Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును

 

జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును;

ఇక్కడ జయించువాడు అంటే “అన్నింటినీ వారసత్వంగా పొందిన ” క్రైస్తవుడు. దేవుడు అతనికి దేవుడుగా ఉంటాడు మరియు జయించువాడు దేవుని “కుమారుడు” అవుతాడు. నిత్యత్వములో దేవునికి మరియు ఆయన ప్రజల మధ్య ప్రత్యేక సంబంధం ఉంటుంది.

నేనతనికి దేవుడనై యుందును

దెవునితో మనకున్న సంబంధం మన మంచితనం మీద ఆధారపడి ఉండదు. ఇది సిలువపై క్రీస్తు చేసిన కార్యము మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది . మన పాపాన్ని తీర్చడానికి యేసు మరణాన్ని మనం అంగీకరించిన క్షణం నుండి, దేవుడు మన దేవుడు అవుతాడు.

అతడు నాకు కుమారుడైయుండును 

ఈ సంబంధం ఒక సమయములో ప్రారంభమైంది మరియు శాశ్వత కాలము వరకు కొనసాగుతుంది (గలతీయులు 4: 1-7). మనము ఒక సమయములో క్రీస్తును స్వీకరించడానికి ఒక నిర్ణయం తీసుకుంటాము మరియు అది శాశ్వతత్వం వరకు ఉంటుంది (యోహాను 5:24).

నియమము :

క్రైస్తవులకు నిత్యత్వములో వారసత్వం ఉంది.

అన్వయము:

క్రీస్తును విశ్వసించే ప్రజలకు స్వాస్థ్యము ఉంది. వారు “అన్నిటినీ” వారసత్వంగా పొందుతారు.

“ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు ” (అపొస్తలుల కార్యములు 20:32).

” వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.'” ( అపొస్తలుల కార్యములు 26:18).

” మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” (రోమ ​​8 : 16, 17).

“తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము” (కొలొస్సయులు 1:12).

“మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై . . . . ” (తీతు 3: 6).

“… జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు….” (1 పేతురు 1: 4).

Share