“ ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.”
ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
లేఖనంలో దేవుని చివరి వాక్యము కృపగల వాక్యము . ఇది గ్రంధము యొక్క వందన వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృప మాత్రమే మనందరినీ నిలుబెడుతుంది. దీనికి మన “ఆమేన్” ను కూడా జోడించాలి.
క్రైస్తవులకు కృప యొక్క ప్రబోధం క్రీస్తు లేనివారికి పూర్తి భిన్నంగా ఉంటుంది .
నియమము:
మనలో ప్రతి ఒక్కరూ దేవుని నిరంతర కృప కొరకైన మన అవసరాన్ని తెలుసుకోవాలి.
అన్వయము:
జీవితంలో మనం ఎదుర్కొనే దేనికైనా దేవుని నిరంతర కృప యొక్క వాగ్దానం మనకు ఉంది. ఇది ప్రతికూలత లేదా పారవశ్యం అయినా, దేవుడు తన కృప ఎల్లప్పుడూ మనకై ఉంటుందని వాగ్దానం చేశాడు.
యేసు క్షణసమయములో రావచ్చు. ఆయన రాకముందు సంకేతాలు నెరవేర్చాల్సిన అవసరం లేదు. సంఘము ఎత్తబడుట అను సంఘటన అనేది సంకేతం లేని, కాలాతీత సంఘటన. ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చు.
ఈ రోజు యేసు వస్తే… ఓహ్, ఎంత ఆశీర్వాదమైన రోజు !!
ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేసేవారికి యేసు ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ అధ్యయనంలో అయన మిమ్మును కూడా ఆశీర్వదించెనని నమ్ముచున్నాను.