Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ఇప్పుడు మనం భయంకరమైన వచనానికి వచ్చాము .

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును

దేవునితో శాశ్వతకాలము నిలిచే క్రైస్తవులకు విరుద్ధంగా, ఇప్పుడు మనము దేవుని పక్షముగా నిలబడని వారిని చూద్దాము. వీరందరు “అగ్నిగందకములతో మండు గుండములో పాలుపొందుతారు”.

క్రైస్తవేతరుల యొక్క ఎనిమిది లక్షణాలను మనం చూస్తాము . మొదట, “పిరికివాడు” ధైర్యములేనివారు. వారిని శాశ్వతంగా రక్షించే దేవుణ్ణి విశ్వసించకుండా వారు తమ భయాలకు లోనవుతారు. వారు మరణానికి భయపడతారు. యేసును రక్షకుడిగా స్వీకరించకపోవడం పిరికితనం.

” కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను”(హెబ్రీయులు 2: 13).

” అవిశ్వాసులు” తమ రక్షణకై క్రీస్తు సంపూర్తి చేసిన కార్యము పట్ల వ్యక్తిగత నమ్మకము లేనివారు (యోహాను 3 : 16-18). తీర్పుకు దారితీసే సమస్య ఇది . ఈ వ్యక్తులు నిజాయితీ లేనివారు లేదా లైంగిక దుర్మార్గులు కాకపోవచ్చు; వారు రక్షణకు ఏకైక మార్గమైన సిలువను తిరస్కరించారు.

“ ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను.”(యోహాను 3:18).

“అసహ్యులు” అనగా కలుషితమైనవారు. ఇక్కడ కాలుష్యం విస్తృత అర్ధాన్ని కలిగి ఉంది. క్రైస్తవేతరులు పాపంతో కలుషితమవుతారు . కొంతమందికి “నరహంతకులుగా” ఉంటారు మరియు మానవ జీవితాన్ని ద్వేషిస్తారు. ఇంక, ” వ్యభిచారులు ” నైతికంగా దిగజారినవారు (హెబ్రీయులు 13: 4).

“మాంత్రికులు” అన్యమత ఆచారాలకు తమను తాము అప్పగించుకొనినవారు.  ఫర్మీసియ, అనే గ్రీకు పదం మాదక ద్రవ్యాలతో వ్యవహరించే మత వ్యవస్తను సూచిస్తుంది . ఈ వ్యక్తులు చేతబడి, క్షుద్రము మరియు రాక్షసత్వాన్ని అభ్యసిస్తారు. శ్రమలకాలములో “విగ్రహారాధన” ప్రబలంగా ఉంటుంది.

అగ్నిగుండములో పడవేయబడే చివరి వర్గం “అబద్దికులందరు”. దేవుడు మోసగాళ్లను మరియు వేషధారులను క్రీస్తు లేని , దేవుడు లేని నిత్యత్వములోకి పడవేస్తాడు

పై లక్షణాలు ఏవీ లేని వ్యక్తులు పరలోకములో నిత్యత్వాన్ని అనుభవిస్తారు. క్రైస్తవులందరూ పరమ పవిత్రతను అనుభవిస్తారు . వారు ఎప్పటికీ దేవుని ముందు పాపం లేకుండా జీవిస్తారు. ఈ ఎనిమిది లక్షణాలలో దేనినీ వారు నిత్యత్వములో ప్రదర్శించరు.

అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు;

నశించువారు శారీరక మరణం తరువాత రెండవ మరణం మరణించాలి – దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు అనే మరణం. “పాలు” అనే పదానికి కేటాయింపు అని అర్ధం .

ఇది రెండవ మరణం.

రెండవ మరణం దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు (20:14). మన భౌతిక జీవము పనిచేయడం మానేసినప్పుడు మనం ఒక్కసారి చనిపోతాము (హెబ్రీయులు 9:27). మనము క్రీస్తు లేని నిత్యత్వంలోకి ప్రవేశించినప్పుడు రెండవసారి చనిపోతాము . ఒక క్రైస్తవుడు రెండవ మరణం ఎప్పటికీ మరణించడు (యోహాను 5:24).

నియమము :

మంచి పనులు మనకు పరలోకానికి అర్హత ఇవ్వవు లేదా చెడు పనులు మనలను పరలోకం నుండి దూరంగా ఉంచవు.

అన్వయము:

చెడు పనులు మనలను పరలోకం నుండి నిరోధించవు. అది క్రియల ద్వారా రక్షణ అవుతుంది. ఈ వచనం దేవుణ్ణి ఎరుగని వారిని వివరిస్తుంది. మంచి పనులు మనకు శాశ్వతమైన జీవితాన్ని సంపాదించలేవు. నిత్యజీవానికి ఆధ్యాత్మిక పుట్టుక [క్రొత్తగా జన్మంచుట] అవసరం.

” మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును ”(హెబ్రీయులు 9: 27-28).

Share