ఎప్పుడూ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోడు[నమ్మకమైనవి]. దేవుడు వాగ్దానం చేసిన దానిపై తన హామీని ఇస్తాడు.
21: 6
మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను;
సింహాసనంపై ఉన్నవాడు యోహానుకు ఇది “సమాప్తమైనది” అని భరోసా ఇస్తున్నాడు. ఈ ప్రవచనం ఇదివరకే జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు . ప్రభువైన యేసు వ్యక్తిగతంగా పరలోకంలో విశ్వాసి యొక్క నిత్యత్వమునుగూర్చి హామీ ఇస్తాడు. గ్రీకులో “సమాప్తమైనది” అనే పదానికి అది సాధించబడిందని అర్థం . మనకు నిత్యత్వము యొక్క హామీ ఉంది మరియు ఆ హామీ ఎప్పటికీ ఉంటుంది.
సింహాసనంపై ఉన్నవాడు ఇప్పుడు తనను తాను “నేను ఆల్ఫా మరియు ఒమేగా, ఆదియు అంతమును ” అని తెలియజేసాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ( ప్రక. 1: 8; 22: 12,13). గ్రీకు వర్ణమాలలో ఆల్ఫా మొదటి అక్షరం మరియు ఒమేగా చివరిది. ఆరంభం నుండి అంతము వరకు, యేసు ప్రతిదీ కలిగి ఉంటాడు. తన అధికారమును బట్టి నిత్యుడు మనకు నిత్యత్వము యొక్క హామీని ఇస్తాడు. “ఆదియు అంతము” అనే పదాలు కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తాయి.
దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
“దాహముగొనినవారికి” జీవజలమును ఉచితముగా యేసు అనుగ్రహిస్తాడు.
” దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి
రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి.
రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.” (యెషయా 55: 1)
“ అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.”(యోహాను 4:13, 14).
“అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.” (యోహాను 6:35).
నియమము :
మనలో ప్రతి ఒక్కరూ మనం శాశ్వతత్వం ఎక్కడ గడుపుతాము అనే గంభీరమైన సత్యాన్ని ఎదుర్కోవాలి.
అన్వయము:
మనము ఒక రోజు యేసును ముఖాముఖిగా కలుస్తాము. దీని నుండి తప్పించుకునే అవకాశం లేదు. మనం క్రైస్తవులుగా క్రీస్తు తీర్పు పీఠము వద్ద గాని లేదా ధవళమైన మహా సింహాసనం ముందు క్రైస్తవేతరులుగా గాని నిలబడతాము. మన పాపాల కోసం క్రీస్తు పూర్తి చేసిన పనిని మనం అంగీకరిస్తే, ఆయనతో శాశ్వత కాలము గడుపుతాము.
తనను రక్షకుడిగా అంగీకరించడానికి ఎంచుకున్న వారికందరికి యేసు నిత్యజీవమును ఉచితంగా ఇస్తాడు. పరలోకములో ప్రవేశానికి ఆయన ఏమీ వసూలు చేయడు.