Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు

 

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు

పరలోకములో శాపము ఎంతమాత్రము లేదు. ఆదాము హవ్వలు ఏదెను తోటలో పాపము చేసిన తరువాత, దేవుడు వారిపై మరియు భూమిపై శాపం పెట్టాడు (ఆదికాండము 3: 14,17; గలతీయులు 3: 10,13). ఇక్కడ “శాపం” అనే పదం ఉదృతమైన పదం. ఇది శపించబడిన విషయాన్ని సూచిస్తుంది. దేవుడు తన సన్నిధి నుండి శపించబడిన వ్యక్తిపై నిషేధం విధించాడు.

దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

యోహాను ఇప్పుడు దేవుని వైపు  మరియు గొర్రెపిల్ల సింహాసనం వైపు తిరుగుతున్నాడు. సింహాసనం ఇప్పుడు ఆలయం స్థానంలో దేవుని సన్నిధికి కేంద్రంగా ఉంది. దేవుని సింహాసనం ఈ నగరంలో ఉంటుంది మరియు పరిశుధ్ధులు ఆయనను  సేవిస్తారు.

దేవుని సింహాసనం ఆయన సార్వభౌమత్వముతో పరిపాలిస్తాడని సూచిస్తుంది.  శాశ్వత రాజ్యములో పరిపూర్ణ ప్రభుత్వం ఉంటుంది. అక్కడ కోర్టులు లేదా జైళ్లు ఉండవు.

ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు

“సేవించుచు” అనే పదం యజకత్వమను తెలుపుతుంది. ఈ సేవ అంటే ఆరాధించడం, దేవుని సేవ చేయడం . మన సేవ ఎప్పటికీ తగ్గదు లేదా క్షీణించదు. ఇక్కడ సేవ అసంపూర్ణమైనది అయితే, అక్కడ మన సేవ స్వచ్ఛంగా ఉంటుంది. మన సేవను శరీరతత్వముతో, తప్పుడు ఉద్దేశ్యాలతో మరియు అహంకారంతో ఇక్కడ మార్చుకుంటాము. ముందుకు సాగడానికి లేదా ప్రసిద్ధి చెందడానికి మనము తరచుగా సేవలను ఉపయోగిస్తాము. కానీ అక్కడ మన సేవ తప్పు లేకుండా ఉంటుంది.

నియమము:

దేవుడు ఏదేను తోట యొక్క శాపమును శాశ్వతంగా తొలగిస్తాడు.

అన్వయము:

క్రొత్త యెరూషలేములో శాపము ఉండదు. ఈ నగరంలో ఆసుపత్రులు ఉండవు, పోలీసు స్టేషన్లు లేదా అంత్యక్రియల గృహాలు కూడా ఉండవు. ఈ నగరం యొక్క ప్రాథమిక నిర్మాణం దాని ముందు ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది. అపవాది లేదా పాపం సామర్థ్యం కూడా ఉండవు. అక్కడ బాధలే ఉండవు.

” మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. “(రోమా 8:18-23)

దేవుడు నాశనము కానేరని నూతన విశ్వం మరియు భూమిని సృష్టిస్తాడు. అప్పటి వరకు ఈ భూమి అవినీతి, మోసం, అనైతికతతో నిండి ఉంటుంది. పాపం ఉన్నంతవరకు మచ్చలు భూమి యొక్క ముఖాన్ని కప్పివేస్తాయి మరియు మానవులు తమ కోసం తాము జీవించడం కొనసాగిస్తారు. యేసు తిరిగి వచ్చేవరకు అహంకారం సమస్యగా ఉంటుంది.

కలుపు, గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది. నేడు విషయాలను ఒప్పించడం కష్టం కాని నిత్యత్వములో ఆ సమస్య ఉండదు.

పరలోకములో సహవాసము ఇక్కడ భూమిపై సహవాసము కంటే ఎక్కువగా ఉంటుంది. పాపమునకైన మన సామర్థ్యం వల్ల ఇక్కడ సహవాసము అసంపూర్ణమైనది. ఇతర వ్యక్తులు మన లోపాలను మనం చూడగలిగినంత స్పష్టంగా చూస్తారు. ఈ లోపాలు ఇక్కడ మన సహవాసమునకు ఆటంకం కలిగిస్తాయి. కానీ అక్కడ మన సహవాసములో లోపాల నుండి విముక్తి పొందుతాము.

ధరామశాస్త్ర క్రింద పనిచేసే వారందరూ శాపానికి లోనవుతారు.

” క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను … “  (గలతీయులకు 3:13).

నిత్యత్వం కోసం మనలను స్వస్థపరిచేది యేసు. మన పాపములకై ఆయన సిలువపై చనిపోయాడని నమ్ముతున్నప్పుడు ఆయన మన పాపములను నిత్యత్వం కోసం క్షమించును.

“… మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.” (1 పేతురు 2:24).

Share